Home Blog Page 26

HDFC Bank Lending Rates: ఆర్బీఐ షాక్ ఇచ్చినా శుభవార్త చెప్పిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్.. లోన్ వడ్డీ రేట్లు తగ్గింపు.. తక్షణమే అమలు

0
RBI Repo Rate Hike: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేట్లను పెంచుతూ అక్టోబర్ 7న షాక్ ఇవ్వగా, సాధారణంగా బ్యాంకులు హోం లోన్, ఇతర వెహికిల్ లోన్ వడ్డీ రేట్లను పెంచాల్సి ఉంటుంది. కానీ అందుకు భిన్నంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఎంసీఎల్ఆర్ రేట్లను తగ్గించింది. అన్ని టెన్యూర్లపై ఎంసీఎల్ఆర్ రేట్లను గరిష్ఠంగా 15 బేసిస్ పాయింట్ల వరకు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఇది అక్టోబర్ 7 నుంచే అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది.

ఇరాన్‌ యుద్ధంలో భారీ నష్టం.. రూ.30 వేల కోట్ల విలువైన సైనిక విమానాలు, డ్రోన్లు కోల్పోయిన అమెరికా

పశ్చిమాసియాలో ఇరాన్‌తో చేస్తోన్న యుద్ధంలో అమెరికా భారీగా నష్టపోయింది. ముఖ్యంగా సైనిక సామాగ్రి, యుద్ధ విమానాలు, ఆయుధ వ్యవస్థలను పెద్ద సంఖ్యలో కోల్పోయింది. తాజాగా, అమెరికా కోల్పోయిన యుద్ధ విమానాలు ఎన్ని? కూలిపోయిన డ్రోన్లు ఎన్ని? అనేది యూఎస్ కాంగ్రెషనల్ రిసెర్చ్ ఓ నివేదికను వెలువరించింది. దీని ప్రకారం అమెరికా 81 యుద్ధ విమానాలు, 45 ఎంక్యూ రీపర్ డ్రోన్లు సహా దాదాపు 3.3 బిలియన్ డాలర్లు నష్టం వాటిల్లినట్టు పేర్కొంది.

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగింపునకు భారత్ 3 సూత్రాల శాంతి ప్రణాళిక.. అందులో అసలేముందంటే?

ఐదవ సంవత్సరంలోకి అడుగు పెట్టిన రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించేందుకు భారత్ మూడు అంశాలతో కూడిన సమగ్ర శాంతి ప్రణాళికను ప్రతిపాదించింది. ఇంధన మౌలిక సదుపాయాలపై దాడులు నిలిపి వేయడం, నల్లసముద్రం ద్వారా ధాన్యం మరియు ఇంధన రవాణాను పునరుద్ధరించడం ప్రధాన లక్ష్యంగా ఈ ఫార్ములాను విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కీవ్ పర్యటనలో అందించగా.. ఇది ఎంతో సమగ్రమైన ప్రతిపాదన అని ఉక్రెయిన్ అభివర్ణించింది. ఆ పూర్తి వివరాలు మీకోసం.

Telangana News, October 7 Live: అబ్బాయిల్నీ వదలడం లేదు.. 9 నెలల్లోనే 62 పోక్సో కేసులు

0
Telangana Breaking News Today: తెలంగాణకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్, రెగ్యులర్ అప్డేట్స్‌ను ఎప్పటికప్పుడు అందించడం కోసం ఈ లైవ్ బ్లాగ్‌ను ప్రారంభించాం. ఈ లైవ్ బ్లాగ్‌ను అనుసరించడం ద్వారా హైదరాబాద్ నగరంతోపాటు తెలంగాణ జిల్లాలకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు చూడొచ్చు.

మంచిరేవులలో మూసీ ఒడ్డున ఓంకారేశ్వర ఆలయం.. రూ.1,108 కోట్లకు సర్కార్ గ్రీన్ సిగ్నల్

0
మూసీ నది ఒడ్డున ప్రతిపాదించిన ఓంకారేశ్వర స్వామి ఆలయ సముదాయ అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం భారీగా నిధులు మంజూరు చేసింది. ఆలయ సముదాయ నిర్మాణం, అభివృద్ధి పనులకు రూ.948.65 కోట్లు, 6 లేన్ల రహదారి నిర్మాణానికి రూ.159.62 కోట్లు కేటాయించింది. మొత్తంగా రూ.1,108.27 కోట్లకు పరిపాలనా అనుమతులు జారీ చేసింది. ఇస్తానా విల్లాస్‌ నుంచి కీర్తి వెస్ట్‌విండ్‌ విల్లాస్‌ వరకు 2.5 కిలోమీటర్ల మేర 100 అడుగుల వెడల్పుతో రహదారి నిర్మించనున్నారు. ప్రాజెక్టు పర్యవేక్షణ కోసం ఆర్‌అండ్‌బీ, పబ్లిక్‌ హెల్త్‌ ఇంజినీరింగ్‌ శాఖల ఉన్నతాధికారులతో సాంకేతిక కమిటీని ఏర్పాటు చేశారు.

తెలంగాణ ఉద్యోగులకు దసరా కానుక.. రెండు డీఏలు మంజూరు, అక్టోబర్ జీతంతో కలిపి చెల్లింపు

0
దసరా పండుగ వేళ తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2024 జనవరి, జూలై నుంచి పెండింగ్‌లో ఉన్న రెండు డీఏలను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రెండు డీఏలు కలిపి 6.27 శాతం మేర పెరుగుదల ఉండనుంది. పెంచిన డీఏను 2026 అక్టోబర్ నెల జీతంతో కలిపి నవంబర్ 1న చెల్లించనున్నారు. గత కాలానికి సంబంధించిన బకాయిలను కూడా వాయిదాల పద్ధతిలో చెల్లించనున్నారు. డీఏ బకాయిలను ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల్లో జమ చేయనున్నారు. యూజీసీ, ఏఐసీటీఈ ఉద్యోగులకు కూడా ఈ డీఏ పెంపు వర్తిస్తుంది.

హైదరాబాద్‌లో ఇక భూగర్భ విద్యుత్.. 6 వేల కి.మీ.కుపైగా అండర్‌గ్రౌండ్ కేబులింగ్, తీగల గందరగోళానికి చెక్

0
హైదరాబాద్‌లో విద్యుత్ మౌలిక వసతులను మరింత ఆధునికంగా, సురక్షితంగా మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రాజెక్ట్ చేపట్టింది. TGSPDCL ఆధ్వర్యంలో హైదరాబాద్ భూగర్భ విద్యుత్ కేబులింగ్ ప్రాజెక్ట్ ఫేజ్-1 అమలు కానుంది. ఇందులో సుమారు 311 కిలోమీటర్ల 33 కేవీ, 5,772 కిలోమీటర్ల 11 కేవీ విద్యుత్ లైన్లను భూగర్భంలోకి మార్చనున్నారు. చెట్లు, గాలులు, వర్షాల కారణంగా విద్యుత్ అంతరాయాలు తగ్గడంతోపాటు వీధుల్లో భద్రత, నగర సౌందర్యం, స్మార్ట్ గ్రిడ్ సామర్థ్యం మెరుగుపడే అవకాశం ఉందని TGSPDCL అధికారులు ట్విట్టర్ ఎక్స్ ద్వారా వెల్లడించారు.

ఇంటికి తాళం వేసి దసరాకు ఊరెళ్తున్నారా..? సోషల్ మీడియాలో పోస్టులు వద్దు, ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!

0
దసరా, బతుకమ్మ పండుగల నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో పండగ సందడి మొదలైంది. నగరాల్లో ఉద్యోగాలు, వ్యాపారాల కోసం స్థిరపడిన కుటుంబాలు సొంతూళ్లకు తరలివెళ్తుండటంతో ఇళ్లు ఖాళీగా మారుతున్నాయి. ఇదే అదనుగా దొంగలు చోరీలకు పాల్పడే అవకాశం ఉండటంతో పోలీసులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఇంటికి తాళం వేసి వెళ్లే ముందు పోలీసులకు సమాచారం ఇవ్వడం, విలువైన వస్తువులను ఇంట్లో ఉంచకపోవడం, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

ఊహించిందే జరిగింది.. టీమిండియాకు కొత్త కెప్టెన్‌ ప్రకటన..!

0
భారత మహిళల క్రికెట్ జట్టు నూతన కెప్టెన్‌గా స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన ఎంపికైంది. హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్సీ నుంచి తప్పుకున్న కొద్ది గంటల్లోనే బీసీసీఐ ఈ నిర్ణయం ప్రకటించింది. జింబాబ్వేతో జరిగే మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్‌ నుంచి మంధాన కెప్టెన్సీ ప్రారంభం కానుంది. టీ20లకు షఫాలీ వర్మ, వన్డేలకు దీప్తి శర్మ వైస్ కెప్టెన్లుగా ఎంపికవగా, యువ బ్యాటర్ నికీ ప్రసాద్ తొలిసారి టీమిండియా టీ20 జట్టులోకి పిలుపు అందుకుంది.

ఐపీఎల్ మ్యాజిక్.. 4 ఏళ్ల తర్వాత టీమిండియాలోకి భువీ రీఎంట్రీ..!

0
న్యూజిలాండ్‌తో అక్టోబర్ 22 నుంచి ప్రారంభమయ్యే 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు బీసీసీఐ 16 మంది సభ్యులతో కూడిన టీమిండియాను ప్రకటించింది. సీనియర్ ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ దాదాపు నాలుగేళ్ల విరామం తర్వాత జట్టులోకి రీ-ఎంట్రీ ఇచ్చాడు. ఐపీఎల్ 2026లో ఆర్సీబీ తరఫున 28 వికెట్లతో అద్భుత ప్రదర్శన చేయడంతో అతనికి చోటు దక్కింది. అలాగే గాయం నుంచి కోలుకున్న వరుణ్ చక్రవర్తికి కూడా సెలెక్టర్లు మళ్లీ అవకాశం కల్పించారు.