ITR Deadline Extension: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అదిరే శుభవార్త. ట్యాక్స్ ఆడిట్ గడువుతో పాటు ఐటీఆర్ ఫైలింగ్ గడువును సైతం పొడిగిస్తూ కేంద్ర ప్రత్యక్ష పన్ను బోర్డు నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 30తో ట్యాక్స్ ఆడిట్ గడువు ముగుస్తున్న క్రమంలో మరో 21 రోజుల పాటు సమయం కల్పించారు. అలాగే ఐటీఆర్ గడువు మరో నెల రోజులకు పొడగించారు. మరి కొత్త తేదీలు, గడువు పెంపు వంటి వివరాలు తెలుసుకుందాం.


