‘దేవర’ సినిమాలోని చార్ట్‌బస్టర్ సాంగ్ “చుట్టమల్లే” చుట్టూ ఏఐ ఆధారిత సరికొత్త వివాదం చెలరేగింది. కొందరు డిజిటల్ క్రియేటర్లు ఏఐ సాంకేతికతను దుర్వినియోగం చేస్తూ, ఎన్టీఆర్, జాన్వీ కపూర్‌ల హావభావాలను మార్చేసి పాటలో లేని అసభ్యకర, అభ్యంతరకర దృశ్యాలను సృష్టిస్తున్నారు. ఇది అసలైన పాటలోని విజువల్సేనని భ్రమపడుతుండటంతో నటీనటుల ప్రతిష్టకు భంగం వాటిల్లుతోందని సినీ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. క్రియేటివిటీ పేరుతో వ్యక్తుల గౌరవాన్ని దిగజార్చేలాంటి మార్ఫింగ్ క్లిప్పులు రూపొందించిన వారిని తక్షణమే గుర్తించి, జైలుకు పంపాలని నెటిజన్లు తీవ్రస్థాయిలో డిమాండ్ చేస్తున్నారు.
Chuttamalle: ‘చుట్టమల్లే’ పాటకు ఏఐ వికృత చేష్టలు… ఎన్టీఆర్, జాన్వీల మార్ఫింగ్ వీడియోలపై భగ్గుమంటున్న నెటిజన్లు
RELATED ARTICLES


