దేశంలోనే తొలి గ్రీన్ఫీల్డ్ కమ్యూనిటీ కిచెన్ తెలంగాణలో రానుంది. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పౌష్టికాహారం అందించే కార్యక్రమంలో భాగంగా సూర్యాపేట జిల్లాలో గ్రీన్ఫీల్డ్ సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. సుమారు రూ.9.60 కోట్లతో నిర్మించనున్న ఈ వంటశాల ద్వారా 1,029 పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లోని దాదాపు 60 వేల మంది విద్యార్థులకు నిత్యం అల్పాహారం అందించనున్నారు. ఈ ప్రాజెక్టుకు సింగరేణి సంస్థ నిధులు సమకూర్చింది.


