Home Blog Page 100

రైతులకు శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. పంటలకు మద్దతు ధర పెంపు

0
బుధవారం ప్రధాని అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రబీ పంటలకు మద్దతు ధర పెంపునకు ఆమోదం లభించింది. గోధుమలు, పప్పు ధాన్యాలకు మద్దతు ధరను పెంచినట్టు కేంద్రం ప్రకటించింది. అత్యధికంగా కుసుమ పంటకు క్వింటాల్‌కు రూ. 675 పెంచడం విశేషం. వీటితో పాటు దేశంలో క్లీన్ ఎనర్జీని ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన పీఎం ధార పథకానికి రూ. 1,84,000 కోట్లు కేటాయింపులకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది.

కశ్మీర్ లోయలో.. ‘పహల్గాం’ కీలక ఉగ్రవాది హతం.. భారీగా ఆయుధాలు స్వాధీనం..!

0
గత ఏడాది పహల్గాంలో పర్యాటకులపై దాడి చేసి 26 మంది అమాయకుల ప్రాణాలు తీసిన ఉగ్రవాదులు.. ఇప్పుడు మరో కుట్రకు తెర తీశారేమో అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పహల్గాం దాడుల కీలక అనుమానితుల్లో ఒకడు.. పాకిస్థాన్‌కు చెందిన లష్కరే ఉగ్రవాది హషిం మూసాను భద్రతా దళాలు హతం చేశాయి. బుధవారం అతడి మృతదేహంతోపాటు.. భారీ ఎత్తున ఆయుధాలను భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి.

ఇండియా కూటమి కీలక తీర్మానాలు.. అక్టోబరు 2 నుంచి 8 వరకు సేవ్ డెమొక్రాటిక్ మార్చ్

0
కేంద్ర ఎన్నికల కమిషన్ చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను వ్యతిరేకిస్తున్న ప్రతిపక్షాలు సీఈసీపై యుద్ధం ప్రకటించాయి. న్యూఢిల్లీలో బుధవారం సమావేశమైన ఇండియా కూటమి పార్టీలు.. పలు ముఖ్యమైన తీర్మానాలు చేశాయి. అక్టోబరు 2 నుంచి 8 వరకు సేవ్ డెమొక్రాటిక్ మార్చ్ పేరుతో ధర్నాలు చేయాలని నిర్ణయించారు. అలాగే, కలెక్టరేట్ల వద్ద నిరసనలు కూడా చేపట్టనున్నారు. తక్షణమే పదవికి సీఈసీ రాజీనామా చేయాలని కూటమి డిమాండ్‌ చేసింది.

కేతన్ అగర్వాల్‌ను కోటమీద నుంచి తోసేయడానికి ముందు.. బెంగళూరులోనే కాళ్లు విరగ్గొట్టాలని ప్లాన్!

0
పుణేలోని లోహగఢ్ కోట వద్ద చోటుచేసుకున్న ప్రముఖ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్య కేసులో పోలీసులు 5,053 పేజీల ఛార్జ్‌షీట్‌ దాఖలు చేశారు. అయితే ఈ ఛార్జీషీట్‌లో షాకింగ్ నిజాలు వెలుగుచూశాయి. లోయలోకి తోసి చంపడానికి ముందే కేతన్‌ను బెంగళూరుకు తీసుకెళ్లి కాళ్లు విరగ్గొట్టాలని నిందితులు పథకం వేశారని.. ఆ ప్లాన్ విఫలం కావడంతో చాట్‌జీపీటీ సాయంతో హత్యకు కుట్ర పన్నినట్లు దర్యాప్తులో తేలింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం.

కళ్యాణ వెంకటేశ్వరస్వామికి హైదరాబాద్ మహిళా భక్తుల ఖరీదైన కానుకలు.. గజ, సింహ వాహనాలు విరాళం

Hyderabad Devotees Donation To Kalyana Venkateswara Swamy Temple: శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయానికి హైదరాబాద్‌కు చెందిన భక్తులు వాహనాలను విరాళంగ అందించారు. లక్ష్మీ రెడ్డి సింహ వాహనం, దివ్య ప్రియాంక గజ వాహనాన్ని ఆలయానికి అందించారు. బంగారు పూత పూసిన రెండు వాహనాల విలువ దాదాపు రూ. 40 లక్షలు ఉంటుందని దాతలు తెలిపారు. ఈ మేరకు వాహనాలను ఆలయ స్పెషల్ గ్రేడ్ డెప్యూటీ ఈవో వరలక్ష్మికి అందించారు.

తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు గమనిక.. నవంబర్, డిసెంబర్‌లో పలు రైళ్లు రద్దు, మరికొన్ని దారి మళ్లింపు

Railway To Cancel Trains Due To Works In Renigunta Railway Station: ఏపీలో రైలు ప్రయాణికులకు ముఖ్యముఖ్యమైన గమనిక. నవంబర్, డిసెంబర్ నెలల్లో రేణిగుంట మీదుగా నడిచే కొన్ని రైళ్లను రద్దు చేయగా, మరికొన్ని దారి మళ్లించారు. రేణిగుంట రైల్వే స్టేషన్‌లో యార్డు ఆధునీకరణ పనులు జరుగుతున్నాయి. ఈ మేరకు అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రయాణికులు రైళ్లకు సంబంధించిన షెడ్యూల్‌ను గమనించాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా తిరుమలకు వెళ్లే భక్తులు అలర్ట్‌గా ఉండాలి.

పులివెందుల పర్యటనకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్.. అక్టోబర్ 5న ఫిక్స్, ఎన్నో ఏళ్ల సమస్యలకు పరిష్కారం!

AP Cm Chandrababu Pawan Kalyan Pulivendula Tour: ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌లు కలిసి మరో సారి పర్యటనకు వెళ్లబోతున్నారు. సెప్టెంబర్ 29న పల్లెపండుగ 3.0 కార్యక్రమంలో భాగంగా నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలో నిర్వహించిన కార్యక్రమానికి ఇద్దరు హాజరయ్యారు. తాజాగా సీఎం, డిప్యూటీ సీఎంలు అక్టోబర్ 5న కడప జిల్లా పులివెందుల నియోజకవర్గ పర్యటనకు వెళ్లబోతున్నారు. అక్కడ రెండు ముఖ్యమైన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టబోతున్నారు.

తిరుపతి టు విశాఖపట్నం డబుల్ డెక్కర్ రైలు.. ఇకపై 9 కోచ్‌లతో నడుస్తుంది, ప్రయాణికులకు అలర్ట్

Tirupati Visakhapatnam Double Decker Train Coaches Revised: రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. తిరుపతి-విశాఖపట్నం-తిరుపతి డబుల్ డెక్కర్ ఎక్స్‌ప్రెస్ రైలు (22708/22707) కోచ్‌లు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. నేటి నుంచి ఈ మార్పులు అమల్లోకి వస్తాయి.. గతంలో 11 కోచ్‌లతో ఈ రైలు నడవగా..ఇకపై 9 కోచ్‌లతో నడుస్తుందని అధికారులు తెలిపారు. విశాఖపట్నం నుంచి తిరుపతి వెళ్లేవారికి ఈ ఎక్స్‌ప్రెస్ రైలు ఎంతో ఉపయోగంగా ఉంటుందని చెబుతున్నారు.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

SRI KASHI NAYANA DAILY – 30 సెప్టెంబర్ 2026

ధర్మవరంలో చెడ్డీ గ్యాంగ్ కలకలం – మూడు ఇళ్లలో చోరీ యత్నం

ధన్వంతరి ఆలయంలో ఘనంగా కలశ, మండల పూజలు

గూడ్స్ షెడ్ కాలనీలో రోడ్డు వేయండి – చేనేత సంఘం

జనసేనలో 200 కుటుంబాలు చేరిక – మధుసూదన్ రెడ్డి

గొట్లూరు రైతు సేవా కేంద్రంలో వర్క్‌షాప్ – ఏడీఏ లక్ష్మా నాయక్

బాలికల పాఠశాలలో కొత్త టాయిలెట్లు, స్పీడ్ బ్రేకర్లు – మంత్రి ఆదేశం

వైసీపీ ఒక్క సీటు గెలిచినా .. రాజకీయాల నుంచి తప్పుకుంటా.. ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సవాల్

Jammalamadugu Mla Adinarayana Reddy Challenges YSRCP: కడప జిల్లా జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వైసీపీకి సవాల్ విసిరారు. జమ్మలమడుగు మున్సిపాలిటీలో వైఎస్సార్సీపీ ఒక్క కౌన్సిలర్ సీటు గెలిచినా తాను రాజకీయాల నుంచి తప్పుకుంటాను అన్నారు. వైఎస్సార్సీపీ రీల్స్, గ్రాఫిక్స్ చేస్తుందని.. కూటమి ప్రభుత్వం రియల్​గా పనిచేస్తోందన్నారు. జమ్మలమడుగులో ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంప్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల వేళ ఆదినారాయణ రెడ్డి వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.