మౌత్‌వాష్‌ని ఓరల్ రిన్స్ అని అంటారు. పళ్ళు తోమాక దీనిని చివర్లో ఓ సారి పుక్కిలించడానికి వాడతారు. దీంతో నోటి నుంచి శ్వాస తాజాగా వస్తుంది. నార్మల్‌గా డెంటల్ ట్రీట్‌మెంట్ టైమ్‌లో బ్రషింగ్, ఫ్లాసింగ్‌కి సపోర్ట్‌గా నోటి శుభ్రతలో భాగంగా మౌత్‌వాష్‌ని వాడుతుంటారు. దీనిని వాడడం వల్ల ప్లాక్ తగ్గి చిగుళ్ల ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. అంతేకాకుండా, దంతక్షయం, దుర్వాసన నుండి అదనపు రక్షణ కూడా అందుతుంది. డెంటల్ కేర్‌లో మౌత్‌వాష్‌ని వాడడం వల్ల నోటి శుభ్రతతో పాటు డెంటల్ హెల్త్ బాగుంటుందని చెబుతుంటారు. అసలు మౌత్‌వాష్‌లో ఎన్ని రకాలు ఉంటాయి, ఉంటే ఏయే సమస్యలకి దేనిని వాడాలి? నోటి శుభ్రతలో మౌత్‌వాష్ పాత్ర ఎంత? సరైన విధంగా మౌత్‌వాష్‌ని వాడడం ఎలా, మౌత్‌వాష్‌తో ఏమైనా సమస్యలొస్తాయా ఇలాంటి ముఖ్య విషయాల గురించి డాక్టర్ సింధూ యూ ముక్తామత్(HOD డెంటల్ సైన్స్, ఆస్టర్ వైట్‌ఫీల్డ్ హాస్పిటల్) చెబుతున్నారు.


