Home Blog Page 58

Chuttamalle: ‘చుట్టమల్లే’ పాటకు ఏఐ వికృత చేష్టలు… ఎన్టీఆర్, జాన్వీల మార్ఫింగ్ వీడియోలపై భగ్గుమంటున్న నెటిజన్లు

‘దేవర’ సినిమాలోని చార్ట్‌బస్టర్ సాంగ్ “చుట్టమల్లే” చుట్టూ ఏఐ ఆధారిత సరికొత్త వివాదం చెలరేగింది. కొందరు డిజిటల్ క్రియేటర్లు ఏఐ సాంకేతికతను దుర్వినియోగం చేస్తూ, ఎన్టీఆర్, జాన్వీ కపూర్‌ల హావభావాలను మార్చేసి పాటలో లేని అసభ్యకర, అభ్యంతరకర దృశ్యాలను సృష్టిస్తున్నారు. ఇది అసలైన పాటలోని విజువల్సేనని భ్రమపడుతుండటంతో నటీనటుల ప్రతిష్టకు భంగం వాటిల్లుతోందని సినీ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. క్రియేటివిటీ పేరుతో వ్యక్తుల గౌరవాన్ని దిగజార్చేలాంటి మార్ఫింగ్ క్లిప్పులు రూపొందించిన వారిని తక్షణమే గుర్తించి, జైలుకు పంపాలని నెటిజన్లు తీవ్రస్థాయిలో డిమాండ్ చేస్తున్నారు.

‘మీ సాహసం దేశానికే గర్వకారణం’… రియల్ హీరో కెప్టెన్ స్మిత్‌ మచ్చర్‌పై చిరంజీవి ప్రశంసల జల్లు

ఫ్లైదుబాయ్ విమానంలో కో-పైలట్ దాడి చేసినప్పటికీ ప్రాణాలకు తెగించి ప్రయాణికులను కాపాడిన భారతీయ పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్‌పై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు కురిపించారు. తీవ్ర గాయాల పాలైన స్థితిలోనూ ఒంటిచేత్తో పోరాడి వందలాది ప్రాణాలను నిలబెట్టిన ఆయన ధైర్యం ప్రతి భారతీయుడికీ గర్వకారణమని కొనియాడారు. విపత్కర పరిస్థితుల్లో హనుమాన్ చాలీసా పఠిస్తూ మనోధైర్యాన్ని కూడగట్టుకున్నారని తెలిసి తన మనసు చలించిందని చెబుతూ, ఆంజనేయస్వామి ఆశీస్సులతో స్మిత్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

చేపలు కొనేటప్పుడు ఏవి పడితే కొనొద్దు, తాజా చేపల్ని ఎలా గుర్తించాలంటే

0
మార్కెట్లోకి అడుగుపెట్టగానే కూరగాయలన్నీ ఒకవైపు ఉంటే చేపలు అమ్మే ప్రదేశం మరోవైపు ఉంటుంది. కారణం కాస్తా వాసనలు వస్తుంటాయి. ఇవి అందరికీ నచ్చవు. ఒక్కోసారి తినేవారికి కూడా ఆ వాసనలు పడకపోవచ్చు. దీంతో అక్కడికి వెళ్లి అక్కడ ఎక్కువ సమయం ఉండడం కంటే అమ్మేవారు ఇచ్చే చేపల్ని రేటు మాట్లాడి తీసుకొస్తుంటారు. మరి అవి మంచివా కాదా ఎలా తెలుసుకోవాలని ఆలోచించరు. ఏ చేపలైనా ఒకటేగా అనుకుంటారు. కానీ, అస్సలు కాదు. తాజా చేపలు, కుళ్ళిన చేపలకి చాలా తేడా ఉంటుంది. తాజా చేపల బదులు కుళ్ళినవి వండుకుంటే నోటికే కాదు, ఆరోగ్యానికి కూడా అస్సలు మంచివి కాదు. అలాంటప్పుడు మరి తాజా చేపల్ని ఎలా గుర్తించాలి. తాజా చేపల్ని కనుక్కోవాలంటే ఏం చేయాలి. ఎలాంటి విషయాలని గమనిస్తే చేపలు తాజాగా ఉన్నాయో ఎలా గుర్తించాలో తెలుసుకోండి.

రెస్టారెంట్‌లో భోజనం చేసేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన 5 విషయాలు

0
రెస్టారెంట్‌కు వెళ్లినప్పుడు మన దృష్టి సాధారణంగా మెనూ, ఆహారం రుచి, ధర, సర్వీస్‌పైనే ఉంటుంది. అయితే టేబుల్‌పై మన ప్రవర్తన కూడా అంతే ముఖ్యమైనది. ఇంట్లో భోజనం చేసేటప్పుడు సహజంగా చేసే కొన్ని పనులు బయట అందరి ముందు చేయడం సరైనదిగా భావించరు. ముఖ్యంగా ఫైన్‌ డైనింగ్‌ రెస్టారెంట్లలో భోజనం చేసేటప్పుడు కొన్ని చిన్న నియమాలను పాటించడం ద్వారా మనతో పాటు టేబుల్‌పై ఉన్న ఇతరులకు కూడా సౌకర్యంగా ఉంటుంది. అందుకే రెస్టారెంట్‌లో భోజనం చేసేటప్పుడు పాటించాల్సిన టేబుల్‌ ఎటికెట్‌ ఏమిటో తెలుసుకుందాం.

ఆకుకూరల్ని ఫ్రిజ్‌లో పెట్టినా పాడవుతున్నాయా, కొన్ని కూరగాయల మధ్య అస్సలు పెట్టొద్దు అవేంటంటే

0
​ఆకుకూరలు తాజాగా ఉండాలని ఫ్రిజ్‌లో పెట్టినప్పటికీ అవి ఫ్రెష్‌గా ఉండవు. పైగా వడలిపోయినట్లుగా ఉంటాయి. కొన్నిసార్లు తేమ ఎక్కువై మరీ మెత్తగా అయిపోతుంటాయి. ఇలాంటివాటిని చూసి అసలు వండాలనిపించదు కూడా. అలాంటప్పుడు వీటిని కొనుక్కొచ్చి ఫ్రిజ్‌లో ఉంచి మరీ పారేస్తుంటాం. అలా కాకుండా వండినప్పుడే తీసుకొద్దామంటే వండాలనుకున్నప్పుడే మార్కెట్‌‌కి వెళ్ళం. కాబట్టి, ముందుగానే తెచ్చేసి పెట్టుకుంటాం. అలా తీసుకొచ్చి స్టోర్ చేసినప్పుడు ఎక్కువ రోజులు ఆకుకూరలు తాజాగా ఉండాలంటే ఏం చేయాలో తెలుసుకుని తీరాలి. కొన్ని చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే మనం కొనుక్కొచ్చి తిరిగి వండేవరకూ తాజాగానే ఉంటాయి. మరి ఆ టిప్స్ ఏంటంటే

కిడ్నీలు పాడయ్యే ముందు కనిపించే లక్షణాలివే, డయాలసిస్ ఎప్పుడు అవసరమంటే?

0
కిడ్నీలు మానవ శరీరంలో ముఖ్యమైన అవయవం. ఇవి నిశ్శబ్దంగా పనిచేసే సహజమైన ఫిల్టర్లు. రక్తంలోని వ్యర్థాలు, టాక్సిన్లను ఫిల్టర్ చేసి యూరిన్ ద్వారా బయటకు పంపడం వీటి ప్రధాన విధి. కిడ్నీ వ్యాధుల్ని వైద్యులు, నిపుణులు సైలెంట్ కిల్లర్ అని పిలుస్తారు. ఎందుకంటే స్టార్టింగ్ స్టేజ్‌లో కిడ్నీ వ్యాధుల లక్షణాలు చాలా స్వల్పంగా, కేవలం సాధారణ అలసటలా మాత్రమే కనిపిస్తాయి.

వ్యాధి తీవ్రమయ్యే వరకు చాలా మందికి ఈ సమస్య ఉన్నట్టే తెలియదు. అందుకే ప్రారంభ సంకేతాల్ని గమనించాలి. అప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోని కిడ్నీలను కాపాడుకోవచ్చు. అసలు కిడ్నీ వ్యాధి దశలు ఎన్ని రకాలు, ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి, ముఖ్యమైన పరీక్షలు, ఆహార నియమాలు గురించి పూర్తి వివరాల్ని డాక్టర్ దిలీప్ ఎం. బాబు, (సీనియర్ కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ అండ్ ట్రాన్స్‌ప్లాంట్ ఫిజీషియన్, యశోద హాస్పిటల్స్, హైదరాబాద్) అందించారు. ఆ పూర్తి వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఐస్‌బాత్ చేస్తే నిజంగానే ఆరోగ్యానికి అంత మంచిదా, ఎవరుచేయాలి ఎవరు చేయకూడదు

0
ఐస్‌బాత్‌.. గడ్డకట్టే చలిలో మైనస్ డిగ్రీల నీటితో స్నానం చేయడాన్నే ఐస్‌బాత్ అంటారు. చల్లని నీటిలో కొన్ని నిమిషాల పాటు కూర్చుని బయటికి వస్తుంటారు ఐస్‌బాత్‌లో. ఇలా చేస్తే ఫిజికల్ అండ్ మెంటల్‌గా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని చెబుతుంటారు. ఒకప్పుడు సెలబ్రిటీలు, స్పోర్ట్స్ రంగంలో ఉన్నవారు మాత్రమే ఈ ఐస్‌‌బాత్ థెరపీని తీసుకునేవారు. కానీ, ఎప్పుడైతే దీని వల్ల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయంటూ ప్రచారం మొదలైందో అప్పుడు సామాన్యులు కూడా ఐస్‌బాత్ చేసేస్తున్నారు. బాడీని 10 నుంచి 15 డిగ్రీల కంటే తక్కువ టెంపరేచర్ నీటిలో 10 నుంచి 15 నిమిషాల పాటు ఉంచితే రక్తప్రసరణ పెరగడం దగ్గర్నుంచీ మానసిక లాభాలు కూడా ఉంటాయని ఊదరగొడుతున్నారు. అయితే, ఐస్‌బాత్ చేస్తే అందరికీ కచ్చితమైన లాభాలుంటాయా. దీని గురించి డాక్టర్ దిలీప్ గూడె(సీనియర్ కన్సల్టెంట్ ఫిజిషియన్, యశోద హాస్పిటల్స్, హైదరాబాద్) ఏమంటున్నారు ఇప్పుడు చూద్దాం.

భారత్‌లోనే అతిపెద్ద జియో ఐపీఓకు డేట్ ఫిక్స్? రూ. 36 వేల కోట్ల పబ్లిక్ ఇష్యూ అక్టోబర్ 21న ఓపెన్!

0
Jio IPO Listing Date: దేశంలోనే అతిపెద్ద ఐపీఓగా చరిత్ర సృష్టించేందుకు రిలయన్స్ జియో ప్లాట్‌ఫామ్స్ ఐపీఓ వస్తున్న సంగతి తెలిసిందే. ఇది అక్టోబర్ 21న సబ్‌స్క్రిప్షన్ కోసం తెరుచుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇష్యూ అక్టోబర్ 23 వరకు కొనసాగనుండగా, అక్టోబర్ 28న ఎక్స్చేంజీల్లో లిస్టింగ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాదాపు 3.8 బిలియన్ డాలర్ల వరకు నిధుల్ని సమీకరించాలని ప్లాన్ చేస్తుండగా, భారత కరెన్సీలో ఇది రూ. 36 వేల కోట్లకుపైనే ఉంటుంది.

Nayara Energy: పెట్రోల్, డీజిల్ ధరల పెంపు.. అతిపెద్ద ప్రైవేట్ రిటైలర్ సడెన్ షాక్.. వాహనదారులపై భారం

0
Petrol Diesel Price Hike: చాలా రోజుల తర్వాత దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి. దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ రిటైలర్‌గా ఉన్న నయారా ఎనర్జీ పెట్రోల్ ధరను లీటరుపై రూ. 5, డీజిల్‌పై రూ. 3 చొప్పున పెంచుతున్నట్లు ప్రకటించింది. శనివారం తెల్లవారుజాము నుంచే కంపెనీకి చెందిన సుమారు 7108 ఫ్యూయెల్ స్టేషన్లలో ఈ కొత్త ధరలు అమల్లోకి వచ్చాయి. మిగతా ప్రభుత్వ రిటైల్ అవుట్‌లెట్లలో మాత్రం పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగానే ఉన్నాయి.

Rule of 72: రూ. 2 లక్షలకు 4 లక్షలు.. మీ డబ్బు ఎన్నేళ్లలో డబుల్ అవుతుంది? ఈ రూల్‌తో ఈజీగా తెలుసుకోవచ్చు..!

0
Investment Doubling Calculator: చాలా మంది పెట్టుబడులు పెడుతుంటారు. మరి ఎంత కాలానికి డబ్బులు ఎంత వడ్డీ రేటుకు ఎంతవుతాయో తెలుసుకోవాలనుకుంటుంటారు. అయితే ఇక్కడ మీ పెట్టుబడి ఎంత కాలంలో రెట్టింపు అవుతుందో సులభంగా అంచనా వేయడానికి రూల్ ఆఫ్ 72 ఉపయోగపడుతుంది. పెట్టుబడిపై వచ్చే వార్షిక రాబడి శాతంతో 72ను భాగిస్తే డబ్బు రెట్టింపు కావడానికి పట్టే సంవత్సరాల సమయం తెలుసుకోవచ్చు.