Techie Try To Book Room In Tirumala With Chatgpt: ఆఏఐ టెక్నాలజీతో సెకన్ల వ్యవధిలో ఎన్నో అద్భుతాలు చేస్తున్నారు. తాజాగా ఓ టెకీ తిరుమలలో వసతి గదిని ఒక ఏఐ మోడల్ ద్వారా బుక్ చేసే ప్రయత్నం చేశాడు. అంతా బాగానే జరిగింది కానీ.. చివరిలో పేమెంట్ దగ్గర ఆగిపోయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. టెక్ బై పవన్ అనే ఇన్స్టాగ్రామ్ క్రియేటర్ ఈ వీడియోను పోస్ట్ చేశారు.
ఏపీలో 2024 బ్యాచ్ ఐఏఎస్‌లకు పోస్టింగ్‌లు.. 20 రోజుల క్రితం ఉత్తర్వులిచ్చి క్యాన్సిల్.. తాజాగా సబ్‌కలెక్టర్లుగా నియామకం
Andhra Pradesh 2024 Batch Ias Officers Postings: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యువ ఐఏఎస్‌ల పోస్టింగ్స్‌కు సంబంధించి మరో కీలక నిర్ణయం తీసుకుంది. 2024 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ ప్రోబేషనర్లకు పోస్టింగులు కల్పించింది. ఈ మేరకు ఈ నెల 8వ తేదీన జారీ చేసిన ఉత్తర్వులు వెంటనే అమల్లోకి వస్తున్నట్లుగా ఏపీ ప్రభుత్వ సీఎస్ సాయిప్రసాద్ ప్రకటించారు. ఈ నెల 8న వీరికి పోస్టింగ్స్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేయగా.. ఆ తర్వాత వాటిని పక్కన పెట్టారు.
వీఆర్ఎస్కు దరఖాస్తు చేసుకున్న ఏపీఎస్ఆర్టీసీ ఈడీ.. 10 నెలల సర్వీసు ఉన్నా ఉద్యోగం వదులుకునేందుకు సిద్ధం
APSRTC Ed Raghavakumar Applied For Voluntary Retirement: ఏపీఎస్ఆర్టీసీ ఆపరేషన్స్ విభాగం ఈడీ రాఘవరకుమార్ వీఆర్ఎస్కు దరఖాస్తు చేసుకున్నారు. ఆయనకు పది నెలల సర్వీసు ఉండగానే ఉద్యోగం వదులుకునేందుకు సిద్ధమయ్యారు. ఆయన వారం క్రితం వీఆర్ఎస్ కోసం దరఖాస్తు చేశారు. వ్యక్తిగత కారణాలతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాఘవకుమార్ తెలిపారు. రెండు నెలల క్రితమే ఆయన కడప నుంచి ఆర్టీసీ ప్రధాన కార్యాలయానికి వచ్చి.. ఈడీగా బాధ్యతలు స్వీకరించారు.. ఇంతలోనే వీఆర్స్కు దరఖాస్తు చేయడం ఆసక్తికరంగా మారింద.
తిరుమలలో శ్రీవారి లడ్డూ ప్రసాదాలు.. భక్తుల కోసం కవర్లతో పాటుగా కొత్త బ్యాగులు అందుబాటులోకి వచ్చాయి
Jute Laddu Bags Launched At TTD Tirumala: తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులు లడ్డూ ప్రసాదాలు కొనుగోలు చేస్తుంటారు. భక్తులు లడ్డూ ప్రసాదాలు తీసుకెళ్లేందుకు టీటీడీ బయోడీగ్రేడబుల్ కవర్లు అందిస్తోంది. వీటితో పాటుగా తాజాగా భక్తుల కోసం జూట్ బ్యాగులు కూడా అందుబాటులోకి వచ్చాయి. తిరుమల ఆలయం వెనుక లడ్డూ కౌంటర్ల దగ్గరే ఈ జూట్ బ్యాగుల్ని విక్రయిస్తున్నారు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని అదికారులు సూచించారు.
తిరుపతి ఎయిర్పోర్ట్ ప్రైవేటుకు అప్పగింత.. ఏపీలో మరో రెండు విమానాశ్రయాలు కూడా ప్రైవేట్‌కు?
Tirupati Airport And Tiruchirappalli International Airport Bundled: కేంద్రం ఇటీవల 11 విమనాశ్రయాలను ప్రైవేట్‌కు అప్పగించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే తిరుపతి, తిరుచిరాపల్లి విమానాశ్రయాలు ప్రైవేటుకు నిర్వహణ బాధ్యతలు అప్పగించేందుకు ఏఏఐ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్రంద ఆసక్తి వ్యక్తీకరణకు ప్రకటన జారీ చేసింది. అంతేకాదు ఏపీలోని మరో మరో రెండు విమానాశ్రయాలను కూడా ప్రైవేట్‌కు అప్పగించాలనే ప్రతిపాదనలు కూడా ఉన్నాయి. ఈ రెండిటిపై త్వరలోనే క్లారిటీ వస్తుందని చెబుతున్నారు.
తిరుమలలో భక్తుల రద్దీ.. సామాన్య భక్తుల కోసం టీటీడీ కీలక నిర్ణయం.. రెండ్రోజుల పాటూ వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
TTD Cancelled Tirumala Vip Break Darshan On October 1st And October 5th: తిరుమలలో దాదాపు ఏడు నెలలుగా భక్తుల రద్దీ కొనసాగుతోంది. అక్టోబర్ నెలలో పెరటాసి మాసం, వరుస సెలవుల్ని దృష్టిలో పెట్టుకుని టీటీడీ సామాన్య భక్తులకు ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించింది. అందుకే అక్టోబర్ 1, అక్టోబర్ 5 తేదీల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసింది. తిరుమల శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని టీటీడీ సూచిస్తోంది.
NTR: మొన్న బాబాయ్, నేడు అబ్బాయ్.. రాజమౌళి సినిమా కోసం రంగంలోకి దిగుతున్న జూ.ఎన్టీఆర్
ఎస్.ఎస్. రాజమౌళి సమర్పణలో ఫహాద్ ఫాజిల్ కథానాయకుడిగా నటించిన ఫాంటసీ ఎంటర్టైనర్ ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’. శశాంక్ యేలేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం అక్టోబర్ 2న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మంగళవారం హైదరాబాద్‌లోని JRC కన్వెన్షన్‌లో గ్రాండ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. దీనికి యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఎస్ఎస్ కార్తికేయ నిర్మిస్తున్నఈ మూవీ ప్రమోషన్స్ బాధ్యతను రాజమౌళి స్వయంగా దగ్గరుండి చూసుకుంటున్నారు.

