Petrol Diesel Price Hike: చాలా రోజుల తర్వాత దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి. దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ రిటైలర్‌గా ఉన్న నయారా ఎనర్జీ పెట్రోల్ ధరను లీటరుపై రూ. 5, డీజిల్‌పై రూ. 3 చొప్పున పెంచుతున్నట్లు ప్రకటించింది. శనివారం తెల్లవారుజాము నుంచే కంపెనీకి చెందిన సుమారు 7108 ఫ్యూయెల్ స్టేషన్లలో ఈ కొత్త ధరలు అమల్లోకి వచ్చాయి. మిగతా ప్రభుత్వ రిటైల్ అవుట్‌లెట్లలో మాత్రం పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగానే ఉన్నాయి.
Rule of 72: రూ. 2 లక్షలకు 4 లక్షలు.. మీ డబ్బు ఎన్నేళ్లలో డబుల్ అవుతుంది? ఈ రూల్‌తో ఈజీగా తెలుసుకోవచ్చు..!
Investment Doubling Calculator: చాలా మంది పెట్టుబడులు పెడుతుంటారు. మరి ఎంత కాలానికి డబ్బులు ఎంత వడ్డీ రేటుకు ఎంతవుతాయో తెలుసుకోవాలనుకుంటుంటారు. అయితే ఇక్కడ మీ పెట్టుబడి ఎంత కాలంలో రెట్టింపు అవుతుందో సులభంగా అంచనా వేయడానికి రూల్ ఆఫ్ 72 ఉపయోగపడుతుంది. పెట్టుబడిపై వచ్చే వార్షిక రాబడి శాతంతో 72ను భాగిస్తే డబ్బు రెట్టింపు కావడానికి పట్టే సంవత్సరాల సమయం తెలుసుకోవచ్చు.
సీనియర్ సిటిజెన్లకు ఎఫ్‌డీపై అధిక వడ్డీ ఇచ్చే బ్యాంకులివే.. ఐదేళ్లకు ఏకంగా 8.50 శాతం వరకు ఆఫర్!
Highest FD Rates for Seniors: బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్లలో ఇన్వెస్ట్ చేసేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తుంటారు. సాధారణ ప్రజలతో పోలిస్తే సీనియర్ సిటిజెన్లకు వడ్డీ కాస్త అధికంగా ఉంటుంది. ఇప్పుడు ఐదేళ్ల వ్యవధి ఎఫ్‌డీపై చాలా బ్యాంకులు ఆకర్షణీయ స్థాయిలో వడ్డీ రేట్లను ఆఫర్ చేస్తున్నాయి. అన్నింటికంటే ఎక్కువగా సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 8.50 శాతం వడ్డీ రేటు అందిస్తోంది. ఇప్పుడు ఏ బ్యాంకులో వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయో చూద్దాం.
Jensen Huang: ఎన్విడియా షేర్లు ఆల్ టైమ్ హై.. సీఈఓ సంపద ఒక్కరోజే రూ. 25 వేల కోట్లు ప్లస్.. మొత్తం రూ. 20 లక్షల కోట్లు!
Nvidia Shares Hit Record High: టెక్ దిగ్గజం ఎన్విడియా షేర్లు ఇటీవలి కాలంలో భారీగా దూసుకెళ్తున్నాయి. తాజాగా ఆల్ టైమ్ గరిష్ఠాల్ని తాకగా సంస్థ సీఈఓ, కో ఫౌండర్ జెన్సెన్ హువాంగ్ సంపద కూడా భారీగా పెరిగింది. తొలిసారిగా ఆయన సంపద 200 బిలియన్ డాలర్ల మార్కును దాటింది. ఒక్కరోజులోనే ఏకంగా రూ. 25 వేల కోట్ల వరకు సంపద పెరగడం విశేషం. ఫోర్బ్స్ ప్రకారం ఆయన ప్రస్తుతం ప్రపంచంలోనే ఏడో అత్యంత ధనవంతుడిగా నిలిచారు. ఏఐ చిప్స్ డిమాండ్ ఎన్విడియా షేర్ల ర్యాలీకి ప్రధాన కారణంగా ఉంది.
నలుగురు పిల్లలు పుట్టాక.. సడెన్‌గా ప్రియురాలికి బ్రేకప్ చెప్పేసిన ఎలాన్ మస్క్, బాధగా ఉందంటూ శివోన్ పోస్ట్
టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ తన ప్రస్తుత భాగస్వామి శివోన్ జిలిస్‌తో విడిపోయారు. ఎలాంటి ముందస్తు చర్చలు లేకుండానే మస్క్ తనకు బ్రేకప్ చెప్పేశారని శివోన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. నలుగురు పిల్లలు పుట్టాకా.. వారం రోజుల వ్యవధిలోనే బంధానికి ముగింపు పలకడం తనను తీవ్ర వేదనకు గురిచేసిందని వెల్లడించారు. అయితే ఇప్పటికీ మస్క్‌పై తనకు అమితమైన ప్రేమ ఉందని.. అది ఎప్పటికీ కొనసాగుతుందని స్పష్టం చేశారు. అంతేకాకుండా పిల్లల కోసం తామిద్దరం మంచి స్నేహితులుగా ఉంటామని వెల్లడించారు.
ఫ్లైదుబాయ్ ఘటన.. కో-పైలట్ హమామీకి ఉగ్రవాద భావజాలం, సోషల్ మీడియా ఫోటోలు వైరల్.. గతంలోనే అతడిపై నిషేధం
Flydubai Flight Suspect Hamam Al Hamami Images: ఫ్లైదుబాయ్ విమానంలో ఘటనకు సంబంధించి మరికొన్ని కీలక విషయాలు బయటకొచ్చాయి. భాతర పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్‌పై దాడి చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కో-పైలట్ హమామ్ అల్‌హమామీకి ఉగ్రవాద భావజాలం ఉందని.. అందుకే అతడిపై గతంలో విమానాలు నడపకుండా నిషేధం విధించినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో అతడి ఫోటోలు వైరల్ అవుతున్నాయి. అతడి లింక్డ్‌ఇన్ అకౌంట్‌ను కూడా గుర్తించారు.. అందులో రెండు పోస్టులు ఉన్నాయి.
భూ సమస్య పరిష్కారం కాలేదని.. MRO ఆఫీస్ ఆవరణలో ఉరేసుకుని రైతు ఆత్మహత్య
భూ సమస్య పరిష్కారం కాలేదని.. ఓ రైతు ఎమ్మార్వో ఆఫీసు వద్దే బలవన్మరణానికి పాల్పడ్డాడు. అధికారుల చుట్టూ ఎంత తిరిగినా తన సమస్య పరిష్కారం కాకపోవడంతో తీవ్ర విరక్తి చెందిన ఆ రైతు.. తహసీల్దార్ ఆవరణలోనే చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వంశపారంపర్యంగా తన కుటుంబానికి 19 ఎకరాల భూమి ఉండాల్సి ఉండగా.. 18 ఎకరాలు మాత్రమే తన ఆధీనంలో ఉన్నాయని.. మరో ఎకరం పొరుగు రైతుల భూమిలో ఉందని ఆయన అధికారులకు ఫిర్యాదు చేసినా.. ఎలాంటి స్పందన లేకపోవడంతో విసుగు చెంది ఆత్మహత్య చేసుకున్నాడు.
అనంతగిరి ఘాట్ రోడ్డులో ట్రావెల్స్ బస్సు బోల్తా.. నలుగురు మహిళలు మృతి, సీఎం దిగ్భ్రాంతి
అనంతగిరి ఘాట్ రోడ్డులో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో నలుగురు మహిళలు మృతి చెందారు. అంత్యక్రియల్లో పాల్గొనేందుకు సుమారు 50-54 మంది ప్రయాణికులు బస్సులో బయలుదేరారు. అనంతగిరి కొండపై నుంచి కిందికి వస్తున్న సమయంలో ఘాట్ రోడ్డులో డ్రైవర్ కంట్రోల్ తప్పడంతో బస్సు రహదారి పక్కకు దూసుకెళ్లి బోల్తా పడింది. ప్రమాదంలో ముగ్గురు మహిళలు అక్కడికక్కడే మృతి చెందగా.. చికిత్స పొందుతూ మరో మహిళ ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై సీఎం రేవంత్‌రెడ్డి, బీఆర్ఎస్ నేత కేటీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
పిల్లల సైబర్ భద్రతకు సమగ్ర ఫ్రేమ్‌వర్క్.. సీఎం రేవంత్ కీలక నిర్ణయం
ఆన్‌లైన్ వేధింపులు, సైబర్ నేరాల నుంచి పిల్లలను రక్షించేందుకు న్యాయ సేవల ప్రాధికార సంస్థలు చేపడుతున్న కార్యక్రమాలకు తెలంగాణ ప్రభుత్వం పూర్తి మద్దతు ఇస్తుందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లో జరిగిన NALSA దక్షిణాది ప్రాంతీయ సదస్సులో ఆయన మాట్లాడుతూ భరోసా కేంద్రాలు, చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్లు, ప్రత్యేక కోర్టులు, సైబర్ ల్యాబ్‌లను మరింత సమర్థంగా వినియోగించాలని సూచించారు. తల్లిదండ్రులు పిల్లలకు స్నేహపూర్వకంగా మార్గనిర్దేశం చేయాలని, సైబర్ నేరాల కోసం 1930, చైల్డ్ హెల్ప్‌లైన్ 1098 నంబర్లను గుర్తుంచుకోవాలని కోరారు.
Telangana NFHS 6 Survey: తెలంగాణలో మద్యం వినియోగం.. హైదరాబాద్‌లో 30.4 శాతమే, గ్రామీణ ప్రాంతాల్లోనే అధికం
Telangana Alcohol Consumption: తెలంగాణలో మద్యం వినియోగంపై నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే-6 కీలక విషయాలను వెల్లడించింది. రాష్ట్రంలో 15 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయసున్న పురుషుల్లో 43.9 శాతం మంది మద్యం సేవిస్తున్నట్లు సర్వే తెలిపింది. అయితే రాష్ట్ర రాజధాని హైదరాబాద్ 33 జిల్లాల్లో 31వ స్థానంలో నిలిచింది. ఇక్కడ పురుషుల మద్యం వినియోగం 30.4 శాతంగా నమోదైంది. జనగాంలో అత్యధికంగా 61.6 శాతం ఉండగా.. గ్రామీణ ప్రాంతాల్లో వినియోగం పట్టణాల కంటే ఎక్కువగా ఉంది. మద్యం వినియోగాన్ని శాతం ఆధారంగా మాత్రమే NFHS-6 లెక్కించింది.

