RBI Repo Rate Hike: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేట్లను పెంచుతూ అక్టోబర్ 7న షాక్ ఇవ్వగా, సాధారణంగా బ్యాంకులు హోం లోన్, ఇతర వెహికిల్ లోన్ వడ్డీ రేట్లను పెంచాల్సి ఉంటుంది. కానీ అందుకు భిన్నంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఎంసీఎల్ఆర్ రేట్లను తగ్గించింది. అన్ని టెన్యూర్లపై ఎంసీఎల్ఆర్ రేట్లను గరిష్ఠంగా 15 బేసిస్ పాయింట్ల వరకు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఇది అక్టోబర్ 7 నుంచే అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది.


