Home Blog Page 96

సచిన్ రికార్డు బద్దలు కొట్టిన రోహిత్ శర్మ..!

0
వెస్ట్ ఇండీస్‌తో గౌహతిలో జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్‌లో రోహిత్ శర్మ సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొట్టాడు. వన్డే క్రికెట్‌లో అత్యంత వేగంగా 12,000 పరుగులు పూర్తి చేసిన రెండో బ్యాటర్‌గా ఆల్-టైమ్ రికార్డు సృష్టించాడు. సచిన్ 300 ఇన్నింగ్స్‌ల్లో ఈ మైలురాయిని చేరగా, రోహిత్ కేవలం 282 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఘనత సాధించాడు. మొదటి స్థానంలో 242 ఇన్నింగ్స్‌లతో విరాట్ కోహ్లీ కొనసాగుతున్నాడు. ఈ ఇన్నింగ్స్‌లో రోహిత్ వన్డేల్లో తన 35వ సెంచరీ సాధించాడు.

3 సెంచరీలు.. 405/7 రన్స్.. భారత్‌తో మ్యాచ్‌లో వెస్టిండీస్ బ్యాటర్ల విధ్వంసం..!

0
గువహటి వన్డేలో వెస్టిండీస్ బ్యాటర్లు చెలరేగిపోయారు. ఈ మ్యాచ్‌లో భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తొలుత టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్.. ఏకంగా 405 పరుగులు సాధించింది. ఆ జట్టులో క్యాంప్‌బెల్, షై హోప్, అమీర్ జాంగో సెంచరీలతో సత్తాచాటారు. 3 వన్డేల సిరీస్‌లో భారత్ ప్రస్తుతం 1-0తో ఆధిక్యంలో ఉంది. గత మ్యాచ్‌లో భారీ సెంచరీతో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సత్తాచాటాడు.

ఫ్లైదుబాయ్ విమానంలో కో-పైలట్‌తో పోరాడి 180 మందిని కాపాడిన భారతీయ కెప్టెన్.. ఎవరీ స్మిత్ మచ్ఛర్?

0
ఫ్లైదుబాయ్ ఎయిర్‌లైన్స్ విమానం బుధవారం దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఇజ్రాయెల్‌ రాజధాని టెల్ అవీవ్‌లోని బెన్ గురియన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్తున్న సమయంలో ఘర్షణ చోటుచేసుకుంది. విమానం గాల్లో ఉండగానే.. ఒక పైలట్ విమానం వ్యవస్థను దెబ్బతీయడానికి ప్రయత్నించాడు. దీంతో అతడ్ని భారత పౌరుడైన కెప్టెన్ స్మిత్ మచ్ఛార్ అడ్డుకోవడానికి ప్రయత్నించగా, కత్తితో పొడిచాడు. అయినాసరే అతడు మాత్రం పోరాటం సాగించి, కో-పైలట్‌ను నిలువరించాడు. దీంతో అతడిపై ప్రశంసలు కురుస్తున్నాయి.

మీరట్ ‘ప్లాస్టిక్ డ్రమ్ము’ కేసు.. భార్య ముస్కాన్, ఆమె ప్రియుడ్ని దోషులుగా నిర్దారించిన కోర్టు

0
మర్చంట్ నేవీ మాజీ అధికారిని భార్య, తన ప్రియుడితో కలిసి అత్యంత దారుణంగా హత్యచేసింది. శవాన్ని ముక్కలు చేసి, తన బాత్రూమ్‌లోని బ్లూ ప్లాస్టిక్ డ్రమ్ములో పడేసి, సిమెంట్‌తో కాంక్రీట్ వేసింది. గతేడాది మార్చిలో వెలుగులోకి వచ్చిన ఈ ఘటన దేశం మొత్తాన్ని షాక్‌కు గురిచేసింది. క్రూరంగా భర్తను చంపిన ఆమెకు మరణ శిక్ష విధించాలని కోరుతున్నారు. తాజాగా, ఈ కేసులో నిందితులు ఇద్దర్నీ కోర్టు దోషులుగా నిర్దారిస్తూ తీర్పు చెప్పింది.

అన్ని కేసులను సీబీఐకీ అప్పగించడం బెటర్.. యూపీ పోలీసులపై సుప్రీం కోర్టు తీవ్ర వ్యాఖ్యలు

0
ఓ కేసులో నిందితుడ్ని ఘటనా స్థలిలోనే ఫిర్యాదుదారు పట్టుకుని పోలీసులకు అప్పగించినా.. ఎఫ్ఐఆర్ నమోదుచేయలేదనే ఆరోపణల కేసులో సుప్రీం కోర్టు తీవ్రంగా స్పందించింది. ఈ విషయంలో యూపీ పోలీసులకు ఓ ఎజెండా ఉంటుందని, దాని ప్రకారమే వాళ్లు దర్యాప్తులు కొనసాగుతాయని వ్యాఖ్యానించింది. ఇలాగైతే ప్రజలకు పోలీసులపై ఎలా విశ్వాసం కలుగుతుందని తలంటింది. అంతేకాదు, తాము తలచుకుంటే పోలీసు వ్యవస్థను రద్దుచేసి, కేసులన్నింటిని సీబీఐకి అప్పగించగలమని కోర్టు వార్నింగ్ ఇవ్వడం చెప్పుకోదగ్గ పరిణామం.

వైసీపీ కార్యకర్తలకు జగన్ భరోసా.. ప్రమాదవశాత్తూ మృతిచెందినవారి కుటుంబాలకు రూ.5 లక్షల ఆర్థిక సాయం

పార్టీ కోసం కష్టపడి పనిచేస్తూ, వివిధ కమిటీల్లో బాధ్యతలు నిర్వహిస్తూ అకస్మాత్తుగా లేదా ప్రమాదవశాత్తు మరణించే నాయకులు, కార్యకర్తల కుటుంబాలకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆర్థిక సాయం అందజేయాలని నిర్ణయం తీసుకున్నారు. పార్టీ నుంచి రూ. 5 లక్షల అందించనున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ కార్యక్రమం అక్టోబరు 1, 2026 నుంచి అమల్లోకి వస్తుందని ఓ ప్రకటనలో తెలిపారు. అయితే, ఆర్థిక సాయం పొందాలంటే కొన్ని డాక్యుమెంట్లను సమర్పించాల్సి ఉంటుంది.

ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు ఐఐటీ, ఐఐఎంలతో శిక్షణ.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

మిషన్ కర్మయోగి ద్వారా ప్రభుత్వ ఉద్యోగుల కెపాసిటి బిల్డింగ్‌లో ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా నిలిచింది. ఐగాట్-కర్మయోగి ప్లాట్‌ఫామ్ ద్వారా రెండు కోట్ల సామర్థ్య పెంపు కోర్సులను పూర్తి చేసినట్టు అధికారులు తెలిపారు. దక్షిణాది రాష్ట్రాల్లో ఏపీ మొదటి వరుసలో నిలిచింది. విజయవాడలో నిర్వహించిన ప్రాంతీయ మిషన్ కర్మయోగి వర్క్‌షాప్‌లో ఆంధ్రప్రదేశ్ అవార్డు అందుకుంది. తర్వాతి స్థానంలో కర్ణాటక, ఒడిశా నిలిచాయి. అయితే, ఉద్యోగులకు మరింత నైపుణ్యాల శిక్షణ కోసం ఐఐటీ, ఐఐఎంలతో ఒప్పందాలు చేసుకోవాలని సీఎం సూచించారు.

ఇల్లు విశాలంగా కనిపించేలా చేసే టిప్స్‌

0
మీ ఇంటిని విశాలంగా కనిపించేలా చేసే కొన్ని సింపుల్‌ చిట్కాల గురించి ఇక్కడ వివరించాం. ఈ టిప్స్‌ ప్రకారం ఇంటిని సర్దుకుంటే ఇల్లు వెడల్పుగా కనిపిస్తుంది.

నయా ట్రెండ్‌ స్లగ్గింగ్‌తో చర్మానికి కలిగే ప్రయోజనాలు

0
చర్మ సంరక్షణ విషయంలో నిత్యం కొత్త కొత్త ట్రెండ్‌లు వస్తూనే ఉంటాయి. అయితే వాటిలో స్లగ్గింగ్‌ ఫాలో అవ్వడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇక్కడ వివరించాం.

30 ఏళ్ల తర్వాత కండరాల బలహీనతకు కారణాలు

0
వయసు పెరిగినా మీ కండరాలు బలంగా ఉండాలా. అయితే ఈ అలవాట్లు కచ్చితంగా ఫాలో అవ్వండి. కండరాల బలహీనత నుంచి కాపాడుకోండి.