HomeAndhra Pradeshమాజీ ఎమ్మెల్యే రాపాక ఇంటికి ఎంపీ ల్యాడ్స్‌తో సీసీ రోడ్డు.. ఆ భూమి స్వాధీనం చేసుకోవాలని...

మాజీ ఎమ్మెల్యే రాపాక ఇంటికి ఎంపీ ల్యాడ్స్‌తో సీసీ రోడ్డు.. ఆ భూమి స్వాధీనం చేసుకోవాలని కేంద్రం ఆదేశం, కలెక్టర్ కీలక నిర్ణయం

Rapaka Vara Prasada Rao Residence Mplads CC Road: మాజీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ఇంటికి వేసిన సీసీ రోడ్డు వ్యవహారం మరో మలుపు తిరిగింది. గతంలో కేంద్రం ఇచ్చిన ఆదేశాలను అమలుకు కలెక్టర్ చర్యలు తీసుకున్నారు. వెంటనే సీసీ రోడ్డు నిర్మించిన స్థలాన్ని స్వాధీనం చేసుకుని పంచాయతీ పేరుతో రిజిస్ట్రేషన్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. వాస్తవానికిి గతంలోనే కేంద్రం నుంచి ఆదేశాలు వచ్చినా అమలు చేయలేదు.. తాాజాగా కలెక్టర్ భూమి స్వాధీనం చేసుకోవాలని ఆదేశించారు.

వైఎస్సార్‌సీపీ నేత, రాజోలు మాజీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు ఇంటికి సీసీ రోడ్డు వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. తాజాగా రాపాక ఇంటి దగ్గర రోడ్డు నిర్మించిన 9 సెంట్ల స్థలాన్ని స్వాధీనం చేసుకుని పంచాయతీ పేరిట రిజిస్ట్రేషన్‌ చేయాలని కలెక్టర్ తాజాగా ఆదేశించారు. అలాగే అక్కడ రాకపోకలకు అడ్డు లేకుండా గేటు తొలగించాలని కేంద్రం నుంచి ఆదేశాలు వచ్చాయని.. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని జిల్లా పంచాయతీ అధికారిని ఆదేశించారు. దీంతో అధికారులు చర్యలకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది

రాపాక వరప్రసాదరావుకు డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం కత్తిమండలో ఇల్లు ఉంది. ఆయన ఇంటి ఆవరణలో సీసీ రోడ్డు నిర్మించారు.. ఎంపీ ల్యాడ్స్ నిధులతో ఈ రోడ్డు నిర్మించారని గతంలో విమర్శలు వచ్చాయి. 2019-20లో అప్పటి అమలాపురం వైఎస్సార్‌సీపీ ఎంపీ చింతా అనురాధ ఎంపీ ల్యాండ్స్‌ నిధుల నుంచి రాపాక ఇంటి దగ్గర రోడ్డు నిర్మాణానికి రూ.12 లక్షలు కేటాయించారు. రాపాకపై జనసేన పార్టీ నేత వెంకటపతిరాజు కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడంతో ఈ వివాదం మొదలైంది.

ఎంపీ ల్యాడ్స్ నిధుల్ని ప్రజావసరాలకు వినియోగించాలని.. కానీ ఎమ్మెల్యే ఇంటికి వెళ్లే ప్రైవేటు రోడ్డు నిర్మాణానికి ఎలా కేటాయిస్తారని వెంకటపతిరాజు ఫిర్యాదులో పేర్కొన్నారు. జనసేన పార్టీ నేత ఫిర్యాదుపై స్పందించిన కేంద్రం.. రెండు వారాల్లోగా ఈ రోడ్డు వ్యవహారంపై చర్యలు తీసుకుని నివేదిక ఇవ్వాలని గత ప్రభుత్వ హయాంలోనే ఆదేశాలు జారీ చేసింది. రాపాక వరప్రసాదరావు ఇంటి ఆవరణలో రోడ్డు నిర్మించిన భూమిని పంచాయతీ పేరిట రిజిస్ట్రేషన్‌ చేయాలని ఆదేశించింది. అక్కడ అడ్డుగా నిర్మాణం చేసిన ప్రహరీ తొలగించి, బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకోవాలని స్పష్టంచేసింది. కానీ ఈ ఆదేశాలు అమలు చేయలేదు.. తాజాగా కేంద్రం ఇచ్చిన ఆదేశాల మేరకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారుల్ని ఆదేశించారు.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments