Home Blog Page 2

సింహాచలం ఆలయం నుంచి హైదరాబాద్‌ మింట్‌కు 1,182 కిలోల వెండి.. కరిగించి ఇటుకలుగా మార్చి, ఏం చేస్తారో తెలుసా!

Simhachalam Temple Silver Sent To Hyderabad Mint: సింహాచలం అప్పన్న ఆలయం నుంచి వెండిని హైదరాబాద్ మింట్‌కు తరలించారు. భక్తులు స్వామివారికి సమర్పించిన వెండి వస్తువులు, ఆభరణాలను కరిగించి ఇటుకలుగా మార్చేందుకు అక్కడికి తీసుకెళ్లారు. పటిష్ట భద్రత మధ్య ప్రత్యేక వాహనంలో మొత్తం 1,182 కిలోల 846 గ్రాముల 370 మిల్లీగ్రాముల వెండి వస్తువులను హైదరాబాద్ పంపించారు. ఈ వెండి ఇటుకల్ని గోల్డ్ డిపాజిట్లుగా మార్చి బ్యాంకుల్లో ఉంచుతారు. అయితే ఈ వెండిని శ్రీకాళహస్తి ఆలయంకోసం అడుగుతున్నట్లు తెలుస్తోంది.

రూ.2900 కోట్ల డిపాజిట్లు, 9 కోట్లకుపైగా సర్వింగ్స్, రోజుకు 15.8 టన్నుల బియ్యం.. తిరుమల అన్నప్రసాదం గురించి ఆసక్తికర విషయాలు

Tirumala Annaprasadam 90 Million Servings In 9 Months: తిరుమల అన్నపూర్ణ నిలయంగా మారింది.. ఆకలికి చోటే లేని పవిత్ర స్థలంగా ఉంది. తిరుమలలో రోజుకు దాదాపు 3 లక్షల మంది భక్తులకు ఉచితంగా అన్నప్రసాదం అందిస్తున్నారు. నిత్యం మహాయజ్ఞంలా అన్నప్రసాద సేవ కొనసాగుతోంది. రోజుకు 15.8 టన్నుల బియ్యంతో.. 2026 జనవరి నుంచి సెప్టెంబర్ వరకు 9 కోట్లకు పైగా సర్వింగ్స్ చేశారు. శ్రీ వేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు విరాళాలు రూ.2900 కోట్లు దాటాయి.

ఏపీలో కుల ధ్రువీకరణ పత్రం తీసుకోవడం సులభం.. రూ.40 చెల్లిస్తే మొబైల్‌లోనే తీసుకోవచ్చు

Andhra Pradesh Caste Certificate In Mana Mitra Whatsapp: ఏపీ ప్రబుత్వం మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్‌ ద్వారా కుల ధ్రువీకరణ పత్రాలను జారీ చేస్తున్నారు. ఇకపై కుల ధ్రువీకరణ పత్రాల కోసం ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లాల్సిన పనిలేదు. జస్ట్ మొబైల్ ఉంటే చాలు కులధ్రువీకరణ పత్రం తీసుకోవచ్చు. ఆధార్ నంబర్ ఎంటర్ చేసి ఫీజు రూ.40 చెల్లించి కులధ్రువీకరణ పత్రాన్ని డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని ఏపీ ప్రభుత్వం తెలిపింది.

తిరుమల శ్రీవారి దర్శనం టికెట్ల కోసం భక్తుల పోటీ.. 10 నిమిషాల్లో 60వేలు ఖాళీ, ఈ టికెట్లకు ఎందుకంత డిమాండ్!

Tirumala Rs 300 Darshan 60000 Tickets Booked In Ten Minutes: తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు సంబంధించి టీటీడీ రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను విడుదల చేసింది. ఈ నెల 12, 13, 14, 18, 19, 20 తేదీలకు సంబంధించి మొత్తం 60వేలు టికెట్లు విడుదలయ్యాయి. ఈ టికెట్లకు భక్తుల నుంచి భారీ స్పందన వచ్చింది. కేవలం పది నిమిషాల వ్యవధిలోనే టికెట్లు మొత్తం బుక్‌ అయ్యాయి.

16 ఏళ్ల కల నెరవేరింది.. సూపర్ కింగ్స్ ఫ్యామిలీలోకి చేరిన పొలార్డ్!

0
ముంబై ఇండియన్స్ దిగ్గజ ఆల్‌రౌండర్ కీరన్ పొలార్డ్‌ను సౌతాఫ్రికా20 2027 వేలంలో జోహెన్నెస్‌బర్గ్ సూపర్ కింగ్స్ (జేఎస్కే) సొంతం చేసుకుంది. వేలంలో ఇతడిని సుమారు రూ.87.38 లక్షల బేస్ ప్రైస్‌కు చెన్నై సూపర్ కింగ్స్‌ ఫ్రాంఛైజీకి చెందిన జేఎస్కే దక్కించుకుంది. ఎంఐ కేప్‌టౌన్ ఇతడిని వదిలేయడంతో వేలంలోకి వచ్చిన పొలార్డ్, 16 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఎట్టకేలకు చెన్నై ఫ్రాంచైజీ సిస్టర్ టీమ్ పసుపు జెర్సీ ధరించబోతుండటం విశేషం.

మీ భాగస్వామి లవ్‌ లాంగ్వేజ్‌ను ఎలా తెలుసుకోవాలి?

ప్రతి ఒక్కరికీ ఒక ప్రత్యేకమైన లవ్‌ లాంగ్వేజ్ ఉంటుంది. మీ పార్ట్‌నర్‌ లవ్‌ లాంగ్వేజ్‌ తెలుసుకోవడం వల్ల ఇద్దరి మధ్య బంధం బలంగా మారుతుంది.

నిద్రలేవగానే నీరసంగా, బద్దకంగా అనిపించడానికి కారణాలు

చాలా మందికి ఉదయం లేవగానే అలసటగా, బద్దకంగా అనిపిస్తుంది. ఇలా అనిపించడానికి గల కారణాలను ఇక్కడ వివరించాం.

యూఎస్‌లో రోజా కూతురు అన్షు.. పంజాబ్ పొలాల్లో సారా అలీఖాన్.. బేబీ బంప్‌తో సమంత ఫోటోషూట్

• బ్లాక్ డ్రెస్‌లో బేబీ బంప్‌తో స‌మంత
• రెండోసారి తల్లికాబోతున్న కియారా అద్వానీ
• శ్రుతి హాసన్ లేటెస్ట్ ఫోటోషూట్
• పంజాబ్ పొలాల్లో సారా అలీఖాన్
• యూఎస్ లో రోజా కూతురు అన్షు మాలిక
• ‘బత్తా’లో విజయ్ సేతుపతితో లిజోమోల్ జోస్
• ముంబైలో పార్వతి తిరువోతు డర్టీ కట్ డిన్నర్ స్నాప్స్
• పూజిత పొన్నాడ బర్త్ డే పిక్స్
• ‘కె-ర్యాంప్’ బ్యూటీ యుక్తి తరేజా క్యూట్ లుక్స్
• సెలబ్రిటీల తాజా ఇన్‌స్టా పోస్టులపై ఓ లుక్కేద్దాం.

అప్పట్లో భయపెట్టి, ఇప్పుడు కడుపుబ్బా నవ్వించి.. 26 ఏళ్ల క్రితమే తెలుగులో ‘బెత్లెహెమ్ కుడుంబ యూనిట్’ నటుడు

మలయాళ బ్లాక్ బస్టర్ హిట్ ‘బెత్లెహెమ్ కుడుంబ యూనిట్’ సినిమా ఇటీవలే ఓటీటీలోకి వచ్చేసింది. థియేటర్లలో అలరించిన ఈ చిత్రానికి డిజిటల్ వేదిక మీద కూడా మంచి రెస్పాన్స్ లభిస్తోంది. నివిన్ పౌలీ, మమిత బైజు పాత్రలతో పాటుగా హీరో ఫ్రెండ్ జేవియర్ క్యారక్టర్ లో నటించిన నటుడు అందరి దృష్టిని ఆకర్షించారు. తన కామెడీతో కడుపుబ్బా నవ్వించిన ఆయన గురించి తెలుసుకోడానికి నెటిజన్లు ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే 26 ఏళ్ల క్రితమే ఆయన తెలుగులో సినిమా చేశారనే సంగతి చాలామందికి తెలియకపోవచ్చు.

Bandla Ganesh: ‘నా పేరు మీద రాజకీయాలు చేయకండి.. పదవులపై నాకు వ్యామోహం లేదు’.. బండ్ల గణేష్ కీలక ప్రకటన

నటుడు, నిర్మాత బండ్ల గణేష్ తాజాగా ఓ బహిరంగ ప్రకటన విడుదల చేశారు. తనకు ఎలాంటి హోదాలు, అధికారాలపై వ్యామోహం లేదని స్పష్టం చేశారు. అనవసర వివాదాల్లోకి తన పేరును లాగొద్దని, లేనిపోని వార్తలతో ఇబ్బంది పెట్టవద్దని కోరుతూ తనపై వస్తున్న పొలిటికల్ రూమర్లకు చెక్ పెట్టారు. తన పేరు మీద రాజకీయాలు చేయొద్దని, తన పేరును రాజకీయాలకు ఉపయోగించవద్దని రిక్వెస్ట్ చేశారు. పుకార్లకు, గాలి వార్తలకు స్పందించకుండా సంయమనం పాటిస్తున్నాని పేర్కొన్నారు.