ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు టీజీపీఎస్సీ కీలక ప్రకటన చేసింది. వివిధ శాఖల్లో ఉద్యోగాల భర్తీకి గతంలో విడుదల చేసిన నోటిఫికేషన్లకు సంబంధించిన 4 నియామక పరీక్షల షెడ్యూల్‌ను ప్రకటించింది. తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో అసిస్టెంట్ సైంటిస్ట్ పరీక్ష అక్టోబర్ 24న.. అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజినీర్ పరీక్ష అక్టోబర్ 26న జరగనుంది. రోడ్లు, భవనాల శాఖలో ఏఈఈ (సివిల్) పరీక్షలు నవంబర్ 6, 7 తేదీల్లో.. పాఠశాల విద్యాశాఖలో డీఈఓ, గెజిటెడ్ హెడ్ మాస్టర్ గ్రేడ్-I పరీక్షలు నవంబర్ 12, 13 తేదీల్లో నిర్వహించనున్నారు.
ఖైరతాబాద్ ఉపఎన్నికపై బిగ్ అప్డేట్.. దానం నాగేందర్ అనర్హతపై గెజిట్ విడుదల
ఖైరతాబాద్ అసెంబ్లీ ఉపఎన్నికపై కీలక పరిణామం చోటుచేసుకుంది. దానం నాగేందర్ అనర్హత నేపథ్యంలో ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానం ఖాళీ అయినట్లు శాసనసభ సచివాలయం గెజిట్ విడుదల చేసింది. 2024 ఏప్రిల్ 23 నుంచే ఈ స్థానం ఖాళీగా ఉన్నట్లు పేర్కొంది. ఈనెల 18న దానం నాగేందర్‌ను అనర్హుడిగా హైకోర్టు ప్రకటించగా.. ఈనెల 24న సుప్రీంకోర్టు కూడా ఆ తీర్పులో జోక్యం చేసుకోలేదు. దీంతో ఇప్పుడు ఖైరతాబాద్ ఉపఎన్నిక షెడ్యూల్‌పై ఎన్నికల సంఘం తదుపరి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
రాశిఫలాలు 29 సెప్టెంబర్ 2026: హర్ష యోగం ప్రభావంతో మేషం సహా ఈ 5 రాశులకు స్వర్ణయుగం ప్రారంభం!
రాశిఫలాలు 29 సెప్టెంబర్ 2026: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం మంగళవారం రోజున చంద్రుడు వృషభ రాశిలో సంచారం చేయనున్నాడు. ఇదే సమయంలో ద్వాదశ రాశులపై అశ్విని నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో పాటు హర్ష, వజ్ర యోగాలు ఏర్పడనున్నాయి. అంతేకాదు ఇది హనుమంతుడికి అంకితం ఇవ్వబడిన రోజు. మీ జాతకంలో కుజుడి స్థానం బలపడే అవకాశం ఉంది. ఈ శుభ సమయంలో మేషం సహా కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు రానున్నాయి. మరికొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు రానున్నాయి. ఈ సందర్భంగా మేషం నుంచి మీన రాశుల వారికి ఏ మేరకు శుభ ఫలితాలు రానున్నాయి, ఎవరికి అశుభ ఫలితాలు రానున్నాయనే ఆసక్తికరమైన విషయాలను ప్రముఖ పండితులు ‘‘ఆచార్య క్రిష్ణ దత్త శర్మ’’ మాటల్లో తెలుసుకుందాం.
భారత్ సహా 37 దేశాల కంటే ఎక్కువ గోల్డ్ మెడల్స్ సాధించిన యంగ్ స్విమ్మర్..!
ఏషియన్ గేమ్స్ 2026లో చైనాకు చెందిన 19 ఏళ్ల స్విమ్మర్ ఝాంగ్ ఝాన్షూవో ఆల్ టైమ్ హిస్టరీ క్రియేట్ చేశాడు. ఒకే ఏషియన్ గేమ్స్ ఎడిషన్‌లో 7 స్వర్ణ పతకాలు గెలుచుకున్న తొలి స్విమ్మర్‌గా చరిత్రకెక్కాడు. భారత్ సాధించిన మొత్తం 4 గోల్డ్ మెడల్స్ కంటే కూడా ఈ ఒక్క అథ్లెటే ఎక్కువ స్వర్ణాలు నెగ్గడం విశేషం. ఆసియా క్రీడల్లో ఏకంగా 37 దేశాల కంటే ఎక్కువ పసిడి పతకాలను ఈ చైనా వండర్ కిడ్ ఒక్కడే గెలుచుకోవడం గమనార్హం.
నీరజ్ చోప్రా లేకపోయినా తగ్గలేదు.. ఏషియన్ గేమ్స్ జావెలెన్ త్రోలో భారత్‌కు 2 పతకాలు!
ఏషియన్ గేమ్స్ పురుషుల జావెలెన్ త్రోలో నీరజ్ చోప్రా లేకపోయినా భారత అథ్లెట్లు సత్తా చాటారు. యష్వీర్ సింగ్ (85.72 మీటర్లు) రజత పతకం సాధించగా, రోహిత్ యాదవ్ (84.35 మీటర్లు) కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు. శ్రీలంకకు చెందిన రుమేష్ రత్నాయకే (88.55 మీటర్లు) స్వర్ణం కైవసం చేసుకున్నాడు. పారిస్ ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్ పాకిస్తాన్‌కు చెందిన అర్షద్ నదీమ్ (80.29 మీటర్లు) నాలుగో స్థానానికే పరిమితమై ఖాళీ చేతులతో వెనుదిరిగాడు.
మళ్లీ గాయపడ్డ హార్దిక్ పాండ్యా.. రీఎంట్రీ ఎప్పుడో!
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా రీఎంట్రీకి మళ్లీ బ్రేక్ పడింది. అతడి కుడి కాలి షిన్ బోన్‌కు (టిబియాల్ బోన్) తీవ్రమైన ఒత్తిడికి సంబంధించిన గాయమైంది. బోన్ ఫ్రాక్చర్ ఏమీ కాకపోయినా, కోలుకోవడానికి 4 నుంచి 6 వారాల సమయం పట్టనుంది. దీంతో ఆస్ట్రేలియా ‘ఏ’ జట్టుతో జరిగే మ్యాచ్‌లకు హార్దిక్ దూరమయ్యాడు. ఇదే సమయంలో వచ్చే నెలలో జరగబోయే న్యూజిలాండ్ టూర్లోనూ అతడు ఆడటంపై తీవ్ర అనిశ్చితి నెలకొంది.
శీతాకాలంలో కాలుష్య నియంత్రణ కోసం ఢిల్లీ యాక్షన్ ప్లాన్.. ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్, పార్కింగ్ ఫీజులు రెట్టింపు
దేశ రాజధాని ఢిల్లీలో శీతాకాలం వస్తుందటే జనం భయపడిపోతారు. గాలిలో కాలుష్యం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకుని గ్యాస్ చాంబర్‌ను తలపిస్తుంది. నియంత్రణకు ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకున్నా.. ప్రయోజనం మాత్రం శూన్యం. అయితే, ఈ ఏడాది మూడు నెలల ముందే ఢిల్లీ ప్రభుత్వం అప్రమత్తమైంది. కాలుష్య నియంత్రణకు మార్గదర్శకాలను వెలువరించింది.
కేన్సర్ ఔషధ ధరలపై పోరాడుతూ మరణించిన మహిళ.. కోర్టు చారిత్రాత్మక తీర్పు
కేరళకు చెందిన రిటైర్డ్ బ్యాంక్ ఎంప్లాయీ సరోజం రాధాకృష్ణన్ రొమ్ము కేన్సర్ బారినపడ్డారు. వ్యాధి అడ్వాన్స్డ్ స్టేజ్‌లో ఉన్నప్పుడు నిర్దారణ కావడంతో .. శస్త్రచికిత్సకు వీలుపడలేదు. దీంతో నోవార్టిస్ కంపెనీ తయారుచేసిన రిబోసిక్లిబ్ వాడేవారు. కానీ, ఆమెకు వచ్చే పెన్షన్ కంటే.. ఔషధాల ఖర్చు రెట్టింపు అయ్యేది. ఈ నేపథ్యంలో కేరళ హైకోర్టులో పిటిషన్ వేసిన ఆమె.. పేటెంట్ మందులను స్వయంగా ప్రభుత్వం తయారుచేసేలా ఆదేశించాలని కోరారు. అయితే, పిటిషన్ విచారణ పూర్తికాకుండానే ఆమె కన్నుమూయగా.. కోర్టు దీనిని సుమోటాగా స్వీకరించారు.
25 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టిన చలి.. ఎల్ నినో ప్రభావంతో శీతాకాలం ముందే రాబోతోందా?
దేశరాజధాని ఢిల్లీలో కనిష్ఠ ఉష్ణోగ్రత 21 డిగ్రీలకు పడిపోవడంతో 2001 తర్వాత సెప్టెంబర్‌లో అత్యంత చల్లని రాత్రి నమోదు అయింది. దీనితో శీతాకాలం ముందే వచ్చిందా లేదా ఎల్ నినో ప్రభావమా అనే అనుమానాలు వ్యక్తం అవ్వగా.. బెంగాల్ ఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం వల్ల కురిసిన వర్షాలే దీనికి కారణమని, ఇది కేవలం తాత్కాలిక వాతావరణ మార్పేనని నిపుణులు స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం.

