D2M Prasar Bharati: మొబైల్ యూజర్లకు గుడ్‌న్యూస్. ఇక నుంచి ఇంటర్నెట్ లేకుండానే స్మార్ట్ ఫోన్లో లైవ్ టీవీ ఛానల్స్ వీక్షించవచ్చు. డీ2ఎం టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం వేగంగా చర్యలు చేపడుతోంది. మరి అందుకు సంబంధించిన వివరాలు తెలుసుకుందాం.
కేసీఆర్ ఫ్యామిలీకి విదేశాల్లో భారీగా పెట్టుబడులు.. ఏపీ వ్యక్తుల ఆస్తులు ఎలా బదిలీ అయ్యాయి: రేవంత్ రెడ్డి
కేసీఆర్ కుటుంబ ఆస్తుల వ్యవహారంపై సీఎం రేవంత్‌రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ధైర్యముంటే శ్వేతపత్రం విడుదల చేయాలని సవాల్ చేశారు. హైదరాబాద్‌లోని హోటళ్లు, సర్వీస్ అపార్ట్మెంట్లు ఎవరివి అని ప్రశ్నించారు. ఏపీకి చెందిన వ్యక్తుల పేరిట ఉన్న భారీ విలువైన ఆస్తులు కొద్ది కాలంలో కేసీఆర్ కుటుంబ సభ్యుల పేర్లకు ఎలా బదిలీ అయ్యాయని నిలదీశారు. కేసీఆర్ ఫ్యామిలీకి విదేశాల్లో భారీగా పెట్టుబడులు ఉన్నాయని ఆరోపించారు. ఎర్రవల్లి భూములు, ఇతర ఆస్తులపై త్వరలో పార్ట్-2లో మరిన్ని వివరాలు వెల్లడిస్తానని సీఎం తెలిపారు.
సిరిసిల్ల గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగురవేసిన మొనగాడికి మంత్రి పదవి.. సీఎం రేవంత్ కీలక ప్రకటన
సిరిసిల్ల ప్రజాపాలన బహిరంగ సభలో సీఎం రేవంత్‌రెడ్డి కీలక ప్రకటన చేశారు. సిరిసిల్ల గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగురవేసే నాయకుడిని భవిష్యత్తులో మంత్రివర్గంలోకి తీసుకుంటానని తెలిపారు. అదే సమయంలో గత బీఆర్ఎస్ పాలన, కేసీఆర్ కుటుంబం, కేటీఆర్‌పై తీవ్ర విమర్శలు చేశారు. సిరిసిల్లను ఉరిసిల్లగా మార్చారని ఆరోపిస్తూ నేత కార్మికుల ఆత్మహత్యలు, గల్ఫ్ వలసలు, చేనేత రంగం పరిస్థితిని ప్రస్తావించారు. సిరిసిల్లలో కాంగ్రెస్ జెండా ఎగరేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిస్తూ.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పద్మశాలి సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం కల్పించాలని కోరారు.
బొగ్గు, నీళ్లు, స్థలం మనది.. రాజస్థాన్‌తో ఒప్పందం ఎందుకు.. రేవంత్ రెడ్డికి హరీష్ రావు సూటి ప్రశ్న?
సింగరేణి ఆధ్వర్యంలోని జైపూర్ థర్మల్ పవర్ ప్లాంట్ విస్తరణలో రాజస్థాన్‌కు విద్యుత్ కేటాయింపుపై మాజీ మంత్రి హరీశ్‌రావు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డికి బహిరంగ లేఖ రాసిన ఆయన.. తెలంగాణలోని బొగ్గు, నీరు, భూమి వనరులతో ఉత్పత్తయ్యే విద్యుత్‌లో 800 మెగావాట్లను రాజస్థాన్‌కు కేటాయించాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. సింగరేణి పెట్టుబడులను ఇతర రాష్ట్రాల ప్రయోజనాలకు మళ్లిస్తున్నారని ఆరోపించారు.
చాక్లెట్ల రూపంలో కొకైన్ దందా.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో రూ.24 కోట్ల డ్రగ్స్ స్వాధీనం
శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా కొకైన్ పట్టుబడింది. దోహా నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడిపై అనుమానం రావడంతో అధికారులు అతని లగేజీని తనిఖీ చేయగా.. భారీగా మత్తు పదార్థాలు దొరికాయి. ఈ తనిఖీల్లో చాక్లెట్ల రూపంలో దాచిన డ్రగ్స్ బయటపడటంతో అధికారులు షాక్ అయ్యారు. స్వాధీనం చేసుకున్న కొకైన్ మార్కెట్ విలువ సుమారు రూ.24 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ఆ ప్రయాణికుడిని అదుపులోకి తీసుకున్న అధికారులు.. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
వచ్చే ఎన్నికల్లో తెలంగాణ సీఎం అయ్యేది నేను కాదు, ఆయనే.. కేటీఆర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
తెలంగాణ రాజకీయాలపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను ముఖ్యమంత్రి అభ్యర్థిని కాదని తేల్చి చెప్పారు. అయితే బీఆర్ఎస్ పార్టీ తిరిగి తెలంగాణలో అధికారంలోకి రావడం ఖాయమని.. అప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని చెప్పారు. కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో అసంతృప్తి ఉందని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్-బీజేపీ పొత్తు ఉండబోదని స్పష్టం చేశారు. డీలిమిటేషన్లో దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం, ఎస్ఐఆర్ ప్రక్రియ పారదర్శకతపైనా ప్రశ్నలు లేవనెత్తారు.
రాశిఫలాలు 01 అక్టోబర్ 2026: సిద్ధి యోగం వేళ కర్కాటకం, మకరం సహా ఈ 5 రాశులకు శ్రీ మహావిష్ణువు అనుగ్రహం!
రాశిఫలాలు 01 అక్టోబర్ 2026: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం గురువారం రోజున చంద్రుడు వృషభ రాశిలో సంచారం చేయనున్నాడు. ఇదే సమయంలో ద్వాదశ రాశులపై రోహిణి నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో పాటు సిద్ధి, గౌరీ యోగాలు ఏర్పడనున్నాయి. అంతేకాదు ఇది శ్రీ మహా విష్ణువుకు అంకితం ఇవ్వబడిన రోజు. మరోవైపు ఇదే రోజున గురుడు కర్కాటక రాశిలో ఉచ్చ స్థానంలో సంచారం చేస్తూ హంస రాజయోగాన్ని ఏర్పరచనున్నాడు. దీంతో పాటు గౌరీ యోం కూడా ఏర్పడనుంది. అంతేకాదు తులా రాశిలో శుక్రుడు, బుధుడు సంచారం చేయనున్నారు. ఈ శుభ సమయంలో కర్కాటకం సహా కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు రానున్నాయి. మరికొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు రానున్నాయి. ఈ సందర్భంగా మేషం నుంచి మీన రాశుల వారికి ఏ మేరకు శుభ ఫలితాలు రానున్నాయి, ఎవరికి అశుభ ఫలితాలు రానున్నాయనే ఆసక్తికరమైన విషయాలను ప్రముఖ పండితులు ‘‘ఆచార్య క్రిష్ణ దత్త శర్మ’’ మాటల్లో తెలుసుకుందాం.
October Horoscope 2026: అక్టోబర్‌లో దసరా పండుగ వేళ అత్యంత శుభయోగాలు.. సింహం సహా ఈ 5 రాశులకు విజయావకాశాలు
October Horoscope 2026: హిందూ మత విశ్వాల ప్రకారం, ఏ ఏడాది అక్టోబర్ మాసంలో దసరా నవరాత్రులు జరగనున్నాయి. ఇదే నెలలో విజయదశమి పండుగ వేళ అక్టోబర్ 20న లక్ష్మీనారాయణ యోగం, మాళవ్య రాజయోగాలు ఏర్పడనున్నాయి. అంతేకాదు ఈ మాసంలో అనేక గ్రహాల సంచారం కారణంగా అత్యంత శుభప్రదమైన యోగాలు ఏర్పడనున్నాయి. అంతకుముందు అక్టోబర్ 3న శుక్రుడు తులా రాశిలో తిరోగమనం చెందనున్నాడు. ఇదే నెలలో 17వ తేదీన సూర్యుడు కూడా తులా రాశిలో ప్రవేశించనున్నాడు. ఈ సమయంలో బుధుడు కూడా ఇదే రాశిలో నివాసం ఉంటాడు. ఈ మూడు గ్రహాల కలయిక కారణంగా త్రిగ్రాహి యోగం ఏర్పడనుంది. అంతేకాదు సూర్యుడు, బుధుడి సంయోగం వల్ల బుధాదిత్య యోగం కూడా ఏర్పడనుంది. అంతేకాదు కర్కాటక రాశిలో గురుడు హంస రాజయోగాన్ని, కుజుడు నీచభంగ రాజయోగాలను ఏర్పరచనున్నాడు. ఈ శుభ యోగాల ప్రభావంతో కర్కాటకం, సింహం సహా ఐదు రాశుల వారికి గణనీయమైన ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది. ఈ సందర్భంగా అక్టోబర్ నెలలో ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు రానున్నాయనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
శుభ్‌మన్ గిల్ డబుల్ సెంచరీ.. రికార్డ్ ఛేజ్ పూర్తి చేసిన భారత్..!
వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డేలో భారత్ 406 పరుగుల కొండంత లక్ష్యాన్ని ఛేదించి ఆల్-టైమ్ రికార్డు విజయాన్ని అందుకుంది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కేవలం 117 బంతుల్లోనే ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ బాది, 133 బంతుల్లో 223 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. రోహిత్ శర్మ సెంచరీతో రాణించడంతో భారత్ 43.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ముద్దాడి 2-0తో వన్డే సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఇరు జట్ల మధ్య మూడో వన్డే అక్టోబర్ 3న జరగనుంది.

