Vooka Vijay Kumar Good Bye To Tdp: తిరుపతి రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం జరిగింది. స్థానిక సంస్థల ఎన్నికల వేళ టీడీపీకి సీనియర్ నేత రాజీనామా చేశారు.. వ్యక్తిగత కారణాలతో తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు రాజీనామా లేఖను టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్‌కు పంపారు. ఆయన ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అర్బన్ ఫైనాన్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్‌గా ఉన్నారు. ఆయన కూటమిలోని పార్టీల్లోనే చేరబోతున్నట్లుగా జోరుగా ప్రచారం నడుస్తోంది.
ఏపీ ప్రజలకు శుభవార్త.. కిలో ఉల్లి రూ.35కే ఇస్తున్నారు.. ఆధార్, రేషన్ కార్డు చూపించి తెచ్చుకోవచ్చు
AP Govt Onions Rs 35 Per Kg In Rythu Bazaars: మార్కెట్లో ఉల్లి ధరలు పెరుగుతున్నాయి.. అందుకే ఏపీ ప్రభుత్వం సామాన్యులకు ఊరట కల్పించింది. ధరల స్థిరీకరణలో భాగంగా సబ్సిడీ ధరకు ఉల్లిపాయలను విక్రయిస్తోంది. రైతు బజార్లలో కిలో ఉల్లిపాయలను కేవలం రూ. 35కే విక్రయించనున్నట్లు ప్రకటించింది. తొలి దశలో విజయవాడ నగరంలో సబ్సిడీ ఉల్లి విక్రయాలను అమలు చేయనున్నారు. నగరంలోని అన్ని రైతుబజార్లలో ఈ విక్రయిస్తారు.ఆధార్ కార్డు లేదా రేషన్ కార్డు తీసుకెళ్లి ప్రతి కుటుంబానికి నెలకు గరిష్టంగా రెండు కిలోల ఉల్లిపాయలు తీసుకోవచ్చు.
కల్కీ భగవాన్ కన్నుమూత.. సామాన్య క్లర్క్ నుంచి ఆధ్యాత్మిక గురువుగా పేరు.. 2019లో ఏం జరిగింది!
Kalki Bhagwan Full Story: ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, ఏకం వ్యవస్థాపకులు కల్కి భగవాన్ అలియాస్ విజయ్‌కుమార్ నాయుడు కన్నుమూశారు. ఆయన అనారోగ్య సమస్యలతో చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చనిపోయారు. తమిళనాడులో జన్మించిన ఆయన ఎల్ఐసీలో క్లర్క్‌గా పనిచేశారు. అనంతరం ఆధ్యాత్మికత పేరుతో కల్కి భగవాన్‌గా ప్రకటించుకున్నారు. ఆయనకు దేశ, విదేశాలలో భక్తులు ఉన్నారు. అలాగే కల్కి భగవాన్ చుట్టూ వివాదాలు, ఐటీ దాడులు కూడా వెంటాడాయి. ఆయన మరణంతో భక్తులు విషాదంలో ఉన్నారు.
‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ ఫస్ట్ కాపీ చూసి ఏడ్చాను.. రెక్కలు చాపి నోట్లోంచి మంటలు చిమ్మే ‘డ్రాగన్’ కోసం ఎదురు చూస్తున్నా: రాజమౌళి
Rajamouli Speech: ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ ప్రీరిలీజ్ ఈవెంట్లో రాజమౌళి మాట్లాడుతూ.. ఎన్టీఆర్ ‘డ్రాగన్’ మూవీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. నటుడు ఫాహద్ ఫాజిల్ నటనపై ప్రశంసలు కురిపించిన ఆయన, దర్శకుడు శశాంక్ చెప్పిన వినూత్న కథ తనను ఎంతగానో ఆకట్టుకుందని చెప్పారు. ఫస్ట్ కాపీ చూసినప్పుడు ఎమోషనలై ఏడ్చానని పేర్కొన్నారు. అక్టోబర్ 2న వస్తున్న ఈ ఫాంటసీ చిత్రం గొప్ప విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
NTR: ‘నిన్ను చూడాలని’ ఓపెనింగ్‌కి నా కుటుంబ సభ్యులు రాలేదని బాధపడ్డా.. నాకు దేవుడిచ్చిన కుటుంబం రాజమౌళి: ఎన్టీఆర్
ఫహాద్ ఫాజిల్ హీరోగా, శశాంక్ ఏలేటి దర్శకత్వంలో ఎస్.ఎస్. కార్తికేయ నిర్మించిన సినిమా ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాజమౌళి కుటుంబం తనకు దేవుడిచ్చిన కుటుంబమని, కార్తికేయ తన సొంత తమ్ముడిలాంటివాడని తారక్ ఎమోషనల్ అయ్యారు. తన కష్టసుఖాల్లో కార్తికేయ తోడున్నాడని పేర్కొంటూ, ‘స్టూడెంట్ నంబర్ 1’ సినిమా 25 ఏళ్లు పూర్తి చేసుకున్నందుకు సంతోషం వ్యక్తం చేశారు.
Trivikram: ఒక్క ముక్కలో ‘ఆదర్శ కుటుంబం’ స్టోరీ మొత్తం చెప్పేసిన త్రివిక్రమ్
వెంకటేష్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఆదర్శ కుటుంబం’ అక్టోబర్ 9న విడుదల కానుంది. ప్రమోషన్ల ఇంటర్వ్యూలో దర్శకుడు త్రివిక్రమ్ ఈ సినిమా పాయింట్‌ను రివీల్ చేశారు. ఊహించని పరిణామాల వల్ల జీవితాలు ఎలా తారుమారవుతాయనే ‘బ్లాక్ స్వాన్ ఎఫెక్ట్’ కాన్సెప్ట్‌తో, ఇద్దరి మధ్య పోరులో మూడో వ్యక్తి ప్రభావితమయ్యే కథాంశంతో ఈ చిత్రం రూపుదిద్దుకుందని, ఇందులో క్రైమ్, యాక్షన్, కామెడీ, ఎమోషన్స్ ఉంటాయని తెలిపారు.
Thella Kaagitham Movie: ‘తెల్లకాగితం’ టీంకి షాక్.. విడుదలకు ముందే సీన్లు లీక్..
Thella Kaagitham: హర్ష్ రోషన్, నక్షత్ర జంటగా రమేష్ బండ్రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన యూత్‌ఫుల్ లవ్ స్టోరీ ‘తెల్లకాగితం’. కృష్ణ కొమ్మాలపాటి నిర్మించిన ఈ చిత్రం అక్టోబర్ 2న విడుదల కానుండగా, కీలకమైన రొమాంటిక్ సన్నివేశాలు ఆన్లైన్లో లీకయ్యాయి. దీంతో షాక్‌కు గురైన చిత్ర యూనిట్, ఆ కంటెంట్‌ను డౌన్లోడ్ లేదా షేర్ చేయవద్దని రిక్వెస్ట్ చేశారు. సినిమాను కేవలం థియేటర్లలోనే చూసి తమకు మద్దతు తెలపాలని ప్రేక్షకులను కోరారు.
World Heart Day 2026: గుండెపోటు వస్తే మొదటి గంటలోపు చేయాల్సిన, చేయకూడని పనులివే!
మన కళ్లెదుటే మనకు బాగా కావాల్సిన వ్యక్తి ఛాతీ పట్టుకుని, ముఖం పాలిపోయి ఒక్కసారిగా కుప్పకూలిపోతే ఆ సీన్‌ను ఊహించుకోవడమే భయానకం. గుండెపోటు (Heart Attack) వచ్చినప్పుడు గడిచే ప్రతి సెకను ఎంతో విలువైనది. అయితే సరైన సమయంలో స్పందిస్తే వారి ప్రాణాల్ని ఖచ్చితంగా కాపాడుకోవచ్చు. ఆసుపత్రికి వెళ్లాక వైద్యులు చికిత్స అందించినప్పటికీ, హాస్పిటల్‌కి చేరేలోపు మొదటి గంటలో (గోల్డెన్ అవర్) మనం అందించే ప్రథమ చికిత్స ప్రాణాల్ని నిలబెట్టడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
కార్డియాక్ అరెస్ట్ రిజిస్ట్రీ (CARES) నివేదిక ప్రకారం, గుండె ఆగిపోయిన వెంటనే CPR (కార్డియో పల్మనరీ రిససిటేషన్) చేయడం వల్ల బాధితుడు బతికే అవకాశాలు రెండు నుంచి మూడు రెట్లు పెరుగుతాయి. గుండెపోటు వచ్చిన తర్వాత మొదటి గంట ఎందుకు ముఖ్యం? మొదటి గంటలో చేయాల్సిన పనులు గురించి డాక్టర్ దేబ్దత్త మజుందార్ (సీనియర్ కన్సల్టెంట్ – ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ, నారాయణ ఆర్.ఎన్. ఠాగూర్ హాస్పిటల్, ముకుందాపూర్, కోల్‌కతా) పూర్తి వివరాలు అందించారు.
ATM ఛార్జీల నుంచి బ్యాంక్ FDల వరకు.. అక్టోబర్ 1 నుంచి మారనున్న 8 అంశాలు.. మీ జేబుపై ప్రత్యక్ష ప్రభావం!
New Rules Oct 1: కొత్త నెల అక్టోబర్ 2026 ప్రారంభంతో దేశంలో పలు కీలకమైన ఆర్థిక, బ్యాంకింగ్, పన్ను నిబంధనలలో మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఈ మార్పులు సామాన్య ప్రజల రోజు వారీ బడ్జెట్ నుంచి పన్ను చెల్లింపుదారుల వరకు అందరిపై ప్రత్యక్ష ప్రబావాన్ని చూపుతాయి. అక్టోబర్ 1 నుంచి అమలులోకి రానున్న ప్రధాన 8 ఆర్థిక మార్పుల వివరాలు ఈ కథనం ద్వారా తెలుసుకుందాం.

