Investment Doubling Calculator: చాలా మంది పెట్టుబడులు పెడుతుంటారు. మరి ఎంత కాలానికి డబ్బులు ఎంత వడ్డీ రేటుకు ఎంతవుతాయో తెలుసుకోవాలనుకుంటుంటారు. అయితే ఇక్కడ మీ పెట్టుబడి ఎంత కాలంలో రెట్టింపు అవుతుందో సులభంగా అంచనా వేయడానికి రూల్ ఆఫ్ 72 ఉపయోగపడుతుంది. పెట్టుబడిపై వచ్చే వార్షిక రాబడి శాతంతో 72ను భాగిస్తే డబ్బు రెట్టింపు కావడానికి పట్టే సంవత్సరాల సమయం తెలుసుకోవచ్చు.


