ఇంజినీరింగ్ పూర్తిచేసిన అభ్యర్థులకు ఇండియన్ ఆర్మీ స్వాగతం పలుకుతోంది. టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సు ద్వారా ఇంజినీరింగ్ విభాగాల్లో ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ఏడాదికి రెండుసార్లు మార్చి లేదా ఏప్రిల్, సెప్టెంబరు లేదా అక్టోబరులో నోటిఫికేషన్ విడుదల చేస్తుంది. దరఖాస్తు చేసిన అభ్యర్థులను మెరిట్ ప్రాతిపదికన షార్ట్ లిస్ట్ చేసి.. ఇంటర్వ్యూకు పిలుస్తుంది. అనంతరం మెడికల్ టెస్ట్ కూడా నిర్వహిస్తారు. ఈ రెండింటిని బేస్ చేసుకుని ఎంపిక చేపడుతుంది. వీరికి ఏడాది పాటు శిక్షణ ఉంటుంది.
ఓవైపు రాష్ట్రంలో తీవ్ర కరువు… మరోవైపు లోకాయుక్త కోసం రూ.1.32 కోట్లతో లగ్జరీ కార్లు
పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన ఎల్ నినో రుతుపవనాలను తీవ్రంగా ప్రభావితం చేసింది. ఈ వర్షాకాలంలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం కురవడంతో పలు రాష్ట్రాలు కరువు కోరల్లో చిక్కుకున్నాయి. ఇక, మహారాష్ట్రలో దారుణమైన పరిస్థితులు నెలకున్నాయి. మొత్తం 358 తాలూకాలు ఉండగా.. ఏకంగా 265 చోట్ల వాన జాడ కానరాలేదు. రైతాంగం కష్టాల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇలాంటి తరుణంలో ప్రభుత్వం తీసుకున్న ఓ నిర్ణయం తీవ్ర వివాదాస్పదంగా మారింది. జనం కరువుతో అల్లాడిపోతుంటే.. లోకాయుక్త విలాసవంతమైన కార్లను కొనుగోలుకు రూ.1.32 కోట్లు కేటాయించింది.
యూపీలో 10 రాజ్యసభ స్థానాలు ఖాళీ.. స్మృతి ఇరానీ, వరుణ్ గాంధీల పేర్లను పరిశీలిస్తోన్న బీజేపీ
ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్‌లోని మొత్తం 12 రాజ్యసభ స్థానాలకు అక్టోబరు 16న ఎన్నికలు జరగనున్నాయి. యూపీలోని మొత్తం 10 సీట్లు ఖాళీ అవుతున్నాయి. ఆ రాష్ట్రంలో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా.. వరుసగా మూడోసారి అధికారం చేజిక్కించుకోవాలని బీజేపీ భావిస్తోంది. ఇందుకోసం వ్యూహరచన చేస్తోన్న బీజేపీ.. రాజ్యసభ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల ఎంపికపై కసరత్తు మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలో కేంద్ర మాజీ మంత్రి స్మృతి ఇరానీ, వరుణ్ గాంధీ పేర్లు వినిపిస్తున్నాయి.
ఏపీ స్థానిక ఎన్నికల వాయిదా పుకార్లపై ఎన్నికల సంఘం ఫైర్ .. ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తే చర్యలు తప్పవని వార్నింగ్
ఏపీ స్థానిక ఎన్నికలపై ఎన్నికల సంఘం ఒక క్లారిటీ ఇచ్చింది. ఎన్నికలు ఇంకో రెండు నెలలు ఆలస్యం అవుతాయనే వార్తలను ఖండించింది. పుకార్లను నమ్మొద్దని ప్రజలను కోరింది. స్థానిక ఎన్నికలకు సంబంధించి ఏ సమాచారమైన మీడియా సమావేశం ద్వారా వెల్లడిస్తామని పేర్కొంది. సోషల్ మీడియాలో వస్తున్న సమాచారాన్ని నమ్మే ముందు.. సంబంధిత అధికారిక వెబ్సైట్లో ఉన్న వివరాలతో ధ్రువీకరించుకోవాలని సూచించింది. అలాగే స్థానిక ఎన్నికలపై పుకార్లు సృష్టించినా, ఫార్వార్డ్ చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
రీల్స్‌పైనే జనాలు ఎక్కువ టైమ్ వృథా చేస్తున్నారు.. మైండ్, బాడీ డిస్టర్బ్ అవుతాయి: సీఎం చంద్రబాబు
విజయవాడలో కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ నిర్వహించిన మిషన్ కర్మయోగి వర్క్‌షాప్‌లో సీఎం చంద్రబాబునాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేశంలో ప్రస్తుతం విప్లవాత్మక మార్పులు జరుగుతున్నాయని ఆయన అన్నారు. డెవలప్మెంట్, సంక్షేమం, సంపద సృష్టి దిశగా యంత్రాంగం సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరి జీవన ప్రమాణాలు పెంచడమే ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. అలాగే జనాలు ఎక్కువ రీల్స్ చూస్తున్నారని, వాటిపైన సమయం వృథా చేయడం మంచిది కాదని హితవు పలికారు. వ్యక్తిగత నైపుణ్యాలు పెంచుకోవడానికి అందరూ ప్రయత్నించాలని చంద్రబాబునాయుడు సూచించారు.
ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌పై SEC క్లారిటీ.. చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని వార్నింగ్
AP SEC Respond On Local Body Elections Delay News: స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌పై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టత ఇచ్చింది. సోషల్ మీడియాలో వేదికగా స్థానిక సంస్థల ఎన్నికలు మరో రెండు నెలలు ఆలస్యం కావొచ్చంటూ జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని తెలిపింది. తప్పుడు ప్రచారం చేస్తున్నవారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారిక సమాచారాన్ని మాత్రమే నమ్మాలని సూచించారు.
ఏపీలో నాలుగు లైన్ల రైలు మార్గం.. 962 కిలోమీటర్లు విస్తరణకు గ్రీన్‌సిగ్నల్.. గోదావరిపై కొత్తగా వంతెన నిర్మాణం
Ichapuram To Tada Railway Lines Expansion: ఏపీలో రైల్వే లైన్ల విస్తరణకు సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది. రాష్ట్రం మీదుగా వెళుతున్నహౌరా టు చెన్నై రైల్వే లైన్‌ను విస్తరించాలని రైల్వేశాఖ నిర్ణయం తీసుకుంది. ఈ రూట్లోని ఇచ్చాపురం నుంచి తడ వరకు నాలుగు లైన్ల రైలు మార్గంగా విస్తరించనున్నారు. మొత్తం 962.50 కిలోమీటర్లు పొడవున రైల్వే లైన్‌ను విస్తరించనున్నారు. ఇప్పటికే ఆయా రూట్లలో మూడు లైన్ల వరకు విస్తరించగా.. మిగిలిన నాలుగో లైన్ నిర్మించనున్నారు.
ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ఊరట.. ఇకపై ప్రతి నెలా 1వ తేదీన డబ్బులు జమ, EHSపై ప్రభుత్వం కీలక నిర్ణయం
AP Govt Changes In Employees EHS Fund Transfer Process: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగులు, పెన్షనర్ల కు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్ (EHS) కింద వారి నుంచి సేకరించే నెలవారీ డబ్బుల్ని, ప్రభుత్వ వాటాను నిర్ణీత సమయంలోగా ఎన్టీఆర్ వైద్యసేవ ట్రస్టు బ్యాంకు అకౌంట్‌కు నేరుగా జమ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 5న ముఖ్యమంత్రి చంద్రబాబును ఉద్యోగ సంఘాల నేతలు కలిసిన సమయంలో ఈ సమస్యను వివరించారు.
ఏపీలో మరోసారి కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ.. కీలక ఉత్తర్వులు జారీ చేసి ప్రభుత్వం
AP Govt Orders On Contract Employees Regularization: ఏపీ ప్రభుత్వం కొంతకాలంగా కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని రెగ్యులరైజ్ చేస్తోంది. క్రమద్ధీకరణకు సంబంధించిన సమస్యల్ని ఒక్కొక్కటిగా పరిష్కరిస్తోంది. తాజాగాసెకండరీ హెల్త్‌లో ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణకు లైన్ క్లియర్ చేసింది. సెకండరీ హెల్త్ పరిధిలో అర్హులైన కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని క్రమబ్ధీకరించేందుకు ఆర్థిక శాఖ నుంచి క్లియరెన్స్ వచ్చింది. గతంలో సాంకేతిక సమస్యల కారణంగా ఇబ్బందులు ఎదురవ్వగా.. వాటిని పరిష్కరించి క్రమబద్ధీకరణకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేసింది.
ఏపీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల పాలసీ.. ప్రభుత్వం డబ్బులు అంత ఈజీగా ఇవ్వదు, కండిషన్స్ అప్లై!
AP Govt Social Media Influencers Policy Go: ఏపీప్రభుత్వం సోషల్ మీడియా ఇన్ప్లుయెన్సర్ల పాలసీకి సంబంధించి ఉత్తర్వులుజారీ చేసింది. సోషల్ మీడియా ద్వారా సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు, ప్రజా అవగాహన కార్యక్రమాలను ప్రచారం చేసేందుకు చర్యలు తీసుకుంటోంది. విశ్వసనీయత కలిగిన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను గుర్తిస్తారు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకుంటే స్క్రూటినీ కమిటీ పరిశీలించి ఎంపిక చేస్తుంది. అనంతరం వారికి ఐడీ కార్డులు జారీ చేసి ఏడాది పాటూ వారి పనితీరును పరిశీలిస్తారు.

