HomeTELANGANAరీస‌ర్వేతోనే భూస‌మ‌స్యలకు చెక్.. తొలి దశలో జిల్లాకు 70 గ్రామాలు, భూభారతి లక్ష్యం ఇదే..!

రీస‌ర్వేతోనే భూస‌మ‌స్యలకు చెక్.. తొలి దశలో జిల్లాకు 70 గ్రామాలు, భూభారతి లక్ష్యం ఇదే..!

తెలంగాణ భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు సమగ్ర రీసర్వే చేపడుతున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. భూ భారతి కింద తొలి దశలో ప్రతి జిల్లాలో 70 రెవెన్యూ గ్రామాల్లో సర్వే చేయనున్నట్లు వెల్లడించారు. నక్షాలు అందుబాటులో లేని మరో 413 గ్రామాలను కూడా దశలవారీగా సర్వే చేయనున్నట్లు చెప్పారు. ప్రతి భూ పార్శిల్‌కు ప్రత్యేక గుర్తింపు, జియో కోఆర్డినేట్స్‌తో మ్యాప్‌, ఎల్‌పీఎం నంబర్‌ అందించే దిశగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. సాదాబైనామాలు, భూ హద్దుల వివాదాలు, పాత రికార్డుల లోపాలు, అబాది ఆస్తుల సమస్యలను కూడా సర్వే ద్వారా పరిష్కరించనున్నట్లు తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపైనా మంత్రి కీలక వివరాలు వెల్లడించారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments