
అమరావతి:
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన శుక్రవారం జరిగిన ఏపీ మంత్రివర్గ సమావేశంలో పారిశ్రామిక అభివృద్ధిపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు.MSME అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ రైట్ టు బిజినెస్ బిల్లుకు ఆమోదం తెలిపారు.
పరిశ్రమల అనుమతుల ప్రక్రియను సులభతరం చేయనున్నారు. కోసలనగరం ఇండస్ట్రియల్ పార్కు అభివృద్ధికి రూ.1,500 కోట్ల రుణానికి ఆమోదం తెలిపారు.శ్రీకాకుళం మూలపేటలో గ్రీన్‌ఫీల్డ్ కెమికల్ పార్కు, పెనుకొండలో కియా ప్లాంట్-2, శ్రీకాకుళంలో అదానీ ఇంటిగ్రేటెడ్ టైటానియం కాంప్లెక్స్‌కు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. పెట్టుబడులు, ఉపాధి అవకాశాల కల్పనే లక్ష్యంగా ఈ నిర్ణయాలు తీసుకున్నారు.


