HomeEntertainmentఆ రిసార్ట్ అమ్ముకోకుండా ఉంటే నవదీప్ రూ.వందల కోట్లకు అధిపతి... సీక్రెట్ బయటపెట్టిన అజయ్ ఘోష్

ఆ రిసార్ట్ అమ్ముకోకుండా ఉంటే నవదీప్ రూ.వందల కోట్లకు అధిపతి… సీక్రెట్ బయటపెట్టిన అజయ్ ఘోష్

సినీ వేదికలపై హీరోల ఆస్తులపై నటుడు అజయ్ ఘోష్ చేస్తున్న వ్యాఖ్యలు నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి. 2002లో నవదీప్ తండ్రి రామారావు చీరాల బీచ్ సమీపంలో ‘రామాపురం రిసార్ట్స్’ ప్రారంభించారని, హైదరాబాద్ వచ్చే క్రమంలో దాన్ని అమ్మేశారని తెలిపారు. ప్రస్తుతం ‘ఆంధ్రా గోవా’గా మారిన ఆ ప్రాంతంలో ఆస్తిని అమ్మకుండా ఉంటే నవదీప్ వందల కోట్ల ఆస్తిపరుడయ్యేవాడని పేర్కొన్నారు. గతంలో రవితేజ మామిడి తోట విలువలపైనా ఇలాగే మాట్లాడిన అజయ్ ఘోష్‌పై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. సినిమా వేదికలపై పక్కోళ్ల ఆస్తులు, రియల్ ఎస్టేట్ లావాదేవీలపై లెక్చర్లు ఇవ్వడం ఎందుకంటూ కొందరు ఆయనపై సెటైర్లు వేస్తున్నారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments