హైదరాబాద్‌లో విద్యుత్ మౌలిక వసతులను మరింత ఆధునికంగా, సురక్షితంగా మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రాజెక్ట్ చేపట్టింది. TGSPDCL ఆధ్వర్యంలో హైదరాబాద్ భూగర్భ విద్యుత్ కేబులింగ్ ప్రాజెక్ట్ ఫేజ్-1 అమలు కానుంది. ఇందులో సుమారు 311 కిలోమీటర్ల 33 కేవీ, 5,772 కిలోమీటర్ల 11 కేవీ విద్యుత్ లైన్లను భూగర్భంలోకి మార్చనున్నారు. చెట్లు, గాలులు, వర్షాల కారణంగా విద్యుత్ అంతరాయాలు తగ్గడంతోపాటు వీధుల్లో భద్రత, నగర సౌందర్యం, స్మార్ట్ గ్రిడ్ సామర్థ్యం మెరుగుపడే అవకాశం ఉందని TGSPDCL అధికారులు ట్విట్టర్ ఎక్స్ ద్వారా వెల్లడించారు.


