తమిళనాడులో పురుషుల మరణాల సంఖ్య మహిళల కంటే రెట్టింపులో ఉంది. వరుసగా గత మూడేళ్ల నుంచి ఈ వ్యత్యాసం మరింత ఎక్కువగా ఉంది. అక్కడ 15 ఏళ్లు దాటిన వారి మరణాల్లో మహిళ కంటే పురుషుల సంఖ్య అధికంగా ఉంది. ఈ మరణాల్లో ఎక్కువ శాతం యువత రోడ్డు ప్రమాదాలు, ఆత్మహత్యలే కారణమని తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. అలాగే, ఆరోగ్యం విషయంలో పురుషులు 40 ఏళ్లు దాటే వరకు ఎటువంటి పరీక్షలు చేయించుకోరు. దీంతో వ్యాధులను ముందుగా గుర్తించలేని పరిస్థితి.
పాక్ ఉగ్రమూకలకు గేట్వేగా ఇన్‌స్టా రీల్స్… షెహజాద్ భట్టీ ట్రాప్‌లో గుజరాత్ యువకులు!
దేశంలో అలజడి సృష్టించడానికి దాయాది పాకిస్థాన్ చేయని ప్రయత్నం లేదు. తాజాగా, సోషల్ మీడియాకు అలవాటుపడిన యువతకు డబ్బు, విలాసవంతమైన జీవితం ఆశచూపి వారిని ట్రాప్ చేసింది. అయితే, దీనిని ముందే భద్రతా, నిఘా వర్గాలు పసిగట్టడంతో కుట్ర భగ్నం అయ్యింది. గుజరాత్‌కు చెందిన ఇద్దరు యువకులు పాక్ ఉగ్రవాది షెహజాద్ భట్టీ ట్రాప్‌లో పడ్డారు. అతడ్ని మోడల్, సెలబ్రిటీ అనుకుని పొరబడ్డారు. చివరకు ఏటీఎస్ అధికారులు అసలు విషయం చెప్పడంతో షాకయ్యారు.
భారతీయ విమానాలకు గగనతలాన్ని మూసేసిన పాకిస్థాన్.. ప్రత్యామ్నాయ మార్గం కోసం చైనాతో భారత్ చర్చలు
గతేడాది ఏప్రిల్‌లో జరిగిన పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. దీంతో భారత్, పాక్‌లు పరస్పరం ప్రయాణికుల విమానాలకు గగనతలాన్ని మూసివేశాయి. ఏడాదిన్నరగా భారతీయ విమానాలను నిషేధించిన పాకిస్థాన్.. ఇటీవల దానిని మరో నెల రోజులకు పొడిగించింది. ఈ నేపథ్యంలో భారత్.. తక్కువ దూరం మార్గం కోసం చైనాతో సంప్రదింపులు జరుపుతోంది. జిన్జియాంగ్ ప్రావిన్సుల మీదుగా భారతీయ ఎయిర్‌లైన్స్ విమానాలు నడిపేందుకు అనుమతించాలని చైనా అధికారులను కోరింది.
నాకు ఎక్కువ సమయం లేదు.. నన్ను మన ఏపీకి చేర్చండి : అమెరికా నుంచి NRI భరత్ వేడుకోలు
క్యాన్సర్‌తో పోరాడుతూ చివరి దశలో ఉన్న NRI భరత్ పరిస్థితి అందరిని కలచివేస్తోంది. ఆస్పత్రి బెడ్ మీద ఉంటూనే ఆయన చేసిన వీడియో సోషల్ మీడియాలో ఎందరి గుండెలనో తాకుతుంది. తన ఆఖరి శ్వాస తన మాతృభూమి ఆంధ్రాలోనే వదలాలనుకుంటున్నాని, దీనికి సహకరించాలని భరత్ వేడుకుంటున్నారు. భరత్ ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. గత నాలుగేళ్లుగా ఆయన క్యాన్సర్ బాధపడుతున్నారు. ఆయనకు పెద్ద సమయం కూడా లేదని డాక్టర్లు తేల్చేశారు. ఈ నేపథ్యంలో భరత్ తనను ఇండియాకు తీసుకొచ్చేలా ఏర్పాట్లు చేయమని ఏపీ ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
పూజలు చేసిన రోజే అపశృతి.. సలసలా కాగుతున్న ఉక్కు లీక్.. వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో తృటిలో తప్పిన మహా ప్రమాదం
స్టీల్‌ప్లాంట్‌లో పెను ప్రమాదం తప్పింది. ఎస్ఎంఎస్-1 సీసీడీ విభాగంలో ద్రవ రూపంలో సలసలా కాగుతున్న ఉక్కును తరలించే ల్యాడిల్ గేటు సరిగ్గా క్లోజ్ కాకపోవడంతో వేడి వేడి ఉక్కు ద్రవం నేల మీద పడింది. ఆ సమయంలో సిబ్బంది వెంటనే అప్రమత్తమైన దూరంగా జరిగిపోయారు. దాంతో ఎటువంటి ప్రాణహాని జరగలేదు. దీంతో అక్కడున్న కార్మికులు ఊపిరి పీల్చుకున్నారు. స్టీల్‌ప్లాంట్‌లో పదే పదే జరుగుతున్న యాక్సిడెంట్లపై సీఐటీయూ వంటి కార్మిక సంఘాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. ఇలాంటివి జరగక్కుండా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి.
పదే పదే కాల్స్, మెసేజ్‌లు చేస్తున్నారా?.. అది స్టాకింగ్‌లో భాగమే : ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్
భౌతిక దాడులు కంటే.. ఆన్లైన్ వేదింపులు విపరీతంగా పెరిగాయని ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ ఆందోళన వ్యక్తం చేశారు. తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో రాష్ట్ర మహిళా కమిషన్ నిర్వహించిన స్టాకింగ్ నివారణ అవగాహన సదస్సులో ఆమె ప్రసంగించారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా, వాట్సాప్ వంటి మాధ్యమాలను వినియోగించి దుండగులు మహిళల పర్సనల్ వివరాలను సేకరిస్తున్నారని చెప్పారు. ఆన్లైన్ వేధింపులకు గురైనప్పుడు మహిళలు భయపడకుండా ఇంట్లో వాళ్లకి చెప్పాలని, సకాలంలో పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు.

