HomeAndhra Pradeshనెల్లూరులో పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ.. రూ.600 కోట్ల విలువైన ఆస్తిపై శాశ్వత హక్కులు, త్వరలో...

నెల్లూరులో పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ.. రూ.600 కోట్ల విలువైన ఆస్తిపై శాశ్వత హక్కులు, త్వరలో మరో 4వేలమందికి

Chandrababu Permanent House Pattas Distribution: ఏపీ ప్రభుత్వం ఆయా స్థలాల్లో ఇళ్లు నిర్మించుకుని పట్టాలు లేని దశాబ్దాలుగా నివసిస్తున్న పేద కుటుంబాలకు శాశ్వత హక్కులు కల్పించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నెల్లూరులోని సర్వేపల్లి కట్టలో 22.31 ఎకరాల భూమిపై 939 కుటుంబాలకు శాశ్వత ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని వర్చువల్‌గా ప్రారంభించారు. సుమారు రూ.600 కోట్ల విలువైన ఆస్తిపై పేదలకు హక్కులు కల్పించారు. మొత్తం లబ్ధిదారుల్లో 701 మంది మహిళలు ఉన్నారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments