మధ్యప్రదేశ్‌లోని ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రం కొలువుదీరిన ఉజ్జయిని నగరంలో చేపట్టిన అభివృద్ధి పనులు ఉద్రిక్తతలకు కారణమయ్యాయి. క్షిప్రా నది సింహస్థ కుంభమేళా 2028లో జరగనుంది. దీంతో పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి, పుణ్య స్నానాలు ఆచరించే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఇప్పటి నుంచే మధ్యప్రదేశ్ ప్రభుత్వం ముందస్తు ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా రహదారులను విస్తరిస్తున్నారు. అయితే, పురాతన ఓ మసీదు కాంప్లెక్స్‌లో కొంత భాగాన్ని కూల్చివేయడం వివాదాస్పదమవుతోంది.
బ్యాంక్ సమ్మె నిలిచిపోవడంతో లైన్ క్లియర్.. అక్టోబర్ 1న ఉదయం 6:30 నుంచే పెన్షన్ల పంపిణీ
ఏపీలోని వచ్చే నెల పింఛన్ల పంపిణీ యథావిదిగా జరగనుంది. బ్యాంకు ఉద్యోగుల సమ్మెకు బ్రేక్ పడడంతో అక్టోబర్ ఒకటో తేదీన ఉదయం 6:30 గంటల నుంచి లబ్ధిదారులకు పించన్లు అందనున్నాయి. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేసినట్టు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. అక్టోబర్ నెలకు గాను ప్రభుత్వం ఇప్పటికే రూ.2,692 కోట్లను రిలీజ్ చేసిందని మంత్రి వెల్లడించారు. లబ్ధిదారులకు సకాలంలో ఫింఛన్లు అందించాలని సిబ్బందిని ప్రభుత్వం ఆదేశించింది.
మచిలీపట్నం-కర్నూలు మధ్య కొత్త ఎక్స్‌ప్రెస్ రైలు.. ఈ స్టేషన్ల మీదుగా ప్రయాణం..
మచిలీపట్నం-కర్నూలు మధ్య కొత్త ఎక్స్‌ప్రెస్ రైలు రాబోతోంది. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా రైల్వే శాఖ కొత్త రైలు సర్వీసుకు రైల్వేశాఖ ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించింది. ఈ ట్రైన్ గుడివాడ, విజయవాడ, వినుకొండ, నంద్యాల స్టేషన్ల మీదుగా ప్రయాణం సాగించనుంది. వారంలో సోమ, బుధ, శనివారాల్లో మచిలీపట్నం నుంచి కర్నూలుకు, మంగళవారం, గురువారం ఆదివారాల్లో కర్నూలు సిటీ నుంచి మచిలీపట్నానికి ఈ రైలు సర్వీసులు నడపాలని నిర్ణయించారు.
తిరుమలలో పోటెత్తిన భక్తులు.. ఒక్క రోజే శ్రీవారి హుండీకి రూ. 5.07 కోట్ల ఆదాయం
తిరుమల ఆదివారం నాడు భక్తులు పోటేత్తారు. నిన్న 83 వేలకు మందికిపైగా భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. దీంతో ఒక్కరోజే శ్రీవారి హుండీకి రూ.5.7 కోట్లు ఆదాయం వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. భక్తులు శ్రీవారిని దర్శించుకోవడంతో పాటు భారీగా మొక్కులు, తలనీలాలు సమర్పించుకున్నారు. ఎప్పుడూ లేని విధంగా 4.39 లక్షల లడ్డూలను విక్రయించినట్టు టీటీడీ తెలిపింది. కాగా సోమవారం కూడా తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది.
రూ.15,000 కోట్ల విమానాల ప్రాజెక్ట్ నుంచి HAL అవుట్… ఏపీలోనే మన ఫైటర్ జెట్స్ తయారయ్యే ఛాన్స్
రూ.15,000 కోట్ల విమానాల ప్రాజెక్ట్ నుంచి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ తప్పుకుంది. ప్రోటోటైప్స్ తయారీ బిడ్డింగ్‌లో HAL అర్హత సాధించలేకపోయిందని రక్షణ శాఖ కార్యదర్శి ఆరేకే సింగ్ తెలిపారు. ఈ మేరకు బిడ్ నుంచి HAL రేసు నుంచి తొలగిందని, ప్రస్తుతం మూడు సంస్థలు పోటీలో ఉన్నట్టు రక్షణ శాఖ వెల్లడించింది. బిడ్ గెలచుకున్న సంస్థ ఆంధ్రప్రదేశ్‌లో పుట్టపర్తి దగ్గర ఏరోనాటికల్ డెవలప్మెంట్తో కలసి ఐదు ఫ్లయింగ్ ప్రోటోటైప్‌లు, ఒక స్ట్రక్చరల్ టెస్టింగ్ ఎయిర్ క్రాఫ్ట్‌ను రూపొందించాల్సి ఉంటుంది. దీంతో ఏపీలో రక్షణ రంగ ఎకోసిస్టమ్ భారీగా డెవలప్ అయ్యే అవకాశం ఉంది.

