ఐస్‌బాత్.. గడ్డకట్టే చలిలో మైనస్ డిగ్రీల నీటితో స్నానం చేయడాన్నే ఐస్‌బాత్ అంటారు. చల్లని నీటిలో కొన్ని నిమిషాల పాటు కూర్చుని బయటికి వస్తుంటారు ఐస్‌బాత్‌లో. ఇలా చేస్తే ఫిజికల్ అండ్ మెంటల్‌గా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని చెబుతుంటారు. ఒకప్పుడు సెలబ్రిటీలు, స్పోర్ట్స్ రంగంలో ఉన్నవారు మాత్రమే ఈ ఐస్‌బాత్ థెరపీని తీసుకునేవారు. కానీ, ఎప్పుడైతే దీని వల్ల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయంటూ ప్రచారం మొదలైందో అప్పుడు సామాన్యులు కూడా ఐస్‌బాత్ చేసేస్తున్నారు. బాడీని 10 నుంచి 15 డిగ్రీల కంటే తక్కువ టెంపరేచర్ నీటిలో 10 నుంచి 15 నిమిషాల పాటు ఉంచితే రక్తప్రసరణ పెరగడం దగ్గర్నుంచీ మానసిక లాభాలు కూడా ఉంటాయని ఊదరగొడుతున్నారు. అయితే, ఐస్‌బాత్ చేస్తే అందరికీ కచ్చితమైన లాభాలుంటాయా. దీని గురించి డాక్టర్ దిలీప్ గూడె(సీనియర్ కన్సల్టెంట్ ఫిజిషియన్, యశోద హాస్పిటల్స్, హైదరాబాద్) ఏమంటున్నారు ఇప్పుడు చూద్దాం.


