Dwaraka Tirumala Temple Employee Gayatri: ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల అన్నదాన కేంద్రంలో మహిళా ఉద్యోగిపై చంద్రబాబు ప్రశంసలు కురిపించారు. ఈ నెల 3న దివ్యాంగ భక్తుడికి గాయత్రి అనే మహిళా సిబ్బంది అన్నప్రసాదం తినిపించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. స్పందించిన చంద్రబాబు.. గాయత్రిని అభినందించారు.. దివ్యాంగుడికి అన్నప్రసాదం తినిపించే వీడియోను ట్వీట్ చేశారు. మానవసేవే మాధవ సేవని చాటి చెప్పారంటూ సీఎం ప్రశంసించారు.
‘శభాష్ గాయత్రి.. మీ స్ఫూర్తి అభినందనీయం’.. దివ్యాంగ భక్తుడికి అన్నం తినిపించిన ఉద్యోగిపై చంద్రబాబు ప్రశంసలు
RELATED ARTICLES


