Home Blog Page 27

వరల్డ్ కప్ సక్సెస్.. ఆసియాడ్ గోల్డ్స్.. కెప్టెన్‌గా హర్మన్ రికార్డులు ఇవే..!

0
భారత మహిళల క్రికెట్ దిగ్గజం, 37 ఏళ్ల హర్మన్‌ప్రీత్ కౌర్ అన్ని ఫార్మాట్ల కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. టీమిండియాను మొత్తం 211 మ్యాచుల్లో ముందుండి నడిపించిన ఆమె, 2025 వన్డే వరల్డ్ కప్ ట్రోఫీ, ఆసియా క్రీడల గోల్డ్ మెడల్స్‌తో పాటు అనేక ఆసియా కప్ టైటిళ్లను అందించింది. మహిళల టీ20ల్లో అత్యధిక మ్యాచులకు (155) కెప్టెన్‌గా వ్యవహరించిన అరుదైన రికార్డును హర్మన్‌ప్రీత్ కౌర్ సాధించింది.

సీఎం విజయ్ రూ.600 కోట్ల ఆస్తులు ప్రకటించి.. రూ.30 కోట్లు మర్చిపోతే ‘అవినీతి’ అవుతుందా? మద్రాస్ హైకోర్టు

0
గత ఏప్రిల్‌లో జరిగిన తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో టీవీకే అధ్యక్షుడు, నటుడు జోసెఫ్ విజయ్ పెరంబూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఈ సమయంలో ఆయన తన ఆస్తుల వివరాలను అఫిడ్‌విట్‌లో తప్పుగా పొందుపరిచారని, ఆయన ఎన్నిక రద్దుచేయాలని కోరుతూ ఎన్నికల పిటిషన్ దాఖలైంది. తన ఆస్తులు కేవలం రూ.600 కోట్లే అని ప్రకటించారు కానీ, మరో రూ.30 కోట్ల ఆస్తుల వివరాలను దాచిపెట్టారని ఆరోపించాడు. దీనిపై మద్రాసు హైకోర్టు విచారణ చేపట్టింది.

త్వరలోనే ‘పశ్చిమ్ బంగ’గా మారనున్న వెస్ట్ బెంగాల్.. బెంగాలీల డిమాండ్ వెనుక బలమైన కారణాలు ఇవే

0
పశ్చిమ బెంగాల్ రాష్ట్ర పేరు మార్పు అంశం మళ్లీ వార్తల్లో నిలిచింది. ఈ డిమాండ్‌కు దాదాపు మూడు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉంది. బెంగాల్‌లో కమ్యూనిస్టులు అధికారంలో ఉన్నప్పుడు 1999లో మొదటిసారి ఈ ప్రతిపాదన తీసుకొచ్చారు. అప్పటి సీఎం జ్యోతిబసు అసెంబ్లీలో తీర్మానం చేసినా.. కేంద్రం ఆమోదించలేదు. తర్వాత మమతా బెనర్జీ సైతం ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. ఇప్పుడేమో బీజేపీ వంతు వచ్చింది. అయితే, పశ్చిమ బెంగాల్ పేరును ఎందుకు మార్చాలని కోరుతున్నారు? దానికి కారణాలు ఏంటి? అనేది చర్చనీయాంశంగా మారాయి.

దోశలో చచ్చిపోయిన ఎలుక.. రూ.25 లక్షలు ఇవ్వాలంటూ రెస్టారెంట్ యజమానికి కస్టమర్ షాక్.. కానీ చివరకు?

0
ముంబైలోని రాధాకృష్ణ హోటల్‌లో మైసూర్ మసాలా దోశలో ఎలుక వచ్చిందంటూ ఫిర్యాదు చేసిన మహిళే.. ఆపై యజమానిని రూ. 25 లక్షలు ఇవ్వాలంటూ బెదిరింపులకు పాల్పడిన ఘటన సంచలనం సృష్టించింది. సోషల్ మీడియాలో వీడియో వైరల్ చేసి హోటల్ లైసెన్స్ రద్దు కాగా.. కేసు ముగించేందుకు రూ. 6 లక్షల ఒప్పందం చేసుకుని, రూ. 6 లక్షల లంచం తీసుకుంటుండగా ప్రధాన నిందితురాలు మాన్సి ఆచార్యను పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

“కళ్లు మూయొద్దు.. అస్సలే నిద్రపోవద్దు!”: దాడి నాడు పైలట్ స్మిత్ మచ్చర్ పరిస్థితి గుర్తు చేసుకున్న డెంటిస్ట్

0
170 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానాన్ని కూల్చివేసేందుకు ఒమన్ కోపైలట్ జరిపిన దాడిలో తీవ్రంగా గాయపడిన భారతీయ కెప్టెన్ స్మిత్ మచ్చర్‌ను ఇజ్రాయెల్ డెంటిస్ట్ డాక్టర్ షుతా ముసాయెవ ప్రథమ చికిత్సతో కాపాడారు. 45 నిమిషాల పాటు నొప్పితో స్పృహ కోల్పోతున్న కెప్టెన్‌కు ఐస్ ప్యాక్‌లతో చికిత్స అందిస్తూ.. నిద్రపోవద్దు, అని ధైర్యం చెప్తూ పల్స్ పడిపోకుండా చూసి విమానం సౌదీలో అత్యవసర ల్యాండింగ్ అయ్యేలా కీలక పాత్ర పోషించారు. అయితే తాజాగా నాటి సంగతులను గుర్తు చేసుకున్నారీ డెంటిస్ట్.

నిరుద్యోగులకు రైల్వే తీపి కబురు.. 3,477 NTPC గ్రాడ్యుయేట్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల!

0
భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖ పరిధిలోని రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డులు (RRB) గ్రాడ్యుయేట్ స్థాయి నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీల (NTPC) కింద 3,477 ఉద్యోగాల భర్తీకి ప్రకటనను విడుదల చేశాయి. అక్టోబర్ 8వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ఆన్‌లైన్ దరఖాస్తులకు ఆధార్ ధృవీకరణను తప్పనిసరి చేస్తూ.. దరఖాస్తుదారులు ఆధార్ వివరాలను పదో తరగతి సర్టిఫికెట్‌తో సరిపోలేలా అప్‌డేట్ చేసుకోవాలని రైల్వే బోర్డు సూచించింది. ఆ పూర్తి వివరాలు మీకోసం.

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. విద్య, వైద్య రంగాలకు పెద్ద పీట.. 12 అంశాలకు ఆమోదం

సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్‌ సమావేశంలో 12 కీలక అజెండా అంశాలకు ఆమోదం లభించింది. రేపల్లెలోని 30 పడకల కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌ను రూ.58.42 కోట్లతో 100 పడకల ఆసుపత్రిగా అప్‌గ్రేడ్‌ చేయడంతో పాటు 66 పోస్టులను మంజూరు చేయాలని నిర్ణయించారు. 2026-27 ‘తల్లికి వందనం’ పథకానికి రాటిఫికేషన్‌ ఇచ్చారు. విశాఖ మరికవలసలో గిరిజన విద్యార్థులకు ఐఐటీ జేఈఈ, నీట్ కోచింగ్‌ అందించేందుకు సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌కు ఆమోదం తెలిపారు. విదేశీ ఉన్నత విద్యాసంస్థలు, ప్రైవేట్‌ యూనివర్సిటీ క్యాంపస్‌ల ఏర్పాటుకు నూతన పాలసీ-2026కు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. భూముల బదలాయింపులు, ఆశా కార్యకర్తల గ్రాట్యుటీ వంటి ప్రతిపాదనలకు కూడా ఆమోదం లభించింది.

వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు దంపతులకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ.. బెయిల్ పిటిషన్ తిరస్కరణ

డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం హత్య కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు సుప్రీంకోర్టులో ఊరట లభించలేదు. ఆయన దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌ను న్యాయస్థానం తిరస్కరించింది. ముందుగా హైకోర్టును ఆశ్రయించాలని సూచించింది. కేసు విచారణ తుది దశలో ఉండటం, మొత్తం 87 మంది సాక్షుల్లో చాలామంది విచారణ పూర్తవడం వంటి అంశాలను కోర్టు పరిగణనలోకి తీసుకుంది. ఇదే కేసులో అనంతబాబు భార్య లక్ష్మీదుర్గ కోరిన ట్రయల్‌ గడువు పొడిగింపు అభ్యర్థనపైనా కోర్టు స్పందించింది. రోజువారీ విచారణ కొనసాగుతున్నందున ట్రయల్‌ను వేగంగా పూర్తి చేయాలని సూచించింది.

తమిళనాడు సీఎం విజయ్‌ను కలిసిన వైఎస్ షర్మిల.. కుమార్తె అంజలిరెడ్డి వివాహానికి ఆహ్వానం

Ys Sharmila Meet Tamil Nadu Cm Vijay In Chennai: తమిళనాడు సీఎం విజయ్‌ను వైఎస్ షర్మిల కలిశారు. తన కుమార్తె అంజలి రెడ్డి, సోమల రఘురామ్ రెడ్డిల వివాహానికి హాజరు కావాలని కోరారు. ఆమె భర్త అనిల్ కుమార్‌తో కలిసి విజయ్‌కు ఆహ్వాన పత్రిక అందజేశారు. షర్మిల కుమార్తె ఎంగేజ్‌మెంట్ సెప్టెంబర్ 24న జరగ్గా.. వివాహం నవంబర్ 25న జరగనుంది. ఇటు తమిళనాడు సీఎం విజయ్‌ను టీడీపీ ఎంపీలు కలిశారు.. విజయవాడ ఉత్సవ్‌కు ఆహ్వానించారు.

Ysrcp దూకుడు.. స్థానిక సంస్థల ఎన్నికలకు తొలి అభ్యర్థి ప్రకటన.. నెల్లూరు మేయర్ అభ్యర్థిగా ఆనం

Nellore Ysrcp Mayor Candidate Anam Vijaykumar Reddy: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై వైఎస్సార్‌సీపీ దూకుడు పెంచింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో తొలి అభ్యర్థిని ప్రకటించింది. నెల్లూరు వైఎస్సార్‌‌‌సీపీ మేయర్ అభ్యర్థిగా ఆనం విజయ్‌కుమార్‌రెడ్డిని వైఎస్ జగన్ ప్రకటించారు. రిజర్వేషన్లు ఖరారు కాకముందే జగన్ ఆనంను అభ్యర్థిగా ప్రకటించడం ఆసక్తికరంగా మారింది.