రెస్టారెంట్‌కు వెళ్లినప్పుడు మన దృష్టి సాధారణంగా మెనూ, ఆహారం రుచి, ధర, సర్వీస్‌పైనే ఉంటుంది. అయితే టేబుల్‌పై మన ప్రవర్తన కూడా అంతే ముఖ్యమైనది. ఇంట్లో భోజనం చేసేటప్పుడు సహజంగా చేసే కొన్ని పనులు బయట అందరి ముందు చేయడం సరైనదిగా భావించరు. ముఖ్యంగా ఫైన్ డైనింగ్ రెస్టారెంట్లలో భోజనం చేసేటప్పుడు కొన్ని చిన్న నియమాలను పాటించడం ద్వారా మనతో పాటు టేబుల్‌పై ఉన్న ఇతరులకు కూడా సౌకర్యంగా ఉంటుంది. అందుకే రెస్టారెంట్‌లో భోజనం చేసేటప్పుడు పాటించాల్సిన టేబుల్ ఎటికెట్ ఏమిటో తెలుసుకుందాం.


