Home Blog Page 98

Gandhi Jayanti 2026: జననీ జన్మభూమిశ్చ.. నవభారత నిర్మాణంలో గాంధీజీ నుంచి మనం నేర్చుకోవాల్సిన 5 విజయ సూత్రాలు!

0
Gandhi Jayanti 2 October 2026 భారత స్వాతంత్ర్య సంగ్రామంలో అహింస అనే ఆయుధంతో సంచలనం సృష్టించిన మహాత్మా గాంధీ జీవితం ప్రతి యువకుడికి ఒక అద్భుతమైన మార్గదర్శి. నేటి ఆధునిక యుగంలో ఆవేశం, తీవ్ర పోటీ, ఒత్తిళ్ల మధ్య కొట్టుమిట్టాడుతున్న యువతకు ఆయన సిద్ధాంతాలు ఒక ప్రశాంతమైన దీపస్తంభంలా మార్గం చూపుతాయి. గాంధీజీ ఆలోచనలు కేవలం గతం కాదు.. రేపటి విజయానికి కావల్సిన సరికొత్త విప్లవాత్మక సాధనాలు. నైతిక విలువలతో కూడిన విజయాన్ని సాధిస్తూ సమాజంలో సానుకూల మార్పు తీసుకురావడానికి గాంధీ చూపిన బాట ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ గాంధీ జయంతి 2026 వేళ మహోన్నతమైన ఆయన జీవితం నుంచి నేటి తరం యువత నేర్చుకోవాల్సిన అంశాలను తెలుసుకుందాం..

మౌత్‌వాష్ వాడితే నోటి దుర్వాసన తగ్గి పళ్ళు తెల్లగా మారతాయా, అందరూ కచ్చితంగా మౌత్‌వాష్ వాడాలా

0
మౌత్‌వాష్‌ని ఓరల్ రిన్స్ అని అంటారు. పళ్ళు తోమాక దీనిని చివర్లో ఓ సారి పుక్కిలించడానికి వాడతారు. దీంతో నోటి నుంచి శ్వాస తాజాగా వస్తుంది. నార్మల్‌గా డెంటల్ ట్రీట్‌మెంట్ టైమ్‌లో బ్రషింగ్, ఫ్లాసింగ్‌కి సపోర్ట్‌గా నోటి శుభ్రతలో భాగంగా మౌత్‌వాష్‌ని వాడుతుంటారు. దీనిని వాడడం వల్ల ప్లాక్‌ తగ్గి చిగుళ్ల ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. అంతేకాకుండా, దంతక్షయం, దుర్వాసన నుండి అదనపు రక్షణ కూడా అందుతుంది. డెంటల్ కేర్‌లో మౌత్‌వాష్‌ని వాడడం వల్ల నోటి శుభ్రతతో పాటు డెంటల్‌ హెల్త్ బాగుంటుందని చెబుతుంటారు. అసలు మౌత్‌‌వాష్‌లో ఎన్ని రకాలు ఉంటాయి, ఉంటే ఏయే సమస్యలకి దేనిని వాడాలి? నోటి శుభ్రతలో మౌత్‌వాష్ పాత్ర ఎంత? సరైన విధంగా మౌత్‌‌వాష్‌ని వాడడం ఎలా, మౌత్‌వాష్‌తో ఏమైనా సమస్యలొస్తాయా ఇలాంటి ముఖ్య విషయాల గురించి డాక్టర్ సింధూ యూ ముక్తామత్(HOD డెంటల్ సైన్స్, ఆస్టర్ వైట్‌ఫీల్డ్ హాస్పిటల్) చెబుతున్నారు.

బ్లడ్ షుగర్, జీర్ణసమస్యల్ని తగ్గించే ఫైబర్ ఫుడ్, రోజూ ఏ ఫుడ్స్ తింటే ప్రాబ్లమ్స్ నుంచి తప్పించుకోవచ్చో తెలుసా

0
ఫైబర్ ఫుడ్ మన పొట్టకి, మనకి చాలా మంచిదని చెబుతారు. అందుకే, ఫైబర్ ఎక్కువగా ఉండే పండ్లు, కూరగాయలు, గ్రెయిన్స్, లెగ్యూమ్స్ వంటి ప్లాంట్ బేస్డ్ ఫుడ్స్ తీసుకోవాలని చెబుతారు. వీటిని తీసుకోవడం వల్ల మలబద్ధకం తగ్గడం నుంచి మరెన్నో సమస్యలకి హెల్ప్ అవుతాయి. ఫైబర్ ఫుడ్ తీసుకుంటే షుగర్, గుండె సమస్యలు, కొన్ని రకాల క్యాన్సర్ల ప్రమాదాలన్ని తగ్గించడానికి హెల్ప్ చేస్తాయి. అయితే, ఇక్కడ ఓ విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఫైబర్ ఉండే టేస్టీ ఫుడ్స్ తీసుకోవడం కాకుండా.. మీ బాడీకి సరిపోయే విధంగా ఎంత శాతంలో ఫైబర్ తీసుకోవాలో తెలుసుకుని తీరాలి. వాటిని మీ డైట్‌లో ఎలా యాడ్ చేసుకోవాలో తెలుసుకోవాలి. దీనికోసం డాక్టర్ సలహా తీసుకోవాలి. అదే విధంగా అసలు మనం ఫైబర్ తీసుకుంటే జీర్ణక్రియ నుండి బ్లడ్ షుగర్ వరకూ ఏయే లాభాలు ఉంటాయో డాక్టర్ ఎస్తేర్ సతియరాజ్(హెచ్‌ఓడి, డిపార్ట్‌మెంట్ ఆఫ్ న్యూట్రిషన్ డైటెటిక్స్, హెచ్‌సిజి క్యాన్సర్ హాస్పిటల్, కేఆర్ రోడ్, బెంగళూరు) చెబుతున్నారు.

ట్యాక్స్ ఆడిట్ గడువు అక్టోబర్ 21కి పెంపు.. ఇప్పుడే ఫైల్ చేయాలా? వేచి చూడాలా? ట్యాక్స్ పేయర్లు తెలుసుకోవాల్సిన విషయాలు

0
Tax Audit Deadline: ట్యాక్స్ ఆడిట్ గడువు పెంచుతూ కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు ఇటీవలే నిర్ణయం తీసుకుంది. ట్యాక్స్ ఆడిట్ గడువును అక్టోబర్ 21కి పెంచారు. అలాగే ఐటీఆర్ ఫైలింగ్ గడువును నవంబర్ 21 వరకు పెంచారు. ట్యాక్స్ పేయర్లకు ఇది మంచి అవకాశంగా చెప్పవచ్చు. ఈ క్రమంలో ట్యాక్స్ ఆడిట్ నివేదిక, ఐటీఆర్ ఫైల్ చేయాలా? లేదా వేచి ఉండాలా? అనేది ఈ కథనం ద్వారా తెలుసుకుందాం.

Apple Pay: పిన్, ఓటీపీ లేకుండానే పేమెంట్స్.. యాపిల్ పే భారత్‌లోకి వచ్చేసింది.. ఎలా పని చేస్తుందంటే?

0
Apple Pay: ప్రపంచ టెక్ దిగ్గజం యాపిల్ సంస్థ తన డిజిటల్ చెల్లింపుల సేవ యాపిల్ పే భారత్‌లోకి తీసుకొచ్చింది. యాక్సిస్ బ్యాంక్ భాగస్వామ్యంతో అధికారికంగా భారతదేశంలో అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా పిన్, ఓటీపీ లేకుండానే చాలా వేగంగా, సులభంగా పేమెంట్లు చేయవచ్చని తెలిపింది. ప్రస్తుత లిమిటెడ్ కస్టమర్లకు మాత్రమే ఈ యాపిల్ పే అందుబాటులో ఉంటుంది. మరి అందుకు సంబంధించిన వివరాలు తెలుసుకుందాం.

Small Cap Funds: 6 నెలల్లోనే పెట్టుబడి డబుల్.. అదరగొట్టిన 36 స్మాల్ క్యాప్ ఫండ్స్.. లిస్ట్‌లో దిగ్గజ ఏఎంసీల స్కీమ్స్!

0
Small Cap Funds: స్మాల్ క్యాప్ కేటగిరీలోని 36 ఫండ్స్ తమ ఇన్వెస్టర్ల సంపదను కేవలం ఆరు నెలల కాలంలోనే రెండింతలు చేశాయి. ఇన్వెస్టర్లపై కాసుల వర్షం కురిపించాయి. సగటున 25.20 శాతం చొప్పున రాబడులు ఇచ్చాయి. కనిష్ఠ స్థాయుల నుంచి రికవరీ అయినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఈ క్రమంలో తమ సిప్ పెట్టుబడులను కొనసాగించాలని ఫైనాన్షియల్ నిపుణులు సూచిస్తున్నారు. మరి ఈ స్మాల్ క్యాప్ ఫండ్స్ గురించిన వివరాలు తెలుసుకుందాం.

Bonus Shares: ఈ కంపెనీలో 1 షేరు కొంటే 2 షేర్లు బోనస్.. అక్టోబర్ 7లోపు కొన్నవారికే ఛాన్స్.. 100 షేర్లకు 300 షేర్లొస్తాయ్!

0
Bonus Shares: ఇంజనీరింగ్ సెక్టార్లోని స్మాల్ క్యాప్ కేటగిరి కంపెనీ GTV ఇంజనీరింగ్ లిమిటెడ్ బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ బంపర్ ఆఫర్ తీసుకొచ్చారు. ఈ కంపెనీ షేర్ హోల్డర్స్ కోసం 2:1 రేషియోలో బోనస్ షేర్లు జారీ చేయాలని నిర్ణయించారు. రికార్డు డేట్ అక్టోబర్ 7గా నిర్ణయించారు. ఆలోపు షేర్లు కొన్నవారికి రెంటింపు అవుతాయి. 1 షేరు కొంటే 2 షేర్లు, 100 షేర్లు కొంటే 200 షేర్లు బోనస్ రూపంలో వస్తాయి. మరి ఆ వివరాలు తెలుసుకుందాం.

Vinod Adani: గౌతమ్ అదానీ సోదరుడికి క్లీన్ చిట్.. ఆరోపణలు కొట్టేసిన సెబీ.. మరో 11 మందికీ ఉపశమనం!

0
Vinod Adani: అదానీ గ్రూప్ కంపెనీ అధినేత గౌతమ్ అదానీ సోదరుడు వినోద్ అదానీకి బిగ్ రిలీఫ్ లభించింది. విదేశీ నిధుల అక్రమ రవాణా ఆరోపణలను కొట్టి వేస్తూ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ కీలక నిర్ణయం తీసుకుంది. అదానీ గ్రూప్ లోని 4 కంపెనీల్లో పెట్టుబడులపై ఆరోపణలు రాగా తాజాగా ఉపశమనం లభించినట్లయింది.

పాకిస్థాన్‌ బ్లాక్‌మెయిలింగ్‌కు చెక్ పెట్టేందుకు.. చైనా సాయం తీసుకోనున్న ఇండియా.. ఈ సవాళ్లు లేకపోలేదు!

2025 ఏప్రిల్ నుంచి భారత విమానయాన సంస్థలకు తన గగనతలాన్ని మూసేసిన పాకిస్థాన్.. మరోసారి ఈ నిషేధం గడువును పొడిగించింది. దీంతో యూరప్, మధ్య ఆసియా, అమెరికా తదితర దేశాలకు వెళ్లే భారత విమానాలు పాకిస్థాన్ గగనతలాన్ని తప్పించి, చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తోంది. దీని వల్ల ప్రయాణ సమయం, ఆర్థిక భారం పెరుగుతోంది. గగనతలాన్ని మూసేయడం ద్వారా మనపై ఒత్తిడి పెంచాలని ప్రయత్నిస్తోన్న పాకిస్థాన్‌కు చెక్ పెట్టడం కోసం చైనా సాయం తీసుకోవాలని భారత్ భావిస్తోంది.

దుబాయ్- టెల్ అవీవ్ విమానం హైజాక్ కాదు.. కాక్‌పీట్‌లో ఇద్దరు పైలట్ల మధ్య ఘర్షణతోనే వార్నింగ్

యూఏఈ నుంచి ఇజ్రాయెల్‌కు వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానంలో మొదట ఎమర్జెన్సీ సంకేతాలు వచ్చి, తర్వాత హైజాక్‌ కోడ్‌ రావడం కలకలం రేపింది. సౌదీ అరేబియా గగనతలం మీదుగా ఈ విమానం ప్రయాణిస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో అధికారులు తక్షణమే విమానాన్ని సౌదీలోని తబుక్ సైనిక స్థావరానికి మళ్లించి, అత్యవసరంగా దింపేశారు. అంతేకాదు, ముందస్తు జాగ్రత్తగా యుద్ధ విమానాలను ఇజ్రాయెల్ పంపింది. అయితే, చివరకు ఇది పైలట్ల మధ్య జరిగిన ఘర్షణ అని తేలడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.