Home Blog Page 112

Rakul Preet Singh: రకుల్ ప్రీత్ సింగ్ ఇంటిపై ఐటీ సోదాలు.. నటి అత్తంటి వారిపై పన్ను ఎగవేత, మనీ లాండరింగ్ ఆరోపణలు

0
నటి రకుల్ ప్రీత్ సింగ్ తో పాటు ఆమె భర్త జాకీ భగ్నానీ, మామ వాషు భగ్నానీకి సంబంధించిన ముంబయిలోని పలు ప్రదేశాల్లో ఆదాయపు పన్ను శాఖ అధికారులు గురువారం విస్తృత సోదాలు నిర్వహించారు. సినిమా నిర్మాణాల పేరుతో పన్ను ఎగవేతకు పాల్పడటమే కాకుండా విదేశాలకు అక్రమంగా నిధులు మళ్లించారనే ఆరోపణల నేపథ్యంలో ఈ దాడులు జరిగాయని తెలుస్తోంది. విదేశీ లావాదేవీలు, బ్యాంక్ రికార్డులపై ఐటీ అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.

Sivakarthikeyan vs Venkat Prabhu: ‘శివకార్తికేయన్‌తో నాకు ఎలాంటి విబేధాలు లేవు’.. ప్రాజెక్ట్ క్యాన్సిల్ అవడంపై డైరెక్టర్ వెంకట్ ప్రభు క్లారిటీ

0
తమిళ హీరో శివకార్తికేయన్‌, దర్శకుడు వెంకట్ ప్రభు మధ్య తీవ్ర మనస్పర్థలు తలెత్తాయంటూ రూమర్స్ వస్తున్నాయి. వీటిపై డైరెక్టర్ వెంకట్ ప్రభు క్లారిటీ ఇచ్చారు. శివకార్తికేయన్ తనకు సోదరుడి లాంటివాడని, తమ ఇద్దరి మధ్య ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. తన తండ్రి గంగై అమరన్ వ్యాఖ్యల వల్ల ఈ వివాదం చెలరేగిందని, కొడుకు సినిమా ఆలస్యం కావడంతో ఒక తండ్రిగా ఆయన అలా మాట్లాడి ఉండవచ్చని తెలిపారు. సరైన స్క్రిప్ట్ కుదిరితే భవిష్యత్తులో ఖచ్చితంగా తమ కాంబోలో సినిమా ఉంటుందని వెల్లడించారు.

Kaaka: మెగా ఫ్యాన్స్‌కి అదిరిపోయే న్యూస్… నెట్‌ఫ్లిక్స్‌లో చిరు ‘అన్‌ఫిల్టర్డ్’ పాడ్‌కాస్ట్

0
మెగాస్టార్ చిరంజీవి ఒకేసారి అటు ఓటీటీ, ఇటు థియేటర్లలో సందడి చేసేందుకు సమాయత్తమవుతున్నారు. ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఆయన సరికొత్త పాడ్‌కాస్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. సుస్మిత, రచయిత బి.వి.ఎస్. రవి ఆలోచనతో రూపుదిద్దుకుంటున్న ఈ కార్యక్రమంలో చిరు తన వ్యక్తిగత, సినీ ప్రయాణపు అనుభవాలను మనస్ఫూర్తిగా పంచుకోనున్నారు. మరోవైపు దర్శకుడు బాబీ కొల్లి కాంబినేషన్‌లో కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న మాస్ యాక్షన్ చిత్రం ‘కాకా’ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఫస్ట్ హాఫ్ చిత్రీకరణ పూర్తికాగా, తమన్ నేపథ్య సంగీతం పనులు ప్రారంభించారు. ఈ చిత్రాన్ని జనవరి 13న సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు.

Sardar 2 OTT: ఓటీటీలోకి ‘సర్దార్‌ 2’.. కార్తీ డిజాస్టర్ మూవీ స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

0
Sardar 2 OTT Release Date: కార్తీ హీరోగా పి.ఎస్. మిత్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘సర్దార్ 2’ ఓటీటీ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. థియేటర్లలో బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని సాధించలేకపోయిన ఈ చిత్రం, విడుదలై కేవలం మూడు వారాల వ్యవధిలోనే డిజిటల్ స్ట్రీమింగ్‌కు రానుంది. అక్టోబర్ 1 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి రానుంది. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Nani: రూ.150 కోట్ల క్లబ్‌లో ‘ది ప్యారడైజ్’.. నాని ‘మండే టెస్ట్’ పాస్ అవుతాడా?

0
నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వచ్చిన తాజా చిత్రం ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ వద్ద తొలి వీకెండ్‌లో వసూళ్ల వర్షం కురిపించింది. డివైడ్ టాక్ ఉన్నప్పటికీ నాని స్టార్‌డమ్, అడ్వాన్స్ బుకింగ్స్‌తో మొదటి నాలుగు రోజుల్లోనే సునాయాసంగా రూ.150 కోట్ల గ్రాస్ మార్కును దాటేసింది. అయితే అసలైన పరీక్ష ఈ సోమవారం నుంచే మొదలుకానుంది. రూ.200 కోట్ల క్లబ్‌లో చేరాలంటే మరో రూ.50 కోట్లు రాబట్టాల్సి ఉంది. సినిమాకు ‘ఏ’ సర్టిఫికెట్ ఉండటం, అధిక టికెట్ ధరలు, వర్కింగ్ డేస్‌లో మందగించిన బుకింగ్స్ కలెక్షన్లపై ప్రభావం చూపేలా ఉన్నాయి.

ఎండిపోకుండా ఉండాలంటే గులాబీ మొక్కను ఏ నెలలో నాటాలి? ఏడాదంతా పూలు పూయించే సులువైన చిట్కాలు!

0
ఈ రోజుల్లో చాలా మందికి గార్డెనింగ్ అంటే ఇష్టం. ఇంట్లో ఏ చిన్న ప్రదేశం కనిపించినా సరే మొక్కలు నాటడానికి ప్రయత్నిస్తారు. ముఖ్యంగా పూల మొక్కలంటే చాలా ఇష్టం. ఇక పూల గురించి మాట్లాడగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది గులాబీ. ఈ పువ్వు రకరకాల రంగుల్లో, కనువిందు చేసే రూపంతో పాటు అద్భుతమైన సువాసనతో ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తుంది. ఇక, కుర్రకారు ప్రపోజ్ చేయడానికి గులాబీ పువ్వునే ఎక్కువ ఉపయోగిస్తారు.

అయితే, సరైన అవగాహన లేకపోవడం వల్ల మొక్క సరిగ్గా ఎదగకముందే ఎండిపోవడం లేదా మొక్క ఏపుగా పెరిగినా ఒక్క పువ్వు కూడా పూయకపోవడం వంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. అసలు గులాబీ మొక్క ఏ నెలలో నాటాలి? గులాబీ మొక్క ఆరోగ్యంగా పెరిగి, పూలు బాగా పూయాలంటే పాటించాల్సిన ముఖ్యమైన చిట్కాలేంటో ఓ లుక్కేద్దాం.

అధికబరువు కారణంగా ట్రోల్స్ ఎదుర్కొంటున్న కత్రినా కైఫ్, డెలివరీ తర్వాత పెరిగిన బరువుని తగ్గించుకునేందుకు టిప్స్

0
బాడీ షేమింగ్ కామెంట్స్‌పై స్పందించిన కత్రినా సోషల్ డెలివరీ తర్వాత బాడీలో ఎన్నో మార్పులు వస్తాయి. ఇది చాలా సాధారణం. డెలివరీకి ముందు, డెలివరీ తర్వాత బాడీ ఒకేలా ఉండదు. ఫిజిక్ అప్పట్లానే రావాలంటే కాస్తా టైమ్ పడుతుందని చెబుతోంది. నిజానికీ హీరోయిన్‌గా ఎన్నో క్రేజ్‌ని సంపాదించుకున్న కత్రినా ఆ తర్వాత బ్యూటీ రంగంలో అడుగుపెట్టి సంవత్సరానికి వందల కోట్లు బిజినెస్ చేస్తోంది. వాటి గురించి మాట్లడని ట్రోలర్స్ తనని బాడీ షేమింగ్ చేస్తుండడం ఆశ్చర్యంగా ఉందని చెబుతోంది. ప్రజెంట్ మదర్‌హుడ్‌ని ఎంజాయ్ చేస్తున్న తను కామెంట్స్‌ని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నట్లుగా తన పని తాను చేసుకుని పోతుంది.
ఇంతకీ అసలు డెలివరీ తర్వాత ఎందుకు ఆడవారి శరీరంలో ఎందుకు మార్పులు వస్తాయి. విపరీతంగా ఎందుకు బరువు పెరుగుతారు. ఆ పెరిగిన బరువుని తగ్గించుకుని తిరిగి ముందులా మారాలంటే ఏం చేయాలి? నేచురల్‌గానే బరువు తగ్గేందుకు ఏమేం చేయాలో చూద్దాం.

గ్యాస్ ట్రబుల్ + వెన్ను నొప్పి + పీరియడ్స్ నొప్పులు తగ్గడానికి సాయపడే ఆసనం, స్టార్ హీరోయిన్ చెప్పినట్టు రెగ్యులర్‌గా వేస్తే చాలు!

0
యోగా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ రోజుల్లో బిజీ లైఫ్‌స్టైల్ కారణంగా ఎన్నో ఆరోగ్య సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. ఆ ఆరోగ్య సమస్యల్ని తగ్గించడంలో యోగా సాయపడుతుంది. ఇక, సెలబ్రిటీలు కూడా యోగా ప్రాముఖ్యత గురించి సోషల్ మీడియాలో చెబుతూనే ఉంటారు. యోగాసనాల్ని ఎంతో సులభంగా, ఎలా వేయాలో చూపించడంలో బాలీవుడ్ నటి శిల్పా శెట్టి ఎప్పుడూ ముందుంటారు. లేటెస్ట్‌గా ఆమె పంచుకున్న ఫిట్‌నెస్ వీడియో అందర్నీ ఆకట్టుకుంటోంది. ఈ వీడియోలో ఆమె ‘సుప్త వజ్రాసనం’ ప్రాక్టీస్ చేస్తూ కనిపించారు.

యోగాలో ఈ ఆసనానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ ఆసనం వేయడానికి ఎంతో ఓపిక, నియంత్రణ, శరీరంపై ఏకాగ్రత అవసరం. దీనిని ” నిదానంగా చేసే ఒక స్ట్రెచ్. కానీ దీని వల్ల కలిగే ప్రయోజనాలు మాత్రం ఎంతో లోతైనవి” అని శిల్పాశెట్టి పేర్కొన్నారు. వేగంగా చేసే వ్యాయామాల కంటే శరీరాన్ని అర్థం చేసుకుంటూ నిదానంగా చేసే కదలికలే అత్యంత ప్రభావవంతమైనవి ఆమె తాజా వీడియో గుర్తుచేస్తుంది. సుప్త వజ్రాసనం రెగ్యులర్‌గా వేయడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

కొలెస్ట్రాల్‌, షుగర్‌ కంట్రోల్‌, గుండె ఆరోగ్యానికి మేలు చేసే ఉసిరికాయ, ప్రధాని మోదీ ప్రశంసించిన అమృత ఫలం!

0
భారతీయ సాంప్రదాయ ఆయుర్వేదంలో అద్భుతమైన ఔషధ గుణాలు కలిగిన ఉసిరికాయ ప్రాముఖ్యతను ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) తమ మన్‌ కీ బాత్‌ ప్రసంగంలో ప్రత్యేకంగా గుర్తు చేశారు. తరతరాలుగా మన ఆహార సంస్కృతిలో భాగమైన ఈ సూపర్‌ ఫుడ్‌ కేవలం శారీరక ఆరోగ్యానికే కాకుండా స్థానిక గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు, మహిళా సాధికారతకు ఏ విధంగా బలాన్ని ఇస్తుందో వివరించారు. ముఖ్యంగా వోకల్‌ ఫర్‌ లోకల్‌ వంటి కార్యక్రమాల ద్వారా ఉసిరి సాగు, ఉత్పత్తి రంగాల్లో విప్లవాత్మక మార్పులు వచ్చాయని ప్రధాన నరేంద్ర మోదీ కొనియాడారు.

విటమిన్‌-సీ, శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే ఉసిరికాయ రోగనిరోధక శక్తిని పెంచడంలోనూ కీలకపాత్ర పోషిస్తోంది. ఉసిరి జ్యూస్‌, ఊరగాయలు, క్యాండీలు, పౌడర్‌ రూపంలో దీనికి క్రమంగా ప్రజాదరణ పెరుగుతున్న దృష్ట్యా మన స్థానిక ఉత్పత్తులను మరింత ప్రోత్సహించాల్సిన అవసరం ఉందనే సందేశాన్ని ప్రజానికానికి అందించారు. ఈ నేపథ్యంలో ఉసిరికాయ వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఈ స్టోరీలో వివరంగా తెలుసుకుందాం..

ఇంట్లోని ట్యాప్స్ నుంచి నీరు తక్కువగా వస్తుందా, కొన్ని ఫాలో అయితే క్షణాల్లో పుష్కలంగా నీరు వస్తుంది

0
ఇంట్లో మన అవసరాలకి తగ్గట్టుగా పనులు చేసే చోట కచ్చితంగా ట్యాప్స్ ఫిట్ చేయించుకుంటాం. అలాంటప్పుడు ఆ ట్యాప్స్ సరిగ్గా పనిచేయకపోతే నీరు కొద్దిగానే వస్తుంటే పనులన్నీ ఆలస్యమైనట్లుగా అనిపిస్తాయి. కాస్తా చిరాగ్గా కూడా ఉంటాయి. దీనికోసం మళ్లీ ప్లంబర్‌ని పిలిపించాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న టెక్నిక్స్ ఫాలో అయితే ఈజీగా ఇంట్లోనే మనం ట్యాప్స్‌నుంచి వచ్చే నీటి ఫ్లోని పెంచొచ్చు. ఫ్లో పెరిగితే ఆటోమేటిగ్గా నీరు త్వరగా వస్తుంది. మన పనుల్ని ఈజీగా చేసుకోవచ్చు. మరి ఆ టిప్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.