మీ జీర్ణశక్తి మెరుగుపడి కడుపు ఉబ్బరం, విరేచనాలు, గ్యాస్ సమస్యలు తగ్గాలంటే ఇంట్లో ఈ మొక్కలు పెంచి వాటి ఆకులు తినడం మంచిది. అవేంటో చూద్దాం.
ప్రభాస్ ‘మిర్చి’ మూవీకి టికెట్స్ ఇవ్వలేదని ఆ థియేటర్‌నే కొనేశా: ‘అనకాపల్లి’ నిర్మాత కాండ్రేగుల నాయుడు
విక్రమ్ సహిదేవ్, సంధ్యా వశిష్ట ప్రధాన పాత్రలో నటించిన ‘అనకాపల్లి’ చిత్రం అక్టోబర్ 2న విడుదల కానుంది. ప్రమోషన్లలో భాగంగా నిర్మాత కాండ్రేగుల నాయుడు తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. గతంలో ప్రభాస్ ‘మిర్చి’ సినిమా టికెట్లు దొరక్క నిరాశ చెంది, అనకాపల్లిలోని థియేటర్‌నే కొనుగోలు చేశానని తెలిపారు. ఇప్పుడు అదే థియేటర్లలో తాను నిర్మించిన సినిమాను ప్రదర్శించడం సంతోషంగా ఉందన్నారు. త్రినాథరావు నక్కిన కథందించిన ఈ చిత్రాన్ని మైత్రి డిస్ట్రిబ్యూషన్స్ విడుదల చేస్తోంది.
కోలుకుంటున్న ‘గబ్బర్ సింగ్’ రమేశ్… పెద్ద మనసుతో ఆర్థిక సాయం చేసిన ‘కాంచన’ ఫేమ్ శ్రీమాన్
పవన్ కల్యాణ్ బ్లాక్‌బస్టర్ చిత్రం ‘గబ్బర్ సింగ్’లో విలన్ అంత్యాక్షరి గ్యాంగ్ సభ్యుడిగా అలరించిన నటుడు రమేశ్ తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం వైద్యుల నిరంతర పర్యవేక్షణలో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతోంది. కాగా, రమేశ్ పరిస్థితి తెలుసుకున్న ‘కాంచన’ ఫేమ్ నటుడు శ్రీమాన్ వెంటనే స్పందించి వైద్య ఖర్చుల నిమిత్తం రూ.25 వేల ఆర్థిక సాయం అందించారు. గతంలో వీరిద్దరూ కలిసి ఓ సినిమాలో నటించారు. ఆపదలో ఉన్న తోటి నటుడికి పెద్ద మనసుతో అండగా నిలిచిన శ్రీమాన్‌కు ‘గబ్బర్ సింగ్’ గ్యాంగ్ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు
అక్టోబర్ 2న థియేటర్లలో రసవత్తర పోరు.. బరిలో ఐదు క్రేజీ సినిమాలు, విన్నర్ ఎవరో?
గాంధీ జయంతి సందర్భంగా బాక్సాఫీస్ వద్ద తీవ్రమైన పోటీ నెలకొంది. అక్టోబర్ 2న ఫహాద్ ఫాజిల్ ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’, సందీప్ కిషన్ ‘సిగ్మా’, కీర్తి సురేష్ ‘డోరతి’లతో పాటు ‘అనకాపల్లి’, ‘తెల్ల కాగితం’ చిత్రాలు విడుదలవుతున్నాయి. ఫహాద్ సినిమాకు ఫ్యామిలీ టాక్, ‘సిగ్మా’కు యూత్ ఆధరణ కీలకంగా మారగా, ‘డోరతి’ ఇప్పటికే మిక్స్డ్ టాక్‌తో వస్తోంది. చిన్న చిత్రాలు సైతం తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటుండగా, మరోవైపు ‘ది ప్యారడైజ్’ కూడా కొనసాగుతోంది. ఈ పోటీలో తొలి రోజు ఓపెనింగ్స్ కంటే, వీకెండ్ మౌత్ టాకే విజేతను నిర్ణయించనుంది.
ఏఐ కంపెనీపై ఊర్వశి రౌతేలా రూ.7 వేల కోట్ల దావా… కామెడీ చేయొద్దంటూ సీఈవో కౌంటర్
బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా, లాస్ ఏంజెల్స్‌కు చెందిన ఓ ఏఐ సంస్థపై న్యాయపోరాటానికి దిగారు. తన అనుమతి లేకుండా పేరు, ఫొటోలు, వీడియోలను వాణిజ్య ప్రయోజనాలకు వాడుకున్నారంటూ రూ.7,000 కోట్ల నష్టపరిహారం డిమాండ్ చేస్తూ లీగల్ నోటీసులు పంపించారు. దీనిపై ‘బాలీవుడ్.AI’ సీఈఓ షీరాజ్ హసన్ ఘాటుగా స్పందించారు. ఈ దావా పూర్తిగా హాస్యాస్పదమని కొట్టిపారేస్తూ.. “ముందు ఏఐపై అవగాహన పెంచుకో, నోటికొచ్చినట్లు మాట్లాడకు.. భవిష్యత్తు మొత్తం వర్చువల్ నటీనటులు, ఏఐ స్టార్స్‌దే” అంటూ కౌంటర్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ పరిహారం వ్యవహారం సినీ, టెక్ వర్గాల్లో తీవ్ర సంచలనంగా మారింది.
‘ఆర్ఆర్ఆర్’లో మెయిన్ హీరో ఎవరు?.. మళ్లీ రేగిన పాత వివాదం, నెట్టింట భారీగా ఫ్యాన్ వార్
ఎస్.ఎస్. రాజమౌళి గ్లోబల్ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ విడుదలై ఏళ్లు గడుస్తున్నా, “మెయిన్ హీరో ఎవరు?” అనే వివాదం మళ్లీ రాజుకుంది. ఎలన్ మస్క్‌కు చెందిన ‘గ్రోక్ AI’ బాట్‌ను నెటిజన్లు ప్రశ్నించగా, జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే ప్రధాన కథానాయకుడని సమాధానమివ్వడం దుమారం రేపింది. దీనికితోడు తాజా ఈవెంట్లో తారక్ పులి ఎంట్రీ ఏవీని, రామ్ చరణ్ పులిని కొట్టే సీన్‌తో కొందరు మార్ఫింగ్ చేస్తూ ట్రోల్ చేయడంతో ఇరువర్గాల అభిమానుల మధ్య సోషల్ మీడియాలో భారీ యుద్ధం మొదలైంది. అయితే దర్శకుడు రాజమౌళి ఇద్దరికీ సమాన ప్రాధాన్యతనిచ్చి తీర్చిదిద్దారని, ఇలాంటి ఫ్యాన్ వార్స్ అనవసరమని విశ్లేషకులు చెబుతున్నారు.
అధికారాన్ని కోల్పోయిన బీఆర్ఎస్.. ఈ వెయ్యి రోజుల్లో ఏం చేసింది..? ప్రతిపక్ష పాత్రను ఎంతవరకు నిలబెట్టుకుంది?
తెలంగాణలో వరుసగా రెండుసార్లు అధికారంలోకి వచ్చిన కేసీఆర్ పార్టీ.. మూడోసారి గెలిచి హ్యాట్రిక్ సాధిస్తుందని ఆ పార్టీ నేతలు బలంగా నమ్మారు. కానీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఆ పార్టీకి ప్రతికూలంగా మారింది. 2023 చివర్లో జరిగిన ఎన్నికల్లో 39 స్థానాలకే పరిమితమైన బీఆర్ఎస్ అధికారాన్ని కోల్పోయి ప్రతిపక్ష పాత్రకు పరిమితం కావాల్సి వచ్చింది. లోక్ సభ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవలేకపోయినప్పటికీ.. మున్సిపల్ ఎన్నికల్లో మాత్రం మంచి స్థానాలే గెలుచుకుంది.
జిమ్‌లో పీవి సింధు వర్కౌట్, కాళ్ళలో బలాన్ని పెంచుకోవడానికి లెగ్ గ్లూట్ బ్రిడ్జ్ వర్కౌట్ చేసిన బ్యాడ్మింటన్ స్టార్
బ్యాడ్మింటన్ ఛాంపియన్ బెంచ్‌పై తన బాడీని ఉంచి ఓ కాలుని ఎత్తైన ప్లాట్‌ఫామ్‌పై ఉంచి సింగిల్ లెగ్ హిప్ థ్రస్ట్‌తో పాటు సింగిల్ లెగ్ గ్లూట్ బ్రిడ్జ్ వర్కౌట్స్ చేసి ఆ వీడియోని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.
ఫిట్‌గా ఉండడం ప్రతీ ఒక్కరి బాధ్యత. కానీ, మనం కాస్తా ఏమరపాటుగా ఉన్నా సెలబ్రిటీలు మాత్రం ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఫిట్నెస్ కోసం వర్కౌట్స్ చేయడం మానరు. అందుకే, రోజులో గంటల సమయం జిమ్‌లోనే గడుపుతారు. అందులో భాగంగానే జిమ్‌లో వర్కౌట్ చేసిన వీడియోని ఫ్యాన్స్‌తో పంచుకుంది పీవి సింధు.ఆమె చేసిన వర్కౌట్స్ గురించి వాటితో వచ్చే లాభాల గురించి ఇప్పుడు చూద్దాం.
ఫిట్‌గా ఉండడం ప్రతీ ఒక్కరి బాధ్యత. కానీ, మనం కాస్తా ఏమరపాటుగా ఉన్నా సెలబ్రిటీలు మాత్రం ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఫిట్నెస్ కోసం వర్కౌట్స్ చేయడం మానరు. అందుకే, రోజులో గంటల సమయం జిమ్‌లోనే గడుపుతారు. అందులో భాగంగానే జిమ్‌లో వర్కౌట్ చేసిన వీడియోని ఫ్యాన్స్‌తో పంచుకుంది పీవి సింధు.ఆమె చేసిన వర్కౌట్స్ గురించి వాటితో వచ్చే లాభాల గురించి ఇప్పుడు చూద్దాం.
Pregnancy EDD: 9 నెలలా లేక 40 వారాలా? అసలు లెక్క ఎలా వేస్తారో క్లియర్‌గా చెప్పిన డాక్టర్
గర్భం దాల్చిన మొదటి 8–12 వారాల్లో చేసే అల్ట్రాసౌండ్ స్కాన్ ద్వారా డ్యూ డేట్‌ను చాలా కచ్చితంగా లెక్కించవచ్చు. క్రమం తప్పిన పీరియడ్స్ ఉన్నవారికి ఇది చాలా ముఖ్యం. లేకపోతే డ్యూ డేట్ లెక్క తప్పి, సాధారణ ప్రెగ్నెన్సీని కూడా తప్పుగా ‘గడువు దాటింది’ అని భావించే ప్రమాదం ఉంటుంది. గర్భం 28 వారాలు దాటినప్పటి నుండి బిడ్డ కదలికలపై నిఘా ఉంచాలి. ముఖ్యంగా భోజనం చేసిన తర్వాత లేదా విశ్రాంతి తీసుకునే సమయంలో 2 గంటల్లో కనీసం 10 కదలికలు ఉండేలా చూసుకోవాలి. కదలికలు తగ్గినా లేదా ఏమాత్రం తేడాగా అనిపించినా డాక్టర్‌ను సంప్రదించాలి.

