HomeAndhra Pradesh‘జగన్ ఓసారి చూడండి’.. స్థానిక ఎన్నికల ముంగిట ఆమంచి పాత వీడియోను వైరల్ చేస్తున్న వైసీపీ...

‘జగన్ ఓసారి చూడండి’.. స్థానిక ఎన్నికల ముంగిట ఆమంచి పాత వీడియోను వైరల్ చేస్తున్న వైసీపీ శ్రేణులు

ఏపీ ఎన్నికల్లో వైసీపీ కేవలం 11 స్థానాలకే పరిమితం కావడానికి గల కారణాలపై మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ చేసిన విశ్లేషణ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సంక్షేమ పథకాలు అమలు చేసినంత మాత్రాన ప్రజల మద్దతు కొనసాగుతుందని భావించలేమని.. కుటుంబాలపై పడే అదనపు ఖర్చులు కూడా ఓటర్ల నిర్ణయాన్ని ప్రభావితం చేస్తాయని అభిప్రాయపడ్డారు. వైఎస్ రాజశేఖరరెడ్డి పాలనా శైలితో జగన్ పాలనను పోలుస్తూ ప్రజలతో నిరంతర సంబంధాలు అవసరమని పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఈ పాత వీడియోను వైసీపీ శ్రేణులు షేర్ చేస్తున్నారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments