Jio IPO Listing Date: దేశంలోనే అతిపెద్ద ఐపీఓగా చరిత్ర సృష్టించేందుకు రిలయన్స్ జియో ప్లాట్ఫామ్స్ ఐపీఓ వస్తున్న సంగతి తెలిసిందే. ఇది అక్టోబర్ 21న సబ్స్క్రిప్షన్ కోసం తెరుచుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇష్యూ అక్టోబర్ 23 వరకు కొనసాగనుండగా, అక్టోబర్ 28న ఎక్స్చేంజీల్లో లిస్టింగ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాదాపు 3.8 బిలియన్ డాలర్ల వరకు నిధుల్ని సమీకరించాలని ప్లాన్ చేస్తుండగా, భారత కరెన్సీలో ఇది రూ. 36 వేల కోట్లకుపైనే ఉంటుంది.


