ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్లోని మొత్తం 12 రాజ్యసభ స్థానాలకు అక్టోబరు 16న ఎన్నికలు జరగనున్నాయి. యూపీలోని మొత్తం 10 సీట్లు ఖాళీ అవుతున్నాయి. ఆ రాష్ట్రంలో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా.. వరుసగా మూడోసారి అధికారం చేజిక్కించుకోవాలని బీజేపీ భావిస్తోంది. ఇందుకోసం వ్యూహరచన చేస్తోన్న బీజేపీ.. రాజ్యసభ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల ఎంపికపై కసరత్తు మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలో కేంద్ర మాజీ మంత్రి స్మృతి ఇరానీ, వరుణ్ గాంధీ పేర్లు వినిపిస్తున్నాయి.


