బలూచిస్థాన్‌లో పాకిస్థాన్ ఆర్మీకి మరోసారి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వేర్పాటువాద గ్రూప్ ఏర్పాటుచేసిన మహిళా వింగ్ తన తొలి దాడిని విజయవంతంగా పూర్తిచేసింది. సైనిక కాన్వాయ్‌ను లక్ష్యంగా చేసుకున్న కాడ్.. దగ్గర నుంచి కాల్పులు జరిపింది. ఈ ఘటనలో 9 మంది పాక్ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు.
US Iran War యురేనియం శుద్ధి నిలిపేతకు అంగీకారం..అణు కార్యక్రమంపై మెట్టు దిగిన ఇరాన్?
అమెరికా, ఇరాన్ మధ్య శాంతి చర్చలను పునరుద్దరించేందుకు మధ్యవర్తిత్వం వహిస్తోన్న ఖతార్, పాకిస్థాన్‌లు ప్రయత్నాలను కొనసాగిస్తున్నాయి. ఈ తరుణంలో తన అణు కార్యక్రమం విషయంలో ఇరాన్ కొంత వెనకడుగు వేసిందని, యురేనియం శుద్ధి ప్రక్రియను నిలిపివేయడానికి సమ్మతించిందని తాజాగా ఓ నివేదిక పేర్కొంది. అటు, అమెరికా సైతం ఇరాన్‌పై ఆంక్షలను సడలింపునకు సిద్ధమైంది. దీంతో హర్మూజ్ జల సంధి చుట్టూనే పీటముడి కొనసాగుతోంది. అయితే, అమెరికా, ఇరాన్ మధ్య పరస్పర నమ్మకం లేకపోవడం కొంత ఆటంకంగా మారింది.
అమిత్ షా తెలంగాణ టూర్.. హైదరాబాద్, తూప్రాన్, కరీంనగర్‌లలో పర్యటన.. ఫుల్ షెడ్యూల్ ఇదే!
కేంద్రమంత్రి అమిత్ షా తెలంగాణలో టూర్ ఖరారైంది. మెదక్ జిల్లాలో అమూల్ సంస్థ ఏర్పాటు చేయనున్న మిల్క్ బల్క్ యూనిట్‌కు ఆయన భూమిపూజ చేయనున్నారు. అనంతరం రైతు బహిరంగ సభలో అమిత్ షా ప్రసంగించనున్నారు. ఆయన పర్యటన నేపథ్యంలో తూప్రాన్‌లో అధికారులు భద్రత, వేదిక, పార్కింగ్ తదితర ఏర్పాట్లు చేస్తున్నారు. హైదరాబాద్, కరీంనగర్లో కూడా అమిత్ షా కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఖైరతాబాద్ ఉపఎన్నికలు, జీహెచ్ఎంసీ ఎన్నికలకు ముందు అమిత్ షా తెలంగాణ పర్యటనపై బీజేపీ శ్రేణుల్లో ఆసక్తి నెలకొంది.
తుమ్మిడిహెట్టి బ్యారేజీపై రేవంత్ కీలక చర్చలు.. మహారాష్ట్రను ఒప్పించాలంటూ కేంద్రానికి విజ్ఞప్తి!
రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన పెండింగ్ అనుమతులపై సీఎం రేవంత్ రెడ్డి కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి సీఎం సమావేశమయ్యారు. ముఖ్యంగా తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణానికి మహారాష్ట్రను ఒప్పించి త్వరగా అనుమతులు వచ్చేలా చొరవ తీసుకోవాలని కోరారు. బ్యారేజీని ఎఫ్ఆర్ఎల్ +152 మీటర్ల స్థాయిలో నిర్మిస్తే ఎల్లంపల్లికి గ్రావిటీ ద్వారా నీటిని తరలించవచ్చని పేర్కొన్నారు.
తెలంగాణలో విద్యుత్ డిమాండ్ ఆల్‌టైమ్ రికార్డు.. 12,044 మెగావాట్లకు చేరిన వినియోగం!
తెలంగాణలో విద్యుత్ వినియోగం సరికొత్త గరిష్ట స్థాయికి చేరింది. టీజీఎస్పీడీసీఎల్ పరిధిలో మంగళవారం 12,044 మెగావాట్ల గరిష్ట విద్యుత్ డిమాండ్ నమోదైంది. ఇది సంస్థ చరిత్రలోనే అత్యధిక డిమాండ్‌గా అధికారులు తెలిపారు. గతంలో నమోదైన రికార్డును తాజా డిమాండ్ అధిగమించింది. గృహ, వ్యవసాయ, వాణిజ్య, పారిశ్రామిక రంగాల్లో పెరిగిన వినియోగం దీనికి కారణంగా కనిపిస్తోంది. గ్రేటర్ హైదరాబాద్‌లోనూ భారీ డిమాండ్ నమోదవుతోంది. పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా నెట్వర్క్ బలోపేతం, సబ్‌స్టేషన్ సామర్థ్యం పెంపు, ఆధునీకరణ చర్యలు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు.
ఓయో హోటల్‌కు వెళ్లిన జంట.. మహిళ హత్య, పురుషుడు పరారీ.. మాదాపూర్ ఘటన మరిచిపోకముందే..!
హైదరాబాద్ ఎస్ఆర్ నగర్లో దారుణం చోటు చేసుకుంది. ఓయో హోటల్లో మహిళ హత్య తీవ్ర కలకలం రేపింది. 2 రోజుల క్రితం ఓ వ్యక్తితో కలిసి హోటల్లో దిగిన మహిళ గదిలో రక్తపు గాయాలతో మృతిచెందినట్లు పోలీసులు గుర్తించారు. ఆమెతో వచ్చిన వ్యక్తి కనిపించకుండా పోవడంతో అతడిపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్, హోటల్ రికార్డులు, ఇతర ఆధారాల ఆధారంగా దర్యాప్తు కొనసాగుతోంది. ఇటీవలె మాదాపూర్ ఓయో హోటల్లో యువతి హత్య మరిచిపోకముందే ఈ ఘటన జరగడం సంచలనంగా మారింది.
ఫిబ్రవరిలో ఖైరతాబాద్ బైపోల్స్.. త్రిముఖ పోరు.. ఏ పార్టీ నుంచి ఎవరు పోటీ.. బరిలో కవిత, పవన్ కళ్యాణ్ పార్టీలు!
ఖైరతాబాద్ ఉపఎన్నిక నేపథ్యంలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ తమ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నాయి. ఇక ఖైరతాబాద్‌లో త్రిముఖ పోరు తప్పదని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఈ క్రమంలోనే ఖైరతాబాద్ బైపోల్స్‌లో పోటీ చేసేందుకు టీఆర్ఎస్, జనసేన పార్టీలు కూడా సై అంటున్నాయి. దీంతో ఇప్పుడు ఈ ఉపఎన్నిక రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది. ఇక ఎన్నికల సంఘం ఎప్పుడు షెడ్యూల్ ప్రకటిస్తుందా అనే ఉత్కంఠ ఇప్పుడు అందరిలో నెలకొంది. అయితే ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఖైరతాబాద్ బైపోల్స్ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
రాశిఫలాలు 30 సెప్టెంబర్ 2026: వజ్ర యోగం ప్రభావంతో వృషభం సహా ఈ 6 రాశులకు అపారమైన ప్రయోజనాలు!
రాశిఫలాలు 30 సెప్టెంబర్ 2026: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం బుధవారం రోజున చంద్రుడు వృషభ రాశిలో సంచారం చేయనున్నాడు. ఇదే సమయంలో ద్వాదశ రాశులపై భరణి నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో పాటు వజ్ర, సిద్ధి యోగాలు ఏర్పడనున్నాయి. అంతేకాదు ఇది వినాయకుడికి అంకితం ఇవ్వబడిన రోజు. ఈ శుభ సమయంలో మీ ఆర్థిక పరిస్థితి బలపడే అవకాశం ఉంది. మీ జాతకంలో బుధ గ్రహ స్థానం బలపడుతుంది. మీ కష్టాలన్నీ తొలగిపోయి, మీ పనులు సులభంగా పూర్తయ్యే అవకాశం ఉంది. మరికొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు రానున్నాయి. ఈ సందర్భంగా మేషం నుంచి మీన రాశుల వారికి ఏ మేరకు శుభ ఫలితాలు రానున్నాయి, ఎవరికి అశుభ ఫలితాలు రానున్నాయనే ఆసక్తికరమైన విషయాలను ప్రముఖ పండితులు ‘‘ఆచార్య క్రిష్ణ దత్త శర్మ’’ మాటల్లో తెలుసుకుందాం.
Pitru Paksha 2026: పితృపక్షాల వేళ మీ రాశిని బట్టి ఏ వస్తువులను దానం చేస్తే ఎలాంటి ప్రయోజనాలు?
Pitru Paksha 2026: హిందూ మత విశ్వాసాల ప్రకారం, పితృపక్షాల వేళ శ్రాద్ధం, తర్పణం, పిండదానాలతో పాటు కొన్ని వస్తువులను దానం చేయడం వల్ల ఎంతో పుణ్యం లభిస్తుందని పండితులు చెబుతారు. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, పితృపక్షాలను పాటించే వారు వారి సామర్థ్యం మేరకు ఆహారం, నీరు, నువ్వులు, బట్టలు, కొంత సొమ్మును బ్రహ్మాణులకు దక్షిణగా ఇస్తారు.
ఈ నేపథ్యంలో జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, పితృపక్షాల వేళ మీ రాశి ప్రకారం కొన్ని వస్తువులను దానం చేయడం వల్ల ప్రత్యేక ప్రయోజనాలు పొందే అవకాశాలున్నాయి. ఈ సందర్భంగా మీ రాశిని పాలించే గ్రహాలకు అనుకూల వస్తువులను దానం చేయడం వల్ల మీకు మెరుగైన ఫలితాలొచ్చే అవకాశాలుంటాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఈ సందర్భంగా పితృపక్షాల వేళ మీ రాశిని బట్టి ఏ వస్తువులు దానం చేస్తే శుభ ఫలితాలొస్తాయో ఇప్పుడే తెలుసుకోండి.

