భారత మహిళల క్రికెట్ జట్టు నూతన కెప్టెన్‌గా స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన ఎంపికైంది. హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్సీ నుంచి తప్పుకున్న కొద్ది గంటల్లోనే బీసీసీఐ ఈ నిర్ణయం ప్రకటించింది. జింబాబ్వేతో జరిగే మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్ నుంచి మంధాన కెప్టెన్సీ ప్రారంభం కానుంది. టీ20లకు షఫాలీ వర్మ, వన్డేలకు దీప్తి శర్మ వైస్ కెప్టెన్లుగా ఎంపికవగా, యువ బ్యాటర్ నికీ ప్రసాద్ తొలిసారి టీమిండియా టీ20 జట్టులోకి పిలుపు అందుకుంది.


