Home Blog Page 29

నమ్రతతో సుకుమార్ సతీమణి, వంశీ పైడిపల్లి భార్య.. వెంకటేష్ మహా ‘అట్టహాసం’లో పావని.. శారీలో మెరిసిన తాప్సీ

• వెంకటేష్ మహా ‘అట్టహాసం’ సినిమాలో పావని కరణం
• నమ్రతతో వంశీ పైడిపల్లి భార్య, సుకుమార్ సతీమణి
• చీరకట్టులో తాప్సీ పన్ను
• ఎల్లో డ్రెస్సులో బిందు మాధవి
• బ్లాక్ డ్రెస్ లో సన్యా మల్హోత్రా
• అనుపమ పరమేశ్వరన్ క్యూట్ లుక్స్
• మేఘా ఆకాష్ త్రోబ్యాక్ పిక్స్
• దివితో సహా సెలబ్రిటీల తాజా ఇన్‌స్టా పోస్టులపై ఓ లుక్కేద్దాం.

The Traitors Telugu Reality Show: తేజ సజ్జా ‘ది ట్రెయిటర్స్’.. సింగర్ చిన్మయి, వర్షా డిసౌజా, ప్రగతితో సహా మొత్తం 20 మంది కంటెస్టెంట్‌లు వీరే!

హిందీలో ఆకట్టుకున్న ‘ది ట్రెయిటర్స్’ రియాలిటీ షో తెలుగు ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది. అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా అక్టోబర్ 15 నుంచి స్ట్రీమింగ్ కానుంది. యంగ్ హీరో తేజ సజ్జా హోస్ట్‌గా పరిచయమవుతున్న ఈ షోలో సింగర్ చిన్మయి, వర్షా డిసౌజా, ప్రగతి, హర్షవర్ధన్ సహా 20 మంది సెలబ్రిటీలు పాల్గొంటున్నారు. మొత్తం 10 ఎపిసోడ్స్ గా ఈ షో రానుంది. ప్రతి గురువారం కొత్త ఎపిసోడ్ విడుదల కానుంది. ‘ది ట్రెయిటర్స్ తెలుగు’ ట్రైలర్ పై ఓ లుక్కేయండి.

దసరా బరిలో అనుపమ పరమేశ్వరన్ ‘క్రేజీ కళ్యాణం’.. లిటిల్ హార్ట్స్ మౌళీ ‘Donga నా కొడుకు’ రిలీజ్ డేట్ ఫిక్స్

‘ఆదర్శ కుటుంబం’ వాయిదా పడటంతో దసరా రేసులో కొత్త చిత్రాలు చేరుతున్నాయి. అనుపమ పరమేశ్వరన్, తరుణ్ భాస్కర్, అఖిల్ ఉడ్డెమారి ప్రధాన పాత్రల్లో నటించిన ‘క్రేజీ కళ్యాణం’ చిత్రాన్ని అక్టోబర్ 16న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. విజయ్ దేవరకొండ ‘రణబాలి’, రజనీకాంత్ ‘జైలర్ 2’లకు పోటీగా ఈ చిత్రం వస్తోంది. మరోవైపు మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న మౌళీ తనుజ్ ప్రశాంత్ ‘Donga నా కొడుకు’ సినిమా విడుదల తేదీని కూడా అధికారికంగా ప్రకటించారు.

డైపర్ల కంపెనీ స్వరా బేబీ ప్రొడక్ట్స్ IPOకు SEBI గ్రీన్ సిగ్నల్.. రూ.1000 కోట్లు సమీకరణే లక్ష్యం!

0
Swara Baby Products IPO: డైపర్ల తయారీ కంపెనీ స్వరా బేబీ ప్రొడక్ట్స్ పబ్లిక్ ఇష్యూకు వస్తోంది. ఫస్ట్ క్రై మద్ధతు గల ఈ కంపెనీ ఐపీఓకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నుంచి తాజాగా ఆమోదం లభించింది. ఈ కంపెనీ ప్రాథమిక మార్కెట్ నుంచి రూ. 1000 కోట్లు సమీకరించే లక్ష్యంతో ఈ కంపెనీ ఐపీఓకు వస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఈ పబ్లిక్ ఇష్యూ గురించిన వివరాలు తెలుసుకుందాం.

Vivo నుంచి ఒకేసారి 3 కొత్త ఫోన్లు లాంచ్.. X ఫోల్డ్, S2 FE, వి80 ధర, ఫీచర్లు సహా పూర్తి వివరాలు ఇవే!

0
Vivo Phones Launched: దిగ్గజ మొబైల్ తయారీ కంపెనీ వివో భారత్‌లో ఒకేసారి 3 ఫోన్లను లాంచ్ చేసింది. దసరా, దీపావళి పండగ సీజన్ మొదలైన వేళ కొత్త ఫోన్లు మార్కెట్లోకి విడుదల చేయడం గమనార్హం. సేల్స్ పెంచుకునేందుకు ఈ కొత్త ఫోన్లు దోహదపడతాయని కంపెనీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఎక్స్ సిరీస్, ఎస్ సిరీస్, వీ సిరీస్ నుంచి ఒక్కో ఫోన్ తీసుకొచ్చింది. మరి ఈ ఫోన్ల ఫీచర్లు, ధరల గురించిన వివరాలు తెలుసుకుందాం.

రూ.20,000 బిల్లు రూ.2000 చొప్పున 10 సార్లు UPI చేస్తే.. MDR ఛార్జీలు తప్పుతాయా? ఇలా చేయడం చట్టబద్ధమేనా?

0
UPI MDR Charges Payment Split: రూ.2000 దాటిన యూపీఐ పేమెంట్లపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ ఛార్జీలను విధించనున్నారు. ఈ క్రమంలో ఛార్జీలను తప్పించుకునేందుకు పెద్ద బిల్లులను చిన్న చిన్న మొత్తాలుగా విభజిస్తే సరిపోతుందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఉదాహరణకు రూ.20 వేల బిల్లును రూ.2000 చొప్పున 10 సార్లు పేమెంట్ చేస్తే సరిపోతుంది అనేది వాదన. అయితే ఇలా చేస్తే ఎండీఆర్ ఛార్జీలు తప్పుతాయా? అనేది ఈ కథనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

దేశంలోనే తొలి గ్రీన్‌ఫీల్డ్ కమ్యూనిటీ కిచెన్.. నిత్యం 60 వేలమందికి అల్పాహారం, సూర్యాపేటలో శంకుస్థాపన

0
దేశంలోనే తొలి గ్రీన్‌ఫీల్డ్ కమ్యూనిటీ కిచెన్‌ తెలంగాణలో రానుంది. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పౌష్టికాహారం అందించే కార్యక్రమంలో భాగంగా సూర్యాపేట జిల్లాలో గ్రీన్‌ఫీల్డ్ సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. సుమారు రూ.9.60 కోట్లతో నిర్మించనున్న ఈ వంటశాల ద్వారా 1,029 పాఠశాలలు, జూనియర్‌ కళాశాలల్లోని దాదాపు 60 వేల మంది విద్యార్థులకు నిత్యం అల్పాహారం అందించనున్నారు. ఈ ప్రాజెక్టుకు సింగరేణి సంస్థ నిధులు సమకూర్చింది.

ఎర్రవల్లి భూములపై సీఎం రేవంత్ సమీక్ష.. 45 ఎకరాలపై ఆరా, కేసీఆర్ కుటుంబానికి నోటీసులు!

0
ఎర్రవల్లి, వెంకటాపురం గ్రామాల భూములపై సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఎర్రవల్లి సర్వే నంబర్‌ 325లో 45 ఎకరాలు మాయం కావడం వెనుక ఉన్న కారణాన్ని తేల్చాలని అధికారులను ఆదేశించారు. భూముల సరిహద్దుల పరిశీలన కోసం 2 గ్రామాల్లో సర్వే నోటిఫికేషన్‌ విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సంబంధిత రెవెన్యూ రికార్డులు సమర్పించాలని కేసీఆర్‌ కుటుంబానికి అధికారులు నోటీసులు జారీ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఆ భూముల్లో తెలంగాణ ఉద్యమ అమరవీరుల కుటుంబాల కోసం కాలనీ నిర్మించాలని.. హౌసింగ్‌ బోర్డుకు బాధ్యతలు అప్పగించాలని సీఎం సూచించారు.

రష్యా సైన్యంలోకి తెలంగాణ యువకులు.. ఉద్యోగాల పేరుతో వల, అప్పులు చేసి మరీ వెళ్లి యుద్ధంలోకి!

0
విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి తెలంగాణకు చెందిన యువకులను రష్యాకు తీసుకెళ్లి.. అక్కడ సైనిక నియామక వ్యవస్థలోకి చేర్చారన్న ఆరోపణలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. వంటవాళ్లు, క్లీనర్లు, మెకానిక్‌లు వంటి ఉద్యోగాల పేరుతో ఏజెంట్లు డబ్బులు వసూలు చేసినట్లు బాధిత కుటుంబాలు ఫిర్యాదు చేశాయి. ఈ వ్యవహారంలో దమ్మన్నపేటకు చెందిన మెగావత్‌ ప్రకాశ్‌ ఉదంతం వెలుగులోకి వచ్చింది. రష్యాలో చిక్కుకున్న 16 మందిలో ముగ్గురు స్వదేశానికి తిరిగివచ్చినట్లు తెలుస్తోంది. నిజామాబాద్‌ పోలీసులు గౌరవ్‌ చౌదరిని అరెస్ట్‌ చేసి.. నియామక సంస్థతో అతడికి ఉన్న సంబంధాలపై విచారణ చేపట్టారు. మిగిలిన వారిని స్వదేశానికి తీసుకురావాలని ఎంపీ ధర్మపురి అర్వింద్‌ కేంద్ర విదేశాంగ మంత్రిని కోరారు.

తెలంగాణ యువకులను విదేశీ ఉద్యోగాల పేరుతో రష్యాకు తీసుకెళ్లి.. అక్కడి సైన్యంలో చేర్చారన్న ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. వంటవాళ్లు, క్లీనర్లు, మెకానిక్‌లు, గార్డెనర్లు, ఇతర సహాయక సిబ్బంది ఉద్యోగాలు విదేశాల్లో ఇప్పిస్తామని నమ్మించి కొందరు ఏజెంట్లు.. యువకులను రష్యాకు పంపినట్లు బాధిత కుటుంబాలు ఫిర్యాదు చేశాయి. అక్కడికి వెళ్లిన తర్వాత కొందరికి పౌర ఉద్యోగాలు ఇవ్వకుండా సైనిక శిక్షణకు పంపించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. తెలంగాణకు చెందిన 20 మంది ఈ రిక్రూట్‌మెంట్‌ నెట్‌వర్క్‌ బారిన పడి.. అక్కడికి వెళ్లినట్లు సమాచారం. వీరిలో కొందరు స్వదేశానికి తిరిగి రాగా.. మరికొందరు ఇంకా అక్కడే చిక్కుకుపోయారని బాధితులు చెబుతున్నారు. నలుగురు తెలంగాణ యువకులు రష్యా సైన్యం తరఫున ఉక్రెయిన్‌పై యుద్ధంలో పాల్గొన్నట్లు భావిస్తున్నారు.

ఉపాధి కోసం విదేశాలకు వెళ్లాలనుకునే యువకులను లక్ష్యంగా చేసుకుని ఏజెంట్లు ఈ వ్యవహారాన్ని నడిపినట్లు బాధితుల కుటుంబాలు ఆరోపిస్తున్నాయి. రష్యాలో మంచి ఉద్యోగాలు ఇప్పిస్తామని.. వీసా, ప్రయాణ ఏర్పాట్లు చేస్తామని నమ్మించి డబ్బులు వసూలు చేసినట్లు ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. వంటవాళ్లు, శుభ్రత సిబ్బంది, తోటల నిర్వహణ, మెకానిక్‌లు, ఇతర సహాయక ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చినట్లు చెబుతున్నారు. ఈ వ్యవహారంలో నిజామాబాద్‌, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల జిల్లాలకు చెందిన పలువురు యువకుల పేర్లు వెలుగులోకి వచ్చాయి. విదేశాల్లో ఉద్యోగం చేసి అప్పులు తీర్చుకోవాలనే ఆశతో వెళ్లినవారు అక్కడి పరిస్థితులతో ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు బాధిత కుటుంబాలు చెబుతున్నాయి.

కొంతమంది యువకులు తమ పరిస్థితిని వివరిస్తూ వీడియోలు, మెసేజ్‌ల ద్వారా సహాయం కోరుతున్నారని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. స్వదేశంలో చేసిన అప్పులను తీర్చుకోవాలనే ఉద్దేశంతో ఏజెంట్లను నమ్మి అక్కడికి వెళ్లామని.. చివరకు మోసపోయి స్వదేశానికి తిరిగివచ్చిన కస్తూరి తిరుపతి అనే యువకుడు పేర్కొన్నాడు. ఉపాధి కోసం వెళ్లిన యువకులు విదేశీ సైనిక వ్యవస్థలో చిక్కుకోవడం వారి కుటుంబాల్లో తీవ్ర ఆందోళనకు కారణమైంది. రష్యాలో చిక్కుకున్న తెలంగాణ యువకులను తిరిగి తీసుకురావడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. స్వదేశానికి రప్పించే చర్యల్లో గుర్తించిన 16 మందిలో బండ లింగాపూర్‌కు చెందిన శేఖర్‌, కేశాపూర్‌కు చెందిన రాజశేఖర్‌, ధర్పల్లికి చెందిన తిరుపతి స్వదేశానికి తిరిగివచ్చినట్లు తెలుస్తోంది. మిగిలిన 13 మంది స్వదేశానికి చేరుకునేందుకు ఎదురుచూస్తున్నారని తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్‌. జైశంకర్‌కు లేఖ రాశారు. రష్యాలో చిక్కుకున్న 16 మంది భారతీయులను స్వదేశానికి రప్పించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. కొందరి విడుదల, తిరుగు ప్రయాణానికి సహకరించిన కేంద్ర విదేశాంగ శాఖకు.. భారత రాయబార కార్యాలయానికి ఎంపీ అర్వింద్ కృతజ్ఞతలు తెలిపారు.

KBR పార్క్ ప్రాజెక్టులో భారీ మార్పులు.. ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు రద్దు, మేఘా సంస్థకు కొత్త బాధ్యతలు!

0
కేబీఆర్‌ పార్క్‌ చుట్టూ చేపట్టనున్న ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌ల ప్రాజెక్టులో ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. పంజాగుట్ట శ్మశానవాటిక, ఎన్‌ఎఫ్‌సీఎల్‌ జంక్షన్లలో ప్రతిపాదించిన ఫ్లైఓవర్లతో పాటు బంజారాహిల్స్‌లోని అండర్‌పాస్‌ నిర్మాణాన్ని రద్దు చేసింది. జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్ట్‌ నుంచి ముఫకంజా కాలేజీ వరకు స్టీల్‌ ఫ్లైఓవర్‌ నిర్మాణం, బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌-1కు కనెక్టింగ్‌ ర్యాంప్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. కేఎన్‌ఆర్‌ కన్‌స్ట్రక్షన్స్‌కు ఇచ్చిన లెటర్‌ ఆఫ్‌ అవార్డును ఉపసంహరించుకుని.. సవరించిన ప్రాజెక్టు పనులను మేఘా ఇంజినీరింగ్‌కు అప్పగించేందుకు అనుమతించింది. రెండు ప్యాకేజీల వ్యయాన్ని కలిపి సుమారు రూ.1,090 కోట్ల నుంచి రూ.715.16 కోట్లకు తగ్గించారు.

హైదరాబాద్ నగరంలోని అత్యంత రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఒకటైన కేబీఆర్‌ పార్క్‌ వద్ద చేపట్టిన పనులకు రాష్ట్ర ప్రభుత్వం బ్రేకులు వేసిన సంగతి తెలిసిందే. కేబీఆర్ పార్కు చుట్టూ ట్రాఫిక్‌ సమస్యల పరిష్కారం కోసం ప్రతిపాదించిన ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌ల ప్రాజెక్టులో కీలక మార్పులు చేసింది. పాత డిజైన్లలోని పలు నిర్మాణాలను రద్దు చేస్తూ.. ప్రాజెక్టును సవరించిన రూపంలో ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించింది. గతంలో కేఎన్‌ఆర్‌ కన్‌స్ట్రక్షన్స్‌కు జారీ చేసిన లెటర్‌ ఆఫ్‌ అవార్డును ఉపసంహరించుకుంది. అదే సమయంలో మేఘా ఇంజినీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌ లిమిటెడ్‌కు పనులు అప్పగించేందుకు అనుమతులు ఇచ్చింది. ఈ మేరకు పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

కేబీఆర్‌ పార్క్‌ చుట్టూ గతంలో ప్రతిపాదించిన అన్ని నిర్మాణాలను యథాతథంగా కొనసాగించకుండా.. ట్రాఫిక్‌ అవసరాలకు అనుగుణంగా పనుల పరిధిని రేవంత్ రెడ్డి ప్రభుత్వం సవరించింది. పంజాగుట్ట శ్మశానవాటిక జంక్షన్‌లో ప్రతిపాదించిన 3 లేన్ల వన్‌వే ఫ్లైఓవర్‌, ఎన్‌ఎఫ్‌సీఎల్‌ జంక్షన్‌లో ప్రతిపాదించిన 2 లేన్ల వన్‌వే ఫ్లైఓవర్‌ నిర్మాణాలను రద్దు చేసింది. బంజారాహిల్స్‌లో ప్రతిపాదించిన 2 లేన్ల వన్‌వే అండర్‌పాస్‌ పనులను కూడా తొలగించింది.

అలాగే కేబీఆర్‌ పార్క్‌ ప్రవేశ ద్వారం, ముగ్ధ జంక్షన్‌, రోడ్‌ నంబర్‌ 45, ఫిల్మ్‌నగర్‌, మహారాజా అగ్రసేన్‌ జంక్షన్‌, క్యాన్సర్‌ ఆస్పత్రి జంక్షన్‌ పరిసరాల్లో చేపట్టాల్సిన పనుల పరిధిలోనూ మార్పులు చేసింది. పాత ప్రణాళికలోని కొన్ని గ్రేడ్‌ సెపరేటర్లను తొలగించి.. ప్రధాన ఎలివేటెడ్‌ మార్గంపై దృష్టి పెట్టనున్నారు. సవరించిన ప్రణాళికలో జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్ట్‌ నుంచి ముఫకంజా ఇంజినీరింగ్‌ కాలేజీ వరకు స్టీల్‌ ఫ్లైఓవర్‌ నిర్మాణం చేపట్టనున్నారు. ఈ మార్గాన్ని బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌-1కు అనుసంధానించేలా కనెక్టింగ్‌ ర్యాంప్‌ ఏర్పాటు చేయనున్నారు.

నాగార్జున సర్కిల్‌ నుంచి జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్ట్‌ వరకు 6 లేన్ల స్టీల్‌ బ్రిడ్జి నిర్మాణం చేపట్టే ప్రతిపాదన ఉందని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆర్‌వి కర్ణన్‌ తెలిపారు. కేబీఆర్‌ పార్క్‌ చుట్టూ వన్‌వే ట్రాఫిక్‌ విధానాన్ని కొనసాగించడంతో పాటు.. అవసరమైన చోట్ల మాత్రమే కొత్త నిర్మాణాలు చేపట్టేలా ప్రణాళికను రూపొందిస్తున్నారు. ఈ ప్రాజెక్టును ఇంజినీరింగ్‌, ప్రొక్యూర్‌మెంట్‌, కన్స్ట్రక్షన్‌ (ఈపీసీ) విధానంలో 2 ప్యాకేజీలుగా అమలు చేయనున్నారు. మొదటి ప్యాకేజీలో జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్ట్‌ నుంచి ముగ్ధ జంక్షన్‌ వరకు.. రెండో ప్యాకేజీలో ముగ్ధ జంక్షన్‌ నుంచి ముఫకంజా కాలేజీ వరకు పనులు చేపట్టేలా ప్రణాళిక సిద్ధం చేసింది.

ప్రాజెక్టు మేనేజ్‌మెంట్‌ కన్సల్టెంట్ల సేవలను కొనసాగించేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. సవరించిన ప్రతిపాదనలను ఈపీసీ కమిటీ-III ముందు ఉంచేందుకు అనుమతి ఇచ్చింది. జీహెచ్‌ఎంసీ చేపట్టిన సంబంధిత చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు జీవో ఆర్టీ నంబర్‌ 927 జారీ చేశారు. కేబీఆర్‌ పార్క్‌ పరిసరాల్లో అనేక ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు, గ్రేడ్‌ సెపరేటర్లకు బదులుగా సమగ్ర ఎలివేటెడ్‌ మార్గాన్ని అభివృద్ధి చేయడం వల్ల ప్రైవేటు భూముల సేకరణ అవసరం తగ్గుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

భూసేకరణ వ్యయంలో సుమారు రూ.800 కోట్లు.. పాత ప్రణాళికలోని అదనపు నిర్మాణాలను తొలగించడం ద్వారా మరో రూ.400 కోట్లు ఆదా కావచ్చని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఈ అంచనాల ప్రకారం మొత్తం రూ.1,200 కోట్ల వరకు ఆదా సాధ్యమని చెబుతున్నారు. మొత్తంగా కేబీఆర్‌ పార్క్‌ చుట్టూ ట్రాఫిక్‌ నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం పాత ప్రణాళికను మార్చి.. స్టీల్‌ ఫ్లైఓవర్‌ నిర్మాణానికి ప్రాధాన్యం ఇస్తోంది. సవరించిన డిజైన్లకు తుది అనుమతులు, పనుల ప్రారంభం, నిర్మాణ గడువు వంటి అంశాలపై తదుపరి అధికారిక ప్రకటనలు కీలకం కానున్నాయి.