HomeTELANGANAపిల్లల సైబర్ భద్రతకు సమగ్ర ఫ్రేమ్‌వర్క్.. సీఎం రేవంత్ కీలక నిర్ణయం

పిల్లల సైబర్ భద్రతకు సమగ్ర ఫ్రేమ్‌వర్క్.. సీఎం రేవంత్ కీలక నిర్ణయం

ఆన్‌లైన్ వేధింపులు, సైబర్ నేరాల నుంచి పిల్లలను రక్షించేందుకు న్యాయ సేవల ప్రాధికార సంస్థలు చేపడుతున్న కార్యక్రమాలకు తెలంగాణ ప్రభుత్వం పూర్తి మద్దతు ఇస్తుందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లో జరిగిన NALSA దక్షిణాది ప్రాంతీయ సదస్సులో ఆయన మాట్లాడుతూ భరోసా కేంద్రాలు, చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్లు, ప్రత్యేక కోర్టులు, సైబర్ ల్యాబ్‌లను మరింత సమర్థంగా వినియోగించాలని సూచించారు. తల్లిదండ్రులు పిల్లలకు స్నేహపూర్వకంగా మార్గనిర్దేశం చేయాలని, సైబర్ నేరాల కోసం 1930, చైల్డ్ హెల్ప్‌లైన్ 1098 నంబర్లను గుర్తుంచుకోవాలని కోరారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments