HomeAndhra Pradeshఏపీ బీసీ గురుకులాల్లో ఉద్యోగుల బదిలీలు.. 50 ఏళ్లలోపు మగ ఉద్యోగులు బాలికల విద్యాసంస్థల్లో ఉండొద్దు!

ఏపీ బీసీ గురుకులాల్లో ఉద్యోగుల బదిలీలు.. 50 ఏళ్లలోపు మగ ఉద్యోగులు బాలికల విద్యాసంస్థల్లో ఉండొద్దు!

AP Bc Gurukulam Staff Transfers Guidelines: ఏపీలో మహాత్మా జ్యోతిబాపూలే బీసీ గురుకులాల్లో పనిచేస్తున్న బోధన, బోధనేతర సిబ్బంది బదిలీలకు ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. ఒకేచోట 8 ఏళ్లు పూర్తిచేసిన ఉద్యోగులను బదిలీ తప్పనిసరి చేసింది. అలాగే బాలికల గురుకులాల్లో పనిచేస్తున్న 50 ఏళ్లలోపు పురుష ఉద్యోగులు, ప్రిన్సిపాళ్లు, బోధనేతర సిబ్బందిని బాలుర గురుకులాలకు బదిలీ చేయాలని మార్గదర్శకాలు పేర్కొంది. రెండేళ్లలోపు రిటైర్ అయ్యేవారికి మాత్రం మినహాయింపు ఇచ్చారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహాత్మా జ్యోతిబాపూలే బీసీ గురుకులాలలో (ఎంజేపీ ఏపీ బీసీడబ్ల్యూఆర్‌ఈఐఎస్) పనిచేస్తున్న ఉద్యోగుల (బోధన, బోధనేతర) బదిలీకి మార్గదర్శకాలు జారీ చేసింది. ఎంజేపీ ఏపీ బీసీడబ్ల్యూఆర్‌ఈఐఎస్ బాలికల విద్యాసంస్థల్లో పనిచేసే 50 ఏళ్లలోపు వయసున్న ప్రిన్సిపల్ సహా పురుష ఉద్యోగులందర్ని అందరినీ బాలుర విద్యాసంస్థలకు బదిలీ చేయాలని ఆదేశించింది. రెండేళ్లుగా ఒకే విద్యాసంస్థలో పనిచేస్తున్నవారి బదిలీకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఒకే విద్యా సంస్థలో 8 ఏళ్లు సర్వీస్ పూర్తి చేసుకున్నవారికి తప్పనిసరిగా బదిలీ వర్తిస్తుంది. ప్రస్తుతం బోర్డు ఆమోదం, ప్రభుత్వ మంజూరు లేని పోస్టుల్లో విధుల్లో ఉన్నవారు తప్పనిసరి బదిలీ కేటగిరి కిందకు వస్తారు.

ఏపీ ప్రభుత్వం దృష్టిలోపం ఉన్నవారికి, రెండేళ్లలోపు పదవీ విరమణ చేసే ఉద్యోగులను తప్పనిసరి బదిలీల నుంచి మినహాయించింది. ఒకవేళ వీరు స్వచ్ఛందంగా బదిలీ కోరితే మాత్రం అనుమతి ఉంటుంది. అంతేకాదు వైకల్యం, తీవ్ర అనారోగ్యం, వితంతువు ఉద్యోగులు, భార్యాభర్తల కేసులకు బదిలీల్లో కొంత వెసులుబాటు కల్పించారు. అలాగే బదిలీపై తుది నిర్ణయం తీసుకునే అధికారం సొసైటీ కార్యదర్శికి ఉంటుంది. ఈ మార్గదర్శకాల ప్రకారం ప్రభుత్వం బదిలీలపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేసిన తర్వాత తదుపరి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది.

ప్రస్తుతం ఉద్యోగుల బదిలీ కారణంగా కొన్ని ఖాళీలు ఏర్పడతాయి.. వాటిని వెంటనే భర్తీ చేయాల్సిన అవసరం లేదని ప్రభుత్వం తెలిపింది. అంతేకాదు ఈ బదిలీల ప్రక్రియ ఆన్‌లైన్‌ ద్వారానే చేపట్టాలని.. సాధారణ బదిలీల సందర్భంగా వర్తించే ఇతర నిబంధనలూ పాటించాలని ఆదేశించింది. అన్ని గురుకులాల్లో రెగ్యులర్ ఉద్యోగుల నిష్పత్తి సమానంగా ఉండేలా ఖాళీలను ప్రకటించనున్నారు. మారుమూలలో ఉండే విద్యా సంస్థల్లోనూ రెగ్యులర్‌ ఉపాధ్యాయులు తగిన సంఖ్యలో ఉండేలా చూస్తారు. మొత్తం మీద ఏపీ ప్రభుత్వం బీసీ గురుకులాల పరిధిలో పనిచేస్తున్న బోధన, బోధనేతర సిబ్బంది బదిలీలకు మార్గదర్శకాలపై స్పష్టత ఇచ్చింది. మరోవైపు సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాలు, కళాశాలల్లో పనిచేస్తున్న పార్ట్‌టైమ్ ఉపాధ్యాయులు, లెక్చరర్లు, ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని ముఖ్యమంత్రిని సీపీఎం కోరింది. మొత్తం 1673మంది ఉన్నారని.. వారికి సరైన వేతనాలు అందడం లేదని.. మరికొన్ని సమస్యలు ఉన్నాయన్నారు. వెంటనే వారి సమస్యలు పరిష్కరించాలని కోరారు.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments