HomeAndhra Pradeshవైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు దంపతులకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ.. బెయిల్ పిటిషన్ తిరస్కరణ

వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు దంపతులకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ.. బెయిల్ పిటిషన్ తిరస్కరణ

డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం హత్య కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు సుప్రీంకోర్టులో ఊరట లభించలేదు. ఆయన దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌ను న్యాయస్థానం తిరస్కరించింది. ముందుగా హైకోర్టును ఆశ్రయించాలని సూచించింది. కేసు విచారణ తుది దశలో ఉండటం, మొత్తం 87 మంది సాక్షుల్లో చాలామంది విచారణ పూర్తవడం వంటి అంశాలను కోర్టు పరిగణనలోకి తీసుకుంది. ఇదే కేసులో అనంతబాబు భార్య లక్ష్మీదుర్గ కోరిన ట్రయల్‌ గడువు పొడిగింపు అభ్యర్థనపైనా కోర్టు స్పందించింది. రోజువారీ విచారణ కొనసాగుతున్నందున ట్రయల్‌ను వేగంగా పూర్తి చేయాలని సూచించింది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments