
చలికాలంలో ఉసిరికాయ తినడానికి ప్రధాన కారణం ఇమ్యూనిటీ. శీతాకాలంలో ఉష్ణోగ్రతలు పడిపోవడంతో ఇన్ఫెక్షన్లు, జలుబు, దగ్గు, జ్వరం లాంటి సీజనల్ రోగాలు సులభంగా దాడి చేస్తాయి.వ్యాధి కారకాలతో రోగ నిరోధక వ్యవస్థ అంత సమర్థంగా పోరాడలేకపోవచ్చు. అయితే ఉసిరిలో పుష్కలంగా ఉండే విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్స్ శరీరానికి ఓ షీల్డ్‌లా పనిచేస్తాయి.ఇమ్యూనిటీని మెరుగ్గా ఉంచుతాయి. వైట్ బ్లడ్ సెల్స్‌ను యాక్టివేట్ చేస్తాయి. వైరస్లు, బ్యాక్టీరియాలపై శరీరం పోరాడే శక్తిని పెంచుతాయి. దీంతో ఉసిరి తీసుకుంటే చలికాలంలో సీజనల్ వ్యాధులు, ఇన్ఫెక్షన్ల బారిన పడే ప్రమాదం తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.


