Home Blog Page 57

పాపకు అమ్మవారి పేరు పెట్టాలా? ఇవి చూడండి!

మీ అమ్మాయికి పేరు పెట్టాలా. అయితే దుర్గా, లక్ష్మీదేవి స్ఫూర్తితో గల ఈ పేర్లు చెక్ చేసి చూడండి.

కోపం చూపకుండా పిల్లల అలకలను తగ్గించే పేరెంటింగ్ టిప్స్

కోపం చూపకుండా పిల్లల అలకలను తగ్గించే కొన్ని సింపుల్‌ చిట్కాల గురించి ఇక్కడ వివరించాం.

టాయ్‌లెట్‌లో ఫోన్ చూస్తున్నారా? ఇవి తెలుసుకోండి!

టాయ్‌లెట్‌లో 10 నిమిషాల పాటు ఫోన్ చూస్తూ కూర్చొంటే అనేక సమస్యలు వస్తాయి. అవేంటో తెలుసుకుందాం.

ఇంట్లో ఈ ప్రదేశాల్లో తాబేలు విగ్రహాన్ని ఉంచితే అదృష్టం

వాస్తు శాస్త్రం ప్రకారం తాబేలు ఇంటికి అదృష్టాన్ని తీసుకువస్తుంది. అయితే తాబేలు బొమ్మ విషయంలో ఫాలో అవ్వాల్సిన వాస్తు రూల్స్‌ ఇవే.

క్యాబేజీ కందిపప్పు పచ్చడి చేసే విధానం

మీరు ఇంట్లో రుచికరమైన క్యాబేజీ కందిపప్పు పచ్చడి చేసుకోవాలని అనుకుంటున్నారా. అయితే ఈ పద్ధతి ఫాలోకండి.

ఆ రిసార్ట్ అమ్ముకోకుండా ఉంటే నవదీప్ రూ.వందల కోట్లకు అధిపతి… సీక్రెట్ బయటపెట్టిన అజయ్ ఘోష్

సినీ వేదికలపై హీరోల ఆస్తులపై నటుడు అజయ్ ఘోష్ చేస్తున్న వ్యాఖ్యలు నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి. 2002లో నవదీప్ తండ్రి రామారావు చీరాల బీచ్ సమీపంలో ‘రామాపురం రిసార్ట్స్’ ప్రారంభించారని, హైదరాబాద్ వచ్చే క్రమంలో దాన్ని అమ్మేశారని తెలిపారు. ప్రస్తుతం ‘ఆంధ్రా గోవా’గా మారిన ఆ ప్రాంతంలో ఆస్తిని అమ్మకుండా ఉంటే నవదీప్ వందల కోట్ల ఆస్తిపరుడయ్యేవాడని పేర్కొన్నారు. గతంలో రవితేజ మామిడి తోట విలువలపైనా ఇలాగే మాట్లాడిన అజయ్ ఘోష్‌పై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. సినిమా వేదికలపై పక్కోళ్ల ఆస్తులు, రియల్ ఎస్టేట్ లావాదేవీలపై లెక్చర్లు ఇవ్వడం ఎందుకంటూ కొందరు ఆయనపై సెటైర్లు వేస్తున్నారు.

Mayalodu Controversy: ‘నేను లేకుండా సినిమా ఎలా తీస్తావో చూస్తా’… రాజేంద్ర ప్రసాద్‌కు ఎస్వీ కృష్ణారెడ్డి అదిరిపోయే రిటర్న్ గిఫ్ట్

1993 నాటి ఇండస్ట్రీ హిట్ చిత్రం ‘మాయలోడు’ షూటింగ్ సమయంలో నటుడు రాజేంద్ర ప్రసాద్‌తో తలెత్తిన వివాదంపై దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. సినిమా చివరి దశలో రెయిన్ సాంగ్ కోసం డేట్లు ఇవ్వని రాజేంద్ర ప్రసాద్, “నేను లేకుండా సినిమా ఎలా పూర్తి చేస్తావో చూస్తా” అని సవాల్ విసిరారట. దీంతో తీవ్రంగా కలత చెందిన దర్శకుడు, గతంలో బాబూ మోహన్‌కు ఇచ్చిన మాట ప్రకారం ఆ డ్యూయెట్‌ను బాబూ మోహన్, సౌందర్యలపై చిత్రీకరించారు. ఆ పాటే “చినుకు చినుకు అందెలతో”గా వెండితెరపై సంచలనం సృష్టించింది. ఒక కమెడియన్‌తో డ్యూయెట్ చేయించి సూపర్ హిట్ కొట్టిన తొలి దర్శకుడిగా నిలిచానని కృష్ణారెడ్డి గుర్తుచేసుకున్నారు.

Chuttamalle: అసహ్యకరం.. సిగ్గుచేటు: .. ‘చుట్టమల్లే’ సాంగ్ ఏఐ మార్ఫింగ్‌‌పై ఎన్టీఆర్ సీరియస్

‘దేవర’ చిత్రంలోని “చుట్టమల్లే” పాటకు సంబంధించిన విజువల్స్‌ను కొందరు ఏఐ టూల్స్ ద్వారా అసభ్యకరంగా మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో వదలడంపై యంగ్ టైగర్ ఎన్టీఆర్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలను దేవతలుగా పూజించే గడ్డపై ఇంతటి పైశాచిక చర్యలకు దిగజారడం సిగ్గుచేటని ఆయన మండిపడ్డారు. ఈ మార్ఫింగ్ వీడియోల వెనుక ఉన్నవారిపై, దీన్ని ప్రచారం చేస్తున్న వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. ఇలాంటి కంటెంట్‌‌ను ఎవరూ చూడొద్దని, రేపు ఇది మీ ఇంట్లోని వాళ్లకూ ఎదురయ్యే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.

Chuttamalle: ‘చుట్టమల్లే’ పాటకు ఏఐ వికృత చేష్టలు… ఎన్టీఆర్, జాన్వీల మార్ఫింగ్ వీడియోలపై భగ్గుమంటున్న నెటిజన్లు

‘దేవర’ సినిమాలోని చార్ట్‌బస్టర్ సాంగ్ “చుట్టమల్లే” చుట్టూ ఏఐ ఆధారిత సరికొత్త వివాదం చెలరేగింది. కొందరు డిజిటల్ క్రియేటర్లు ఏఐ సాంకేతికతను దుర్వినియోగం చేస్తూ, ఎన్టీఆర్, జాన్వీ కపూర్‌ల హావభావాలను మార్చేసి పాటలో లేని అసభ్యకర, అభ్యంతరకర దృశ్యాలను సృష్టిస్తున్నారు. ఇది అసలైన పాటలోని విజువల్సేనని భ్రమపడుతుండటంతో నటీనటుల ప్రతిష్టకు భంగం వాటిల్లుతోందని సినీ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. క్రియేటివిటీ పేరుతో వ్యక్తుల గౌరవాన్ని దిగజార్చేలాంటి మార్ఫింగ్ క్లిప్పులు రూపొందించిన వారిని తక్షణమే గుర్తించి, జైలుకు పంపాలని నెటిజన్లు తీవ్రస్థాయిలో డిమాండ్ చేస్తున్నారు.

‘మీ సాహసం దేశానికే గర్వకారణం’… రియల్ హీరో కెప్టెన్ స్మిత్‌ మచ్చర్‌పై చిరంజీవి ప్రశంసల జల్లు

ఫ్లైదుబాయ్ విమానంలో కో-పైలట్ దాడి చేసినప్పటికీ ప్రాణాలకు తెగించి ప్రయాణికులను కాపాడిన భారతీయ పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్‌పై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు కురిపించారు. తీవ్ర గాయాల పాలైన స్థితిలోనూ ఒంటిచేత్తో పోరాడి వందలాది ప్రాణాలను నిలబెట్టిన ఆయన ధైర్యం ప్రతి భారతీయుడికీ గర్వకారణమని కొనియాడారు. విపత్కర పరిస్థితుల్లో హనుమాన్ చాలీసా పఠిస్తూ మనోధైర్యాన్ని కూడగట్టుకున్నారని తెలిసి తన మనసు చలించిందని చెబుతూ, ఆంజనేయస్వామి ఆశీస్సులతో స్మిత్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.