గుజరాత్‌లోని మెహసానా జిల్లాకు చెందిన ముగ్గురు పౌరులు అమెరికాకు అక్రమ మార్గంలో వెళ్లేందుకు ప్రయత్నించి ఇథియోపియాలో ఒక్కసారిగా కనిపించకుండా పోయారు. ఏజెంట్లను నమ్మి ఒక్కొక్కరికి రూ.75 లక్షలు చెల్లించినప్పటికీ.. ఆఫ్రికా దేశంలో కిడ్నాపర్ల చేతికి చిక్కారు. అయితే వారిని విడుదల చేయాలంటే కోటి రూపాయలు ఇవ్వాలని కిడ్నాపర్లు డిమాండ్ చేస్తుండటంతో.. తమ వారిని రక్షించాలని బాధితుల కుటుంబ సభ్యులు భారత ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. అందుకు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం.
తిరిగి పార్టీలోకి రండి.. వైఎస్ జగన్ సహా కాంగ్రెస్‌ను వీడిన నేతలకు భట్టి విక్రమార్క రిక్వెస్ట్
కాంగ్రెస్‌ను వీడి ఇతర పార్టీలు స్థాపించిన వారు, వెళ్లిన వారు తిరిగి హస్తం పార్టీలో చేరాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ను వీడిన నాయకులు తిరిగి వచ్చి పార్టీ సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్లాలని కోరారు. ఈ క్రమంలోనే ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్, శరద్ పవార్, మమతా బెనర్జీలకు విజ్ఞప్తి చేశారు. తాను వైఎస్సార్‌తో కలిసి పనిచేశానని.. జగన్‌తో మాత్రం పనిచేయలేదని చెప్పారు. ఇక.. ఎస్ఐఆర్ విషయంలో ఎన్నికల సంఘంపై విమర్శలు గుప్పించిన భట్టి.. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
కేటీఆర్‌కు ముందు, తర్వాత సిరిసిల్ల ఎలా ఉందో అడిగి తెలుసుకో.. రేవంత్ రెడ్డికి హరీష్ కౌంటర్
సీఎం రేవంత్‌రెడ్డి సిరిసిల్ల పర్యటన నేపథ్యంలో మాజీ మంత్రి హరీశ్‌రావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ ఎమ్మెల్యేగా రాకముందు సిరిసిల్ల ఎలా ఉండేది.. ఆయన వచ్చిన తర్వాత ఎలాంటి మార్పులు వచ్చాయో అక్కడి ప్రజలను అడిగి తెలుసుకోవాలని సూచించారు. సిరిసిల్లలో పోలీసు బందోబస్తు, ముందస్తు నిర్బంధాలపై ప్రశ్నలు సంధించిన హరీష్ రావు అదేమైనా ఏమైనా శత్రు రాజ్యమా అంటూ మండిపడ్డారు. కాళేశ్వరం జలాలు, చెక్‌డ్యామ్‌లు, మున్సిపల్ అభివృద్ధి, నేతన్నల సంక్షేమం వంటి అంశాలను ప్రస్తావించారు. మరోవైపు సిరిసిల్ల అభివృద్ధి, పవర్లూమ్ పరిశ్రమ పరిస్థితిపై కాంగ్రెస్, బీఆర్ఎస్ భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.
ఆసియా క్రీడల్లో తెలంగాణ బిడ్డ చికితకు డబుల్ గోల్డ్.. సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు
ఆసియా క్రీడల్లో తెలంగాణకు చెందిన ఆర్చరీ క్రీడాకారిణి తానిపర్తి చికితారావు సత్తా చాటింది. ఒకేరోజు మహిళల కాంపౌండ్ టీమ్, మిక్స్డ్ కాంపౌండ్ టీమ్ ఈవెంట్లలో 2 స్వర్ణ పతకాలు సాధించి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. జ్యోతి సురేఖ, ప్రీతికా ప్రదీప్‌తో కలిసి మహిళల టీమ్ ఈవెంట్లో చైనాపై విజయం సాధించిన చికిత.. అనంతరం సాహిల్ జాదవ్‌తో కలిసి మిక్స్డ్ టీమ్‌లో దక్షిణ కొరియాను షూట్‌ఆఫ్‌లో ఓడించారు. దీంతో భారత ఆర్చర్లు ఒకేరోజు మూడు గోల్డ్ మెడల్స్ సాధించారు. చికిత ఘనతపై సీఎం రేవంత్‌రెడ్డి అభినందనలు తెలిపారు.
దేశంలో మొట్టమొదటిసారి.. మాజీ డీఎస్పీ భీమ్‌రెడ్డిపై బినామీ యాక్ట్ కింద కేసు నమోదు
దేశంలోనే తొలిసారి బినామీ యాక్ట్ కింద కేసు నమోదైంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో మాజీ డీఎస్పీ భీమ్‌రెడ్డి, ఆయన బినామీలపై మొట్టమొదటిసారి బినామీ యాక్ట్ కింద కేసులు నమోదు అయ్యాయి. గతంలో తెలంగాణ, కర్ణాటకలోని 16 ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించి రూ.200 కోట్లకు పైగా విలువైన ఆస్తులను గుర్తించాయి. ఆయన బినామీల ఇళ్లల్లో జరిగిన సోదాల్లో ఆస్తుల పత్రాలు, నగదు, బంగారం వివరాలు లభించాయి. వాటి అసలు యజమాని, ఎక్కడి నుంచి వచ్చాయి, భీమ్‌రెడ్డితో వారికి ఉన్న సంబంధాలపై ఏసీబీ, ఐటీ అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
‘చావు నోట్లో తల పెట్టయినా… మీకు గుర్తింపు తెస్తా’.. ప్యారడైజ్ నటుడు ప్రియదర్శికి హరీష్ అభినందనలు
ది ప్యారడైజ్ సినిమాలో ఎమ్మెల్యే శంకరన్న పాత్రలో నటించి ప్రేక్షక్షులను మెప్పించిన నటుడు ప్రియదర్శిపై మాజీ మంత్రి హరీశ్ రావు ప్రశంసలు కురిపించారు. కేసీఆర్ హావభావాలు, నడక, మాట తీరును సహజంగా పండించారని కొనియాడారు. ప్రియదర్శిని తన నివాసంలో కలసి సత్కరించారు. మల్లేశం, బలగం చిత్రాలతో తెలంగాణ చేనేత కార్మికుల జీవితాలు, పల్లె సంస్కృతి, కుటుంబ బంధాలను ప్రపంచానికి పరిచయం చేశారని అభినందించారు. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల, హీరో నాని సహా చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సినిమా, సంస్కృతిని ముందుకు తీసుకెళ్లే మరిన్ని గొప్ప చిత్రాలు చేయాలని ఆకాంక్షించారు.
Planet Transit In October 2026: అక్టోబర్‌లో నాలుగు అరుదైన యోగాలు.. కర్కాటకం సహా ఈ 4 రాశులకు ధనలక్ష్మీ అనుగ్రహం!
Planet Transit In October 2026: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, అక్టోబర్ నెల చాలా ముఖ్యమైన నెల కానుంది. ఈ కాలంలో ముఖ్యమైన గ్రహాలు తమ స్థానాలను మరానున్నాయి. ముందుగా నెల ప్రారంభంలో అక్టోబర్ 4న చంద్రుడు కర్కాటక రాశిలో ప్రవేశించనున్నాడు. ఈ సమయంలో దేవగురువులుగా పిలువబడే గురుడు, కుజ గ్రహాలతో కలిసి సంయోగం కారణంగా ‘త్రిగ్రాహి యోగం’ ఏర్పడనుంది. ఈ శుభ యోగం సుమారు రెండురోజుల పాటు అంటే అక్టోబర్ 6వ తేదీ వరకు ఉంటుంది. ఆ తర్వాత అక్టోబర్ 17న సూర్యుడు కన్యరాశి నుంచి నిష్క్రమించి తులా రాశిలో ప్రవేశించనున్నాడు. ఇదే రాశిలో బుధుడితో కలిసి ‘బుధాదిత్య యోగం’ ఏర్పరచనున్నాడు. అక్టోబర్ 20న శుక్రుడు తులా రాశిలోకి ప్రవేశించనున్నాడు. ఈ సమయంలో బుధుడు కూడా ఇదే రాశిలో ఉంటాడు. ఈ నేపథ్యంలో బుధుడు, శుక్ర గ్రహాల కలయిక కారణంగా ‘లక్ష్మీ నారాయణ యోగం’ఏర్పడనుంది. అంతేకాదు శుక్రుడు తన సొంత రాశిలో ‘మాళవ్య రాజయోగాన్ని ఏర్పరచనున్నాడు. ఇక నెల చివర్లో అంటే అక్టోబర్ 31న గురుడు సింహరాశిలో ప్రవేశించనున్నాడు. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, సింహ రాశికి అధిపతిగా సూర్యుడు, గురుడి మధ్య స్నేహపూర్వక సంబంధం ఉంటుంది. ఇదే నెలలో దసరా నవరాత్రులు, విజయదశమి వేడుకలు జరగునున్నాయి. ఈ శుభ సమయంలో కొన్ని రాశుల వారికి విశేష ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది. ఈ సందర్భంగా అక్టోబర్ నెలలో ప్రధాన గ్రహాల ప్రభావంతో ఏ రాశుల వారికి కలిసి రానుందో ఇప్పుడు తెలుసుకుందాం.
జాన్ క్యాంప్‌బెల్ ర్యాంపేజ్.. 65 బంతుల్లో సెంచరీ.. భారత్‌పై రికార్డు బద్దలు..!
భారత్‌తో గువహటి వేదికగా జరుగుతున్న రెండో వన్డేలో వెస్ట్ ఇండీస్ ఓపెనర్ జాన్ క్యాంప్‌బెల్ విధ్వంసక సెంచరీతో చెలరేగాడు. కేవలం 65 బంతుల్లోనే శతకం పూర్తి చేసుకుని, భారత్‌పై వన్డేల్లో అతివేగంగా సెంచరీ చేసిన వెస్టిండీస్ బ్యాటర్‌గా సరికొత్త చరిత్ర సృష్టించాడు. మొత్తంగా 68 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్సర్లతో 101 పరుగులు చేసి గుర్నూర్ బ్రార్ బౌలింగ్‌లో నమన్ ధీర్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో విధ్వంసకర ఇన్నింగ్స్‌కు తెరపడింది.
కేఎల్ రాహుల్ ‘100’ నాటౌట్.. వన్డేల్లో అరుదైన రికార్డు..!
భారత వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ తన వన్డే కెరీర్లో మైలురాయిని చేరుకోవడానికి సిద్ధమయ్యాడు. గువహటిలోని బార్సపారా క్రికెట్ స్టేడియంలో వెస్టిండీస్‌తో జరగనున్న రెండో వన్డే ద్వారా రాహుల్ తన 100వ వన్డే మ్యాచ్ ఆడనున్నాడు. ఈ ఘనత సాధించిన 38వ భారత క్రికెటర్‌గా అతను రికార్డులకెక్కనున్నాడు. ఇప్పటివరకు 99 వన్డేల్లో 49.44 సగటుతో 3,412 పరుగులు చేసిన రాహుల్ ఖాతాలో 8 సెంచరీలు, 20 అర్ధసెంచరీలు ఉన్నాయి.
మోస్ట్ వాంటెడ్ పహల్గామ్ ఉగ్రవాది అసిఫ్ మూసా హతం.. సంబరాలు చేసుకున్న జవాన్లు.. వీడియో వైరల్
ఏప్రిల్ 2025లో జరిగిన పహల్గామ్లోని బైసరన్ లోయ వద్ద పర్యాటకులపై దాడికి తెగబడిన పాకిస్థాన్ ముష్కరులు.. 26 మంది అమాయకులను పొట్టనబెట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ప్రధాన అనుమానితుల్లో ఒకడైన లష్కరే తొయిబా ఉగ్రవాది హషీమ్ ఫౌజీ అలియాస్ మూసా హతమయ్యాడు. మంగళవారం రాత్రి కశ్మీర్లో జరిగిన ఎన్కౌంటర్లో భద్రతా బలగాలు అతడ్ని మట్టుబెట్టాయి. దీంతో ఆర్మీ జవాన్లు సంతోషంతో డ్యాన్సులు చేశారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

