Home Blog Page 109

బేబీ బంప్‌తో సమంత.. కూతురితో పూరీ జగన్నాథ్.. క్యూట్ ఫొటోతో రణబీర్‌కి ఆలియా స్పెషల్ బర్త్ డే విషెస్

0
• నిధి అగర్వాల్, దివ్యభారతి ట్రెండీ లుక్స్
• పూరీ జగన్నాథ్ కి కూతురు పవిత్ర బర్త్ డే విషెస్
• రణబీర్ కపూర్ బర్త్ డేకి ఆలియా భట్ క్యూట్ ఫోటో
• బేబీ బంప్‌తో సమంత
• లావెండర్ ఫ్లవర్స్ తో అనుపమ పరమేశ్వరన్
• యూరప్ లో రహస్య కిరణ్ అబ్బవరం
• వైజాగ్ లో మానస చౌదరి
• బ్లాక్ డ్రస్సులో దక్షా నాగర్కర్, డయానా పెంటీ
• సినీ సెలబ్రిటీల తాజా ఇన్‌స్టా పోస్టులపై ఓ లుక్కేద్దాం.

‘చచ్చిపోవడం తప్ప ఇంకో మార్గం లేదని బతిమిలాడారు’.. పూరీ జగన్నాథ్, ఛార్మీలపై ‘హనుమాన్’ నిర్మాత చైతన్య రెడ్డి సంచలన వ్యాఖ్యలు

0
రామ్ పోతినేని, పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో వచ్చిన ‘డబుల్ ఇస్మార్ట్’ థియేట్రికల్ డిస్ట్రిబ్యూషన్ వల్ల రూ.35 నుంచి రూ.40 కోట్లు నష్టపోయామని ‘హను-మాన్’ నిర్మాత (ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్) చైతన్య రెడ్డి అన్నారు. సినిమా విడుదలకు ముందు పూరీ, ఛార్మీ తమను ఎమోషనల్‌గా బ్లాక్‌మైల్ చేస్తూ చనిపోవడం తప్ప వేరే మార్గం లేదని బతిమిలాడారని, తీరా రిలీజ్ అయి ప్లాప్ అవ్వగానే ఫోన్ నంబర్లు బ్లాక్ చేసి మాట్లాడటం మానేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం ‘పోకిరి’ రీ-రిలీజ్ చేసుకుంటామంటే ఛార్మీ 70 శాతం షేర్ డిమాండ్ చేస్తూ ఇబ్బంది పెట్టారని ఆమె తెలిపారు.

షుగర్ వల్ల కంటి చూపు మందగిస్తోందా, మీ కళ్ళను రక్షించుకోవడానికి తినాల్సిన సూపర్ ఫుడ్స్ ఏంటో తెలుసా?

0
ఒక నేత్ర వైద్యుడిగా, మధుమేహాన్ని (Diabetes) అదుపులో ఉంచుకోవడమే కంటి చూపును కాపాడుకోవడానికి అత్యంత కీలకమని నేను నా రోగులకు తరచూ చెబుతుంటానని డాక్టర్ దీపక్ బి (కంటి వైద్య నిపుణులు, డాక్టర్ అగర్వాల్స్ ఐ హాస్పిటల్) తెలిపారు. రక్తంలో షుగర్ లెవల్స్ దీర్ఘకాలం ఎక్కువగా ఉండటం వల్ల రెటీనాలోని అత్యంత సున్నితమైన సూక్ష్మ రక్తనాళాలు దెబ్బతింటాయి. దీనినే వైద్య పరిభాషలో ‘డయాబెటిక్ రెటినోపతి’ (Diabetic Retinopathy) అంటారు. అయితే, సరైన పోషకాహారాన్ని తీసుకోవడం ద్వారా ఈ రక్తనాళాలను బలోపేతం చేసుకోవచ్చు. చూపు కోల్పోకుండా కంటిని కాపాడుకోవచ్చు. డాక్టర్ దీపక్ బి ప్రకారం ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన పోషకాలు నిండిన ఆహారాలేంటో తెలుసుకుందాం.

పాములు ఇళ్లలోకి రాకుండా ఆపే అద్భుతమైన మొక్కలు!

0
ఇంటి పరిసరాల్లోకి విష సర్పాలు రాకుండా చూసుకోవడం మన కుటుంబ భద్రతకు అత్యంత ముఖ్యం. రసాయనాలు, క్రిమిసంహారకాలతో పనిలేకుండా, ప్రకృతి సిద్ధంగా పాములను నిరోధించేందుకు కొన్ని మొక్కలు అద్భుతంగా తోడ్పడుతాయి. ఈ మొక్కలు వెదజల్లే తీవ్రమైన సువాసనలు లేదా ఘాటైన వాసనలను పాములు అసలు భరించలేదు. సర్పాల సున్నితమైన జ్ఞానేంద్రియ వ్యవస్థపై ఈ వాసనలు ప్రభావం చూపి వాటిని భయపట్టి దూరంగా తరిమివేస్తాయి. అంతే కాకుండా వీటిని భయటపట్టి దూరంగా తరిమివేస్తాయి.

అంతేకాకుండా వీటిలోని పదుఐన ఆకులు, ముళ్లు పాములకు శారీరక ఇబ్బందిని కలిగించి ముందుకు రానివ్వవు. మన ఇంటి ఆవరణకు ఎంతో అందాన్ని ఇస్తూనే ఇవి సహజ రక్షణ గోడలాగా రక్షణ కల్పిస్తాయి. ఇలాంటి మొక్కలకు పెంచుకోవడం వల్ల పాముల భయం తగ్గడమే కాకుండా ఇల్లు ఎంతో ఆహ్లాదకరంగా మారుతుంది. ఈ నేపథ్యంలో పాములను సమర్థవంతంగా అడ్డుకునే విశేషమైన మొక్కల వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ఎయిరిండియా-అదానీ కాంబోలో డ్యూటీ ఫ్రీ షాపింగ్ ప్లాట్ ఫాం.. విమానంలో బుకింగ్, ఎయిర్‌పోర్టులో దిగగానే చేతికి వస్తువులు!

0
Air India Adani Platform: టాటా గ్రూప్‌లోని దిగ్గజ విమాన సంస్థ ఎయిరిండియాతో అదానీ గ్రూప్‌లోని అదానీ ఎయిర్‌పోర్ట్స్ జట్టు కట్టింది. ఈ రెండు దిగ్గజ సంస్థల భాగస్వామ్యంతో సరికొత్త ఆన్‌లైన్ డ్యూటీ ఫ్రీ షాపింగ్ ప్లాట్ ఫామ్ తీసుకొచ్చాయి. అంతర్జాతీయ విమాన ప్రయాణికులు ప్రయాణానికి ముందే షాపింగ్ చేసి ఎయిర్‌పోర్టులో దిగిన తర్వాత తమ వస్తువులను తీసుకోవచ్చు. మరి ఈ కొత్త ప్లాట్ ఫామ్ గురించిన వివరాలు తెలుసుకుందాం.

ట్యాక్స్ పేయర్లకు గుడ్‌న్యూస్.. ట్యాక్స్ ఆడిట్, ITR ఫైలింగ్ గడువు పొడిగింపు.. కొత్త తేదీలు ఇవే

0
ITR Deadline Extension: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అదిరే శుభవార్త. ట్యాక్స్ ఆడిట్‌ గడువుతో పాటు ఐటీఆర్ ఫైలింగ్ గడువును సైతం పొడిగిస్తూ కేంద్ర ప్రత్యక్ష పన్ను బోర్డు నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 30తో ట్యాక్స్ ఆడిట్ గడువు ముగుస్తున్న క్రమంలో మరో 21 రోజుల పాటు సమయం కల్పించారు. అలాగే ఐటీఆర్ గడువు మరో నెల రోజులకు పొడగించారు. మరి కొత్త తేదీలు, గడువు పెంపు వంటి వివరాలు తెలుసుకుందాం.

రూ.10,000 నుంచి 35000 జీతం ఉన్నవారికి.. EPF vs EPS vs EDLIకి నెలకు ఎంత కట్ అవుతుంది? కొత్త లిస్ట్ విడుదల చేసిన కేంద్రం

0
EPF Vs EPS Vs EDLI: కేంద్ర ప్రభుత్వం ఇటీవలే ఈపీఎఫ్ వేతన పరిమితిని రూ.25000లకు పెంచింది. దీంతో చాలా రకాల అంశాల్లో మార్పులు రానున్నాయి. నెలవారీ పీఎఫ్ ఖాతాకు ఎక్కువ మొత్తంలో కట్ కానుంది. అలాగే ఈపీఎఫ్‌తో పాటు ఈపీఎస్ పెన్షన్ స్కీమ్, ఈడీఎల్ఐ వంటి వాటికి రూ.10 వేల నుంచి రూ.35 వేల జీతం ఉన్న వారికి దేనికి ఎంత కట్ అవుతుంది? అనే జాబితాను కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసింది. మరి ఆ లిస్ట్ ఓసారి పరిశీలిద్దాం.

నేపాల్‌లో భయానక దృశ్యం.. క్షణాల్లోనే నదిలో కూలిపోయిన పర్వతంలోని కొంత భాగం.. జనం ఆర్తనాదాలు

గత నెలలో సంభవించిన ఆకస్మిక వరదలతో నేపాల్‌ అతలాకుతలమైంది. మంచు చరియలు విరిగిపడి భోటెకోషి నదికి వరద పోటెత్తింది. దీంతో అనేక ప్రాంతాలు, భవనాలు, వంతెనలు ప్రవాహంలో కొట్టుకుపోయాయి. ఇప్పటి వరకూ 1,400 మంది ప్రాణాలు కోల్పోయాయి. మరో 6 వేల మందికిపైగా ఆచూకీ గల్లంతయ్యింది. అయితే, నేపాల్‌ను వరదలు ఇంకా వదలడం లేదు. తాజాగా, మరో రెండు చోట్ల కొండచరియలు విరిగిపడి నదిలో కూలిపోయాయి. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సీఎంగా తొలిసారి సిరిసిల్లకు రేవంత్ రెడ్డి.. భారీ బహిరంగ సభ, రూ.345.78 కోట్ల పనులకు శ్రీకారం

0
ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి రేవంత్‌రెడ్డి సిరిసిల్లలో పర్యటించనున్నారు. భారీ బహిరంగ సభతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. వేములవాడలో యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ స్కూల్‌, రాజన్న ఆలయ అభివృద్ధి, కొత్త ప్రభుత్వ కార్యాలయాలు, నేతన్న బజార్‌ వంటి కార్యక్రమాలు ఈ పర్యటనలో ఉన్నాయి. అయితే ప్రభుత్వ పరంగానే కాకుండా రాజకీయ పరంగానూ ఈ టూర్ ప్రాధాన్యం సంతరించుకుంది. కేటీఆర్ ఇలాఖాలో రేవంత్ రెడ్డి సభ పెట్టడం తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇక సీఎం పర్యటనకు ముందు కేటీఆర్‌ బహిరంగ లేఖ రాయడంతో మరింత ఇంట్రెస్టింగ్‌గా మారింది.

రీస‌ర్వేతోనే భూస‌మ‌స్యలకు చెక్.. తొలి దశలో జిల్లాకు 70 గ్రామాలు, భూభారతి లక్ష్యం ఇదే..!

0
తెలంగాణ భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు సమగ్ర రీసర్వే చేపడుతున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. భూ భారతి కింద తొలి దశలో ప్రతి జిల్లాలో 70 రెవెన్యూ గ్రామాల్లో సర్వే చేయనున్నట్లు వెల్లడించారు. నక్షాలు అందుబాటులో లేని మరో 413 గ్రామాలను కూడా దశలవారీగా సర్వే చేయనున్నట్లు చెప్పారు. ప్రతి భూ పార్శిల్‌కు ప్రత్యేక గుర్తింపు, జియో కోఆర్డినేట్స్‌తో మ్యాప్‌, ఎల్‌పీఎం నంబర్‌ అందించే దిశగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. సాదాబైనామాలు, భూ హద్దుల వివాదాలు, పాత రికార్డుల లోపాలు, అబాది ఆస్తుల సమస్యలను కూడా సర్వే ద్వారా పరిష్కరించనున్నట్లు తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపైనా మంత్రి కీలక వివరాలు వెల్లడించారు.