Home Blog Page 28

ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలపై చంద్రబాబు సీరియస్.. పార్టీకి నష్టం జరుగుతోందని వార్నింగ్, పల్లాకు నేతల వివరణ

TDP Mlas Kolikapudi Chintamaneni Explanations To Palla Srinivasa Rao: టీడీపీ అధిష్టానం ఇద్దరు ఎమ్మెల్యే తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. తిరువూరులో టీడీపీ నేతల మధ్య వివాదం, దెందులూరులో టోల్ ప్లాజా ఘటనలపై తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఆరా తీశారు. తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు, సామాజిక సంక్షేమ బోర్డు చైర్మన్ బాలకోటయ్య మధ్య వివాదంపై చర్చించారు. కొలికపూడి బాలకోటయ్య నుంచి వివరాలు, వివరణ కోరారు. ఇటు చింతమనేని నుంచి టోల్‌ప్లాజా ఘటనపై వివరణ తీసుకున్నారు.

కొమ్మలు తీసుకొచ్చి నాటితే ఏడాదిలోనే దిగుబడి.. మొగలి పుష్పాలతో ఆయిల్ తయారీ.. లీటర్ రూ.2.50 లక్షలు

Srikakulam Farmers Get Income From Kewda Flowers Oil: శ్రీకాకుళం జిల్లాలో రైతులు వినూత్నంగా మొగలి సాగు చేస్తున్నారు. మొగలి మొక్కల్ని నాటి పుష్పాలతో లాభాలు పొందుతున్నారు. మొగలి పుష్పాల నుంచి తీసిన ఆయిల్‌తో భారీగా ఆదాయం వస్తోంది. మొగలి పువ్వుల నుంచి తీసిన ఆయిల్ లీటర్ రూ.2.50 లక్షలు పలకుతోంది.. సీజన్‌లో అంతకుమించి కూడా డిమాండ్ ఉంటోంది. ఈ ఆయిల్‌ను ఇతర రాష్ట్రాలు, విదేశాలకు కూడా ఎగుమతి చేస్తున్నారు.

SRI KASHI NAYANA DAILY – 7 అక్టోబర్ 2026

దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు – ఆలయ కమిటీ అధ్యక్షులు లక్ష్మీపతి

తపాలా సేవలు, పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి – హిందూపురం డివిజన్ సూపరింటెండెంట్ ఎస్.రెడ్డి భాష

కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలి – మెడికల్ హెల్త్ కాంట్రాక్ట్ JAC

పేదలకు కంటి వెలుగు ప్రసాదించడమే లక్ష్యం – రోటరీ క్లబ్ అధ్యక్షులు జయసింహ

ఏపీ బీసీ గురుకులాల్లో ఉద్యోగుల బదిలీలు.. 50 ఏళ్లలోపు మగ ఉద్యోగులు బాలికల విద్యాసంస్థల్లో ఉండొద్దు!

AP Bc Gurukulam Staff Transfers Guidelines: ఏపీలో మహాత్మా జ్యోతిబాపూలే బీసీ గురుకులాల్లో పనిచేస్తున్న బోధన, బోధనేతర సిబ్బంది బదిలీలకు ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. ఒకేచోట 8 ఏళ్లు పూర్తిచేసిన ఉద్యోగులను బదిలీ తప్పనిసరి చేసింది. అలాగే బాలికల గురుకులాల్లో పనిచేస్తున్న 50 ఏళ్లలోపు పురుష ఉద్యోగులు, ప్రిన్సిపాళ్లు, బోధనేతర సిబ్బందిని బాలుర గురుకులాలకు బదిలీ చేయాలని మార్గదర్శకాలు పేర్కొంది. రెండేళ్లలోపు రిటైర్ అయ్యేవారికి మాత్రం మినహాయింపు ఇచ్చారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహాత్మా జ్యోతిబాపూలే బీసీ గురుకులాలలో (ఎంజేపీ ఏపీ బీసీడబ్ల్యూఆర్‌ఈఐఎస్) పనిచేస్తున్న ఉద్యోగుల (బోధన, బోధనేతర) బదిలీకి మార్గదర్శకాలు జారీ చేసింది. ఎంజేపీ ఏపీ బీసీడబ్ల్యూఆర్‌ఈఐఎస్ బాలికల విద్యాసంస్థల్లో పనిచేసే 50 ఏళ్లలోపు వయసున్న ప్రిన్సిపల్ సహా పురుష ఉద్యోగులందర్ని అందరినీ బాలుర విద్యాసంస్థలకు బదిలీ చేయాలని ఆదేశించింది. రెండేళ్లుగా ఒకే విద్యాసంస్థలో పనిచేస్తున్నవారి బదిలీకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఒకే విద్యా సంస్థలో 8 ఏళ్లు సర్వీస్ పూర్తి చేసుకున్నవారికి తప్పనిసరిగా బదిలీ వర్తిస్తుంది. ప్రస్తుతం బోర్డు ఆమోదం, ప్రభుత్వ మంజూరు లేని పోస్టుల్లో విధుల్లో ఉన్నవారు తప్పనిసరి బదిలీ కేటగిరి కిందకు వస్తారు.

ఏపీ ప్రభుత్వం దృష్టిలోపం ఉన్నవారికి, రెండేళ్లలోపు పదవీ విరమణ చేసే ఉద్యోగులను తప్పనిసరి బదిలీల నుంచి మినహాయించింది. ఒకవేళ వీరు స్వచ్ఛందంగా బదిలీ కోరితే మాత్రం అనుమతి ఉంటుంది. అంతేకాదు వైకల్యం, తీవ్ర అనారోగ్యం, వితంతువు ఉద్యోగులు, భార్యాభర్తల కేసులకు బదిలీల్లో కొంత వెసులుబాటు కల్పించారు. అలాగే బదిలీపై తుది నిర్ణయం తీసుకునే అధికారం సొసైటీ కార్యదర్శికి ఉంటుంది. ఈ మార్గదర్శకాల ప్రకారం ప్రభుత్వం బదిలీలపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేసిన తర్వాత తదుపరి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది.

ప్రస్తుతం ఉద్యోగుల బదిలీ కారణంగా కొన్ని ఖాళీలు ఏర్పడతాయి.. వాటిని వెంటనే భర్తీ చేయాల్సిన అవసరం లేదని ప్రభుత్వం తెలిపింది. అంతేకాదు ఈ బదిలీల ప్రక్రియ ఆన్‌లైన్‌ ద్వారానే చేపట్టాలని.. సాధారణ బదిలీల సందర్భంగా వర్తించే ఇతర నిబంధనలూ పాటించాలని ఆదేశించింది. అన్ని గురుకులాల్లో రెగ్యులర్ ఉద్యోగుల నిష్పత్తి సమానంగా ఉండేలా ఖాళీలను ప్రకటించనున్నారు. మారుమూలలో ఉండే విద్యా సంస్థల్లోనూ రెగ్యులర్‌ ఉపాధ్యాయులు తగిన సంఖ్యలో ఉండేలా చూస్తారు. మొత్తం మీద ఏపీ ప్రభుత్వం బీసీ గురుకులాల పరిధిలో పనిచేస్తున్న బోధన, బోధనేతర సిబ్బంది బదిలీలకు మార్గదర్శకాలపై స్పష్టత ఇచ్చింది. మరోవైపు సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాలు, కళాశాలల్లో పనిచేస్తున్న పార్ట్‌టైమ్ ఉపాధ్యాయులు, లెక్చరర్లు, ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని ముఖ్యమంత్రిని సీపీఎం కోరింది. మొత్తం 1673మంది ఉన్నారని.. వారికి సరైన వేతనాలు అందడం లేదని.. మరికొన్ని సమస్యలు ఉన్నాయన్నారు. వెంటనే వారి సమస్యలు పరిష్కరించాలని కోరారు.

మాజీ ఎమ్మెల్యే రాపాక ఇంటికి ఎంపీ ల్యాడ్స్‌తో సీసీ రోడ్డు.. ఆ భూమి స్వాధీనం చేసుకోవాలని కేంద్రం ఆదేశం, కలెక్టర్ కీలక నిర్ణయం

Rapaka Vara Prasada Rao Residence Mplads CC Road: మాజీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ఇంటికి వేసిన సీసీ రోడ్డు వ్యవహారం మరో మలుపు తిరిగింది. గతంలో కేంద్రం ఇచ్చిన ఆదేశాలను అమలుకు కలెక్టర్ చర్యలు తీసుకున్నారు. వెంటనే సీసీ రోడ్డు నిర్మించిన స్థలాన్ని స్వాధీనం చేసుకుని పంచాయతీ పేరుతో రిజిస్ట్రేషన్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. వాస్తవానికిి గతంలోనే కేంద్రం నుంచి ఆదేశాలు వచ్చినా అమలు చేయలేదు.. తాాజాగా కలెక్టర్ భూమి స్వాధీనం చేసుకోవాలని ఆదేశించారు.

వైఎస్సార్‌సీపీ నేత, రాజోలు మాజీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు ఇంటికి సీసీ రోడ్డు వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. తాజాగా రాపాక ఇంటి దగ్గర రోడ్డు నిర్మించిన 9 సెంట్ల స్థలాన్ని స్వాధీనం చేసుకుని పంచాయతీ పేరిట రిజిస్ట్రేషన్‌ చేయాలని కలెక్టర్ తాజాగా ఆదేశించారు. అలాగే అక్కడ రాకపోకలకు అడ్డు లేకుండా గేటు తొలగించాలని కేంద్రం నుంచి ఆదేశాలు వచ్చాయని.. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని జిల్లా పంచాయతీ అధికారిని ఆదేశించారు. దీంతో అధికారులు చర్యలకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది

రాపాక వరప్రసాదరావుకు డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం కత్తిమండలో ఇల్లు ఉంది. ఆయన ఇంటి ఆవరణలో సీసీ రోడ్డు నిర్మించారు.. ఎంపీ ల్యాడ్స్ నిధులతో ఈ రోడ్డు నిర్మించారని గతంలో విమర్శలు వచ్చాయి. 2019-20లో అప్పటి అమలాపురం వైఎస్సార్‌సీపీ ఎంపీ చింతా అనురాధ ఎంపీ ల్యాండ్స్‌ నిధుల నుంచి రాపాక ఇంటి దగ్గర రోడ్డు నిర్మాణానికి రూ.12 లక్షలు కేటాయించారు. రాపాకపై జనసేన పార్టీ నేత వెంకటపతిరాజు కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడంతో ఈ వివాదం మొదలైంది.

ఎంపీ ల్యాడ్స్ నిధుల్ని ప్రజావసరాలకు వినియోగించాలని.. కానీ ఎమ్మెల్యే ఇంటికి వెళ్లే ప్రైవేటు రోడ్డు నిర్మాణానికి ఎలా కేటాయిస్తారని వెంకటపతిరాజు ఫిర్యాదులో పేర్కొన్నారు. జనసేన పార్టీ నేత ఫిర్యాదుపై స్పందించిన కేంద్రం.. రెండు వారాల్లోగా ఈ రోడ్డు వ్యవహారంపై చర్యలు తీసుకుని నివేదిక ఇవ్వాలని గత ప్రభుత్వ హయాంలోనే ఆదేశాలు జారీ చేసింది. రాపాక వరప్రసాదరావు ఇంటి ఆవరణలో రోడ్డు నిర్మించిన భూమిని పంచాయతీ పేరిట రిజిస్ట్రేషన్‌ చేయాలని ఆదేశించింది. అక్కడ అడ్డుగా నిర్మాణం చేసిన ప్రహరీ తొలగించి, బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకోవాలని స్పష్టంచేసింది. కానీ ఈ ఆదేశాలు అమలు చేయలేదు.. తాజాగా కేంద్రం ఇచ్చిన ఆదేశాల మేరకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారుల్ని ఆదేశించారు.

తిరుమలలో శ్రీవారి సేవకులుగా మీరూ వెళ్లొచ్చు.. ఆన్‌లైన్‌లో బుక్ చేస్కోండిలా.. ఉచితంగా వసతి, దర్శనం.. పూర్తి వివరాలివే

How To Book Srivari Seva In Tirumala Online: టీటీడీ తిరుమలలో భక్తులకు సేవలు అందించేందుకు శ్రీవారి సేవకులకు అవకాశం కల్పిస్తోంది. తిరుమలలో సేవలు అందించేందుకు ఆసక్తి ఉన్నవారు ముందుగానే ఆన్‌లైన్‌లో బుక్ చేసుకునేలా టీటీడీ ఏర్పాట్లు చేసింది. ప్రతి నెలా ఆన్‌లైన్‌లో కోటాను విడుదల చేస్తోంది. శ్రీవారి సేవకులుగా వెళ్లేందుకు ఎలా బుక్ చేసుకోవాలి, తిరుమలలో ఎలాంటి సేవలు అందించాలి, టీటీడీ శ్రీవారి సేవకులకు ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తుందో మనం తెలుసుకుందాం..

తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి నిత్యం వేలాదిమంది భక్తులు తరలివస్తుంటారు. కొండకు వచ్చే భక్తులకు సేవలు అందించేందుకు టీటీడీ శ్రీవారి సేవకులకు అవకాశం కల్పిస్తోంది. శ్రీవారి సేవకులు పలు ప్రాంతాల నుంచి వచ్చి తిరుమలలో భక్తులకు సేవలు అందిస్తున్నారు.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర సహా పలు రాష్ట్రాల నుంచి వస్తున్నారు. అసలు శ్రీవారి సేవకులుగా ఎలా వెళ్లాలి, అక్కడ ఎలాంటి సేవలు అందించాలి, శ్రీవారి సేవకులకు టీటీడీ ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తుందో మీరూ తెలుసుకోండి.

తిరుమలలో సేవలు అందించాలనుకుంటున్నవారు టీటీడీ అధికారిక వెబ్‌సైట్ https://ttdevasthanams.ap.gov.in/ ద్వారా ఆన్‌లైన్‌లో ముందుగా బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అనంతరం ఆ బుకింగ్ ఫామ్ తీసుకుని తిరుమలకు వస్తే.. అక్కడ ఆ ఫామ్‌లను గ్రూప్ సూపర్‌వైజర్లు చెక్ చేస్తారు. సేవకులకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్లు పరిశీలిస్తారు.. ఆధార్ కార్డు, అడ్రస్, బుకింగ్ ఐడీ ఫామ్‌లు, ఫోటో అప్డేట్, ఒరిజనల్ ఉందో, లేదో చూస్తారు. అక్కడ స్క్రూట్నీ అయ్యాక రిజిస్ట్రేషన్ కౌంటర్ దగ్గరకు వెళితే రిజిస్ట్రేషన్ చేస్తారు. అక్కడ రిజిస్ట్రేషన్ అయ్యాక లాకర్ స్లిప్ ఇస్తారు, దానిని తీసుకుని FMS దగ్గరకు వెళితే లాకర్, కీ ఇస్తారు. అనంతరం రిసెప్షన్ కౌంటర్ దగ్గరకు వెళితే పౌచ్, ట్యాగ్, స్కార్ఫ్ ఇస్తారు.. వాటిని తీసుకుని అందరూ సత్సంగానికి వస్తారు.

సంత్సంగానికి వచ్చిన సేవకులు.. తిరుమలలో సేవలు అందించే సమయంలో ఏం చేయాలి, ఏం చేయకూడదు, నియమ నిబంధనల గురించి వివరిస్తారు. తిరుమలలో ఎక్కడెడక్కడ సేవలు అందించాలి, ఎలా వెళ్లాలి, భక్తులతో ఎలా మెలగాలి, ఉద్యోగులతో ఎలా వ్యవహరించాలి వంటి విషయాలను సత్సంగంలో తెలియజేస్తారు. సత్సంగంలో భజన కార్యక్రమం.. యోగా, ధ్యానం కూడా ఉంటుంది. శ్రీవారి సేవకులు భక్తుల సేవే భగవంతుడి సేవ, మానవ సేవే మాధవ సేవగా భావిస్తారు. సత్సంగంలో సేవకులకు రామాయణం, మహా భారతం, భగవద్గీతలోని అంశాలను కథల రూపంలో క్లాసులు తీసుకుంటారు

తిరుమల శ్రీవారి సేవకులకు లక్కీ డిప్, ర్యాండమ్ పద్ధతిలో ఒక్కసారి ఆలయంలో డ్యూటీ వచ్చే అవకాశం ఉంటుంది, అప్పుడు వారు ఆలయంలో సేవలు అందించాల్సి ఉంటుంది. తిరుమలలో మొత్తం 39 చోట్ల సేవకులు సేవలు అందించాలి. తిరుమలలో శ్రీవారి సేవకుల కోసం టీటీడీ రూ.120 కోట్లతో భవనాన్ని నిర్మించారు. శ్రీవారి సేవా సదన్ 1, శ్రీవారి సేవా సదన్ 2.. పురుషులు, మహిళలకు వేర్వేరుగా ఉన్నాయి. అక్కడ శ్రీవారి సేవకులు వారం పాటూ ఉంటారు.. వారికి వసతి కల్పిస్తారు. సీఆర్వో కార్యాలయంలో కూడా సేవలు అందిస్తుంటారు.

ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు ఊరట.. కరవు ప్రభావిత మండలాల్లో రుణాలు రీషెడ్యూల్‌, బ్యాంకుల కీలక నిర్ణయం

AP Drought Affected Mandal Farmers Loan Reschedule: ఏపీ ప్రభుత్వం ఇటీవల కరువు మండలాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. 388 మండలాలను కరువు ప్రభావిత ప్రాంతాలుగా ప్రకటించారు. తాజాగా ఈ కరువు మండలాలకు సంబంధించిన రైతులకు ఊరట దక్కింది. రుణాలు రీషెడ్యూల్ చేయాలని బ్యాంకులు నిర్ణయించాయి.. ఈ మేరకు విజయవాడలో జరిగిన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. రైతులకు ఉపశమనం కల్పించేందుకు రుణాలు రీషెడ్యూల్ చేయాలని బ్యాంకులు నిర్ణయించాయి.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్‌ఎల్‌బీసీ) కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కరవు ప్రభావిత మండలాల్లో రుణాల రీషెడ్యూల్‌ చేయాలని నిర్ణయించారు. ఎస్‌ఎల్‌బీసీ (రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ) సమావేశంలో రుణాల రీషెడ్యూల్‌కు నిర్ణయం తీసుకున్నారు. అక్టోబర్ 1 తేదీనాటికి స్టాండర్డ్‌ కేటగిరీలో ఉండి.. బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్న రైతుల్ని అర్హులుగా ప్రకటించారు. రాష్ట్రంలో కరవు ప్రభావం తీవ్రంగా ఉండడంతో రైతులకు ఉపశమనం కల్పించేందుకు నిర్ణయం తీసుకున్నారు. రుణాలు రీషెడ్యూల్ చేస్తే రైతులకు రుణాల చెల్లింపు ఒత్తిడి తగ్గుతుందంటున్నారు.

విజయవాడలో మంగళవారం రోజు ప్రత్యేక ఎస్‌ఎల్‌బీసీ సమావేశాన్ని నిర్వహించారు. ప్రధానంగా కరవు పరిస్థితులపై చర్చించారు.. అనంతరం రుణాల రీషెడ్యూల్‌పై నిర్ణయం తీసుకున్నారు. వ్యవసాయ, పశుసంవర్ధక, మత్స్య పరిశ్రమ, పట్టు పెంపకం, ఆగ్రో/ఆహార శుద్ధి యూనిట్లు, వ్యవసాయ ఆధారితమైనవాటికి రుణాలు రీషెడ్యూల్‌ చేయాలని నిర్దేశించారు. ఏపీ ప్రభుత్వం ఈ నెల 1న 388 మండలాలను కరువు ప్రభావిత ప్రాంతాలుగా ప్రకటించిన సంగతి తెలిసిందే. వీటిలో 283 తీవ్ర, 105 మండలాలు మధ్యస్థ ప్రభావిత ప్రాంతాలుగా ఉన్నాయి. ఏపీలో కరువు మండలాల విషయానికి స్తే.. పల్నాడు, ప్రకాశం, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లోని మొత్తం మండలాల్ని కరవు ప్రాంతాలుగా గుర్తించారు. మార్కాపురం జిల్లాలో 2, శ్రీసత్యసాయి జిల్లాలో 3, అనంతపురం జిల్లాలో 4, నంద్యాల జిల్లాలో 2, కడప జిల్లాలో 3 మినహా మిగిలిన అన్ని మండలాలూ ఈ జాబితాలో ఉన్నాయి.

ఈ కరువు మండలాల రైతులకు రుణాల రీషెడ్యూల్‌తో పాటు కరవు నుంచి ఉపశమన చర్యలు చేపట్టాలని ఏపీ ప్రభుత్వం కలెక్టర్లను ఆదేశించింది. తాజాగా ఎస్‌ఎల్‌బీసీ సమావేశంలో రుణాలు రీషెడ్యూల్ చేయాలని నిర్ణయించారు. తీవ్ర కరువు ప్రభావిత మండలాల్లో 12 నెలల మారటోరియం. అయితే ఈ మండలాల్లో రైతులకు మారటోరియం వ్యవధితో కలిపి రుణాలు తిరిగి చెల్లించేందుకు 60 నెలలు గడువు పొడిగించారు. మధ్యస్థ కరువు ప్రభావిత మండలాలలో12 నెలల మారటోరియం. ఈ మండలాల్లో మారటోరియం కాలంతో కలిపి రుణాలు తిరిగి చెల్లించేందుకు 36 నెలలకు గడువు పొడిగించారు.

రైతులు తీసుకున్న పాత రుణాన్ని తిరిగి చెల్లించే నిబంధనలు, కాలపరిమితిని మార్చడాన్ని రుణాల రీషెడ్యూల్ అంటారు. రైతులు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు బ్యాంకులు ఈ అవకాశాన్ని కల్పిస్తాయి. అప్పుడు రుణం చెల్లించాల్సిన గడువును పెంచుతారు.. అప్పుడు రైతుకు ఊరట దక్కుతుంది. సాధారణంగా తీవ్రమైన కరవు, వరదలు, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ఆయా ప్రభుత్వాలు బ్యాంకులతో మాట్లాడి రైతుల పంట రుణాలను రీషెడ్యూల్ చేయిస్తుంది. ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం రుణాలు రీషెడ్యూల్ చేస్తారు. అప్పుడు రైతులు పాత రుణం చెల్లించడానికి సమయం ఇస్తారు.. అలాగే కొత్తగా పంట రుణాలు పొందే అవకాశం ఉంటుంది.

‘శభాష్ గాయత్రి.. మీ స్ఫూర్తి అభినందనీయం’.. దివ్యాంగ భక్తుడికి అన్నం తినిపించిన ఉద్యోగిపై చంద్రబాబు ప్రశంసలు

Dwaraka Tirumala Temple Employee Gayatri: ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల అన్నదాన కేంద్రంలో మహిళా ఉద్యోగిపై చంద్రబాబు ప్రశంసలు కురిపించారు. ఈ నెల 3న దివ్యాంగ భక్తుడికి గాయత్రి అనే మహిళా సిబ్బంది అన్నప్రసాదం తినిపించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. స్పందించిన చంద్రబాబు.. గాయత్రిని అభినందించారు.. దివ్యాంగుడికి అన్నప్రసాదం తినిపించే వీడియోను ట్వీట్‌ చేశారు. మానవసేవే మాధవ సేవని చాటి చెప్పారంటూ సీఎం ప్రశంసించారు.

అరసవల్లి సూర్యనారాయణస్వామికి రూ.2 కోట్ల విలువైన ఆభరణాలు, త్వరలో మరో రూ.2 కోట్లు.. హైదరాబాద్ అజ్ఞాత భక్తుడి ఖరీదైన కానుక

Hyderabad Anonymous Devotee Donated Rs 2 Crore Ornaments To Arasavalli Temple:శ్రీకాకుళం జిల్లా అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారికి ఖరీదైన కానుక అందింది. హైదరాబాద్‌కు చెందిన ఓ అజ్ఞాత భక్తుడు రూ.2 కోట్ల విలువైన ఆభరణాలను సమర్పించారు. అంతేకాదు మరో రూ.2కోట్ల కానుకలు ఇస్తానని కూడా చెప్పారు. ఆ భక్తుడు కనీసం తన పేరు కూడా చెప్పకపోవడం విశేషం. ఈ ఆభరణాలకు ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి అలంకరించారు.

దసరా సెలవుల్లో పిల్లలకు బోర్‌ కొట్టకుండా ఉంచే టిప్స్

దసరా సెలవుల్లో పిల్లలకు బోర్‌ కొట్టకుండా ఉంచే కొన్ని యాక్టివిటీస్‌ గురించి ఇక్కడ వివరించాం. ఈ పనులు చేయడం వల్ల పిల్లల్లో భక్తి భావం కూడా పెరుగుతుంది.