ఇంజినీరింగ్ పూర్తిచేసిన అభ్యర్థులకు ఇండియన్ ఆర్మీ స్వాగతం పలుకుతోంది. టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సు ద్వారా ఇంజినీరింగ్ విభాగాల్లో ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ఏడాదికి రెండుసార్లు మార్చి లేదా ఏప్రిల్, సెప్టెంబరు లేదా అక్టోబరులో నోటిఫికేషన్ విడుదల చేస్తుంది. దరఖాస్తు చేసిన అభ్యర్థులను మెరిట్ ప్రాతిపదికన షార్ట్ లిస్ట్ చేసి.. ఇంటర్వ్యూకు పిలుస్తుంది. అనంతరం మెడికల్ టెస్ట్ కూడా నిర్వహిస్తారు. ఈ రెండింటిని బేస్ చేసుకుని ఎంపిక చేపడుతుంది. వీరికి ఏడాది పాటు శిక్షణ ఉంటుంది.


