అస్సాంకు చెందిన ఓ యువతి మృతదేహం ఆంధ్రప్రదేశ్‌లో లభ్యమైంది. ఈ మృతి ఇప్పుడు మిస్టరీగా మారింది. డాన్స్ ప్రోగ్రామ్ కోసం ఆంధ్రాకు వచ్చి, తిరిగి తన సొంతూరికి వెళ్తున్న 20 ఏళ్ల గిరిజన యువతి ట్రైన్‌లో అదృశ్యమైంది. దాంతో వారి తల్లిదండ్రులు ఆమె గురించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా. ఆ యువతి మృతదేహం మాత్రం ఆంధ్రప్రదేశ్‌లో కనిపించింది. అయితే ఆ యువతి మృతికి కారణాలు తెలియరాలేదు. అసలు ఆ రాత్రి ట్రైన్‌లో ఏం జరిగింది? ఆమెను ఎవరైనా వేధించారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Home Blog
తిరుమల శ్రీవారికి హైదరాబాద్ భక్తురాలి కానుక.. రెండు బంగారు పగడాల హారాలు విరాళం
Hyderabad Devotee Donated Two Bangaru Pagadala Haralu To Tirumala Temple: తిరుమల శ్రీవారికి మరోసారి భక్తుల నుంచి కానుకలు, విరాళాలు అందాయి. తిరుమల శ్రీవారికి హైదరాబాద్‌కు చెందిన భక్తురాలు రెండు బంగారు పగడాల హారాలను అందజేశారు. ఈ రెండు హారాల విలువ రూ.25 లక్షలు ఉంటుందని చెబుతున్నారు. అలాగే హైదరాబాద్‌కు చెందిన భక్తుడు, అమెరికాకు చెందిన మరో భక్తుడు టీటీడీ బర్డ్, ప్రాణదాన ట్రస్ట్‌లకు చెరో రూ.10 లక్షల చొప్పున విరాళాను అందజేశారు.
జనసేన పార్టీలో చేరడం లేదు.. తేల్చి చెప్పిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే స్వామి
Kolagatla Veerabhadra Swamy Respond On Party Change Rumours: విజయనగరం జిల్లాలో మరో మాజీ ఎమ్మెల్యే జనసేన పార్టీలో చేరబోతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. విజయనగరం మాజీ ఎమ్మెల్యే కొలగట్ల వీరభద్ర స్వామి జనసేన పార్టీలోకి వెళతారంటూ సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. ఈ ఊహాగాానాలపై కొలగట్ల స్పందించారు.. తాను పార్టీ మారతానంటూ జరుగుతున్న ప్రచారంలో నిజం లేదన్నారు. తాను కొద్దిరోజులుగా విజయనగరంలో ఉండటంలేదని.. ఇంతలో తాను పార్టీ మారబోతున్నట్లు ప్రచారం చేస్తున్నారని చెప్పుకొచ్చారు.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసి టీడీపీ ఎంపీలు.. విజయవాడ ఉత్సవ్-2.0కు ఆహ్వానం
TDP Mps Meet Telangana Cm Revanth Reddy In Delhi: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో ఏపీ టీడీపీ ఎంపీలు సమావేశమయ్యారు. ఢిల్లీలో రేవంత్‌ను కలిసిన ఎంపీలు విజయవాడలో నిర్వహించే దసరా ఉత్సవాలు, విజయవాడ ఉత్సవ్-.2.0కు ముఖ్య అతిథిగా హాజరుకావాలని ఆహ్వానించారు. టీడీపీ ఎంపీలు విజయవాడ ఉత్సవ్ వేడుకలు, దసరా ఉత్సవాలకు వివిధ రాష్ట్రాల సీఎంలు, ప్రముఖుల్ని ఆహ్వానిస్తున్నారు. రెండు రోజుల క్రితం తమిళనాడు సీఎం విజయ్‌ను కూడా ఆహ్వానించారు.
ఏపీలో వారందరికి నోటీసులు.. ఇళ్లు కట్టుకుంటారా? లేదా? చెప్పాలి.. స్థలం వద్దనుకుంటే వెనక్కి ఇవ్వాలి!
AP Govt Committee To Resolve House Site Issues: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జగనన్న కాలనీల్లో ఖాళీగా ఉన్న ప్లాట్లకు ఇక కొత్త కేటాయింపులు, లబ్ధిదారులకు మరింత వెసులుబాటు కల్పించేలా ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. లబ్ధిదారులకు నోటీసులు జారీ చేయాలని భావిస్తున్నారు. ఒకవేల ఇల్లు కట్టుకునేందుకు ఆసక్తి ఉన్నవారికి ప్లాట్లు ఇవ్వాలని.. ప్లాట్లు దక్కిన వారు తమకు వద్దనుకుంటే మరో ప్రాంతంలో ఇవ్వాలని ఆదేశించారు. ఇళ్ల స్థలాల సమస్యల్ని పరిష్కరించడానికి ముగ్గురు మంత్రులతో కమిటీని ఏర్పాటు చేశారు.
తిరుమల బ్రహ్మోత్సవాలకు, గరుడ సేవకు వెళ్లే భక్తులకు ముఖ్య గమనిక.. ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోండి
Tirumala Dasara Navaratri Brahmotsavam 2026 Garuda Seva: తిరుమల నవరాత్రి బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతోంది. ఈ నెల 12 నుంచి దసరా బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి.. ఈ నెల 20 వరకు కొనసాగుతాయి. బ్రహ్మోత్సవాల సమయంలో గరుడ సేవకు భక్తులు భారీగా తరలివస్తారు. ఈసారి పెరటాసి మాసం కూడా ఉండటంతో టీటీడీ భారీ ఏర్పాట్లు చేస్తోంది. గరుడ సేవ రోజు భక్తులు తిరుపతిలోనే వాహనాలను పార్క్ చేసుకోవాలని సూచిస్తున్నారు. ఈ మేరకు నగరంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. పోలీసులు, టీటీడీ సూచనలు పాటించాలంటున్నారు.
SRI KASHI NAYANA DAILY – 8 అక్టోబర్ 2026
డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి – ఉజ్వల భవిష్యత్తు వైపు అడుగులు వేయాలి: ఈగల్ బృందం
శ్రీనివాస నగర్ లో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు – Oct 11 నుండి 21 వరకు
కాపు భవన్ నిర్మాణానికి చర్యలు చేపడతాం: మంత్రి నియోజకవర్గ ఇంచార్జ్ హరీష్ బాబు
క్రికెట్, లాన్ టెన్నిస్ లో సత్తా చాటిన యశోద ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు
ఖరగ్‌పూర్ టు అమరావతి కొత్త హైవే పోలవరం మీదుగా.. అక్కడ ఐకానిక్ బ్రిడ్జ్, కేంద్రానికి ఏపీ సర్కార్ రిక్వెస్ట్!
Kharagpur Amaravati Greenfield Highway Polavaram: పశ్చిమ బెంగాల్‌లోని ఖరగ్‌పూర్ నుంచి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి గ్రీన్‌ఫీల్డ్ హైవేను కేంద్రం మంజూరు చేసింది. ఈ హైవేకు సంబంధించిన ఎలైన్‌మెంట్‌లో మార్పు చేయాలని ఏపీ ప్రభుత్వం కేంద్రాన్ని కోరుతోంది. ఈ హైవే పట్టిసీమ మీదుగా కాకుండా పోలవరం మీదుగా మళ్లిచంాలని కోరుతోంది. ఏపీ పరిధిలో మొత్తం 457 కిలోమీటర్లు ఉంది. ఈ మేరకు ఢిల్లీ పర్యటనలో ఉన్న చంద్రబాబు ఈ అంశాన్ని కేంద్రమంత్రుల దగ్గర ప్రస్తావించే అవకాశం ఉందంటున్నారు.
ఏపీ ప్రజలకు ఊరట.. మూడు ప్రభుత్వ ఆస్పత్రుల్లో బోన్‌మ్యారో చికిత్స.. లక్షల్లో ఖర్చు చేసే పని లేకుండా!
AP High Court On Bone Marrow Treatment: ఏపీలోని మూడు ప్రభుత్వాస్పత్రుల్లో బోన్‌మ్యారో చికిత్సను అందుబాటులోకి రానుంది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ లాయర్ హైకోర్టుకు వివరాలు వెల్లడించారు. మూడు చోట్ల బోన్‌మ్యారో చికిత్స అందుబాటులోకి తెచ్చేందుకు తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆర్థికశాఖ దగ్గర ఫైల్ క్లియర్ కాగానే ఈ అంశంపై స్పష్టత వస్తుందన్నారు. వీలైనంత త్వరగా ఈ చికిత్సను అందుబాటులోకి తీసుకురావాలని హైకోర్టు ధర్మాసనం ప్రభుత్వాన్ని ఆదేశించింది.
సింహాచలం ఆలయం నుంచి హైదరాబాద్ మింట్‌కు 1,182 కిలోల వెండి.. కరిగించి ఇటుకలుగా మార్చి, ఏం చేస్తారో తెలుసా!
Simhachalam Temple Silver Sent To Hyderabad Mint: సింహాచలం అప్పన్న ఆలయం నుంచి వెండిని హైదరాబాద్ మింట్‌కు తరలించారు. భక్తులు స్వామివారికి సమర్పించిన వెండి వస్తువులు, ఆభరణాలను కరిగించి ఇటుకలుగా మార్చేందుకు అక్కడికి తీసుకెళ్లారు. పటిష్ట భద్రత మధ్య ప్రత్యేక వాహనంలో మొత్తం 1,182 కిలోల 846 గ్రాముల 370 మిల్లీగ్రాముల వెండి వస్తువులను హైదరాబాద్ పంపించారు. ఈ వెండి ఇటుకల్ని గోల్డ్ డిపాజిట్లుగా మార్చి బ్యాంకుల్లో ఉంచుతారు. అయితే ఈ వెండిని శ్రీకాళహస్తి ఆలయంకోసం అడుగుతున్నట్లు తెలుస్తోంది.

