దీర్ఘకాలంగా మెడిసిన్ వాడేవారి కాలేయం దెబ్బతినే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇలా జరగకుండా ఉండాలంటే మందులు వేసుకునే వారు ఈ ఆహారాలు తినడం మంచిది.
వనదేవతల సన్నిధిలో ‘ది ప్యారడైజ్’ టీమ్: సమ్మక్క-సారలమ్మకు నాని నిలువెత్తు బంగారం మొక్కు
నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వచ్చిన భారీ యాక్షన్ చిత్రం ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ వద్ద రికార్డు వసూళ్లతో దూసుకుపోతోంది. ప్రారంభంలో నెగెటివ్ టాక్, విమర్శలు వచ్చినప్పటికీ నాని క్రేజ్‌తో తొలి నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.155 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఈ భారీ విజయోత్సాహంలో చిత్ర బృందం ములుగు జిల్లాలోని గట్టమ్మ తల్లిని దర్శించుకుని, అనంతరం మేడారంలోని సమ్మక్క-సారలమ్మ వనదేవతలకు మొక్కులు చెల్లించుకుంది. నాని అమ్మవార్లకు తన నిలువెత్తు బంగారం (బెల్లం), పసుపు కుంకుమలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిత్ర దర్శకుడు శ్రీకాంత్ ఓదెల, నిర్మాత సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
‘సత్య’ పాత్ర నా కెరీర్‌ని మలుపు తిప్పింది.. తారక్‌తో స్నేహం ఎప్పటికీ ప్రత్యేకమే: రాజీవ్ కనకాల ఎమోషనల్ పోస్ట్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన క్లాసిక్ హిట్ చిత్రం ‘స్టూడెంట్ నెంబర్ వన్’ విడుదలై 25 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా చిత్రంలో ‘సత్య’ పాత్రలో మెప్పించిన నటుడు రాజీవ్ కనకాల సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ చేశారు. ఈ సినిమాతోనే తాను పూర్తిస్థాయి నటుడిగా మారాడని, విడుదల సమయంలో ‘ఫ్లాప్’ అన్నవాళ్ల నోళ్లు మూయిస్తూ 42 కేంద్రాల్లో 100 రోజులు ఆడి ఘనవిజయం సాధించిందని గుర్తుచేసుకున్నారు. ఎన్టీఆర్‌తో జీవితాంతం నిలిచే స్నేహాన్ని అందించినందుకు, అవకాశం ఇచ్చిన రాజమౌళి, రాఘవేంద్రరావు, కీరవాణిలకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
భార్యతో కలిసి వెకేషన్లో అల్లు అర్జున్ చిల్… ‘హ్యాపీ బర్త్‌డే క్యూటీ’ అంటూ స్వీట్ విషెస్
అర్ధరాత్రి లౌడ్ స్పీకర్లపై అల్లు శిరీష్ చేసిన ఫిర్యాదును అడ్డుపెట్టుకుని, యాంటీ ఫ్యాన్స్ ‘ఏఏఏ సినిమాస్’ ట్రాఫిక్, సంధ్య థియేటర్ పాత ఘటనలను తెరపైకి తెస్తూ అల్లు అర్జున్‌పై తీవ్ర ట్రోలింగ్‌కు దిగారు. అయితే ఈ విమర్శలను ఏమాత్రం పట్టించుకోని బన్నీ, తన సతీమణి స్నేహారెడ్డి పుట్టినరోజును సముద్రతీరంలో ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. ఇద్దరూ కలిసి దిగిన రొమాంటిక్ సెల్ఫీని షేర్ చేస్తూ “హ్యాపీ బర్త్‌డే క్యూటీ” అంటూ ప్రేమపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. అల్లు ఆర్మీ ఈ ట్రోల్స్‌ను తిప్పికొడుతుండగా, అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ‘రాకా’లో నటిస్తున్నారు.
NBK 112: ఒకే ఫ్రేమ్‌లో ఇద్దరు బాలయ్యలు.. కొరటాల మూవీలో పూనకాలు తెప్పించే డ్యూయల్ రోల్!
నటసింహం నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కనున్న ప్రతిష్టాత్మక చిత్రంపై క్రేజీ అప్డేట్ వెలుగులోకి వచ్చింది. ఈ చిత్రంలో బాలయ్య తండ్రీకొడుకులుగా రెండు విభిన్నమైన, భిన్నధృవాల వంటి పాత్రల్లో ద్విపాత్రాభినయం చేయనున్నట్లు సమాచారం. కొరటాల శివ మార్క్ రాజకీయ అంశాలు, బలమైన కుటుంబ భావోద్వేగాల మేళవింపుతో ఈ కథ రూపొందింది. గాయం నుంచి కోలుకున్న బాలకృష్ణ, అక్టోబర్‌లో గోపీచంద్ మలినేని చిత్రం పూర్తిచేసి, డిసెంబర్ మొదటి వారం నుంచి కొరటాల సినిమా రెగ్యులర్ షూటింగ్లో పాల్గొననున్నారు.
ఒక్క ట్వీట్‌తో మంట పెట్టిన అల్లు శిరీష్.. బన్నీని టార్గెట్ చేస్తూ యాంటీ ఫ్యాన్స్ భారీగా ట్రోలింగ్
హైదరాబాద్ షేక్‌పేట్ పరిధిలో అర్ధరాత్రి వేళల్లో మితిమీరిన శబ్దంతో డీజేలు, లౌడ్ స్పీకర్లు పెడుతున్నారంటూ నటుడు అల్లు శిరీష్ పోలీసులకు చేసిన ఫిర్యాదు తీవ్ర వివాదానికి దారితీసింది. ఇది భక్తికి వ్యతిరేకం కాదని, పౌర బాధ్యత (సివిక్ సెన్స్)కు సంబంధించిన విషయమని శిరీష్ వివరణ ఇవ్వగా, పోలీసులు ఆ మైకులను తొలగించారు. అయితే ఈ ట్వీట్‌ను అడ్డం పెట్టుకుని యాంటీ ఫ్యాన్స్ అల్లు అర్జున్‌పై తీవ్రస్థాయిలో ట్రోలింగ్‌కు దిగారు. కోకాపేటలోని ‘ఏఏఏ సినిమాస్’ వల్ల వచ్చే ట్రాఫిక్ జామ్‌లు, సంధ్య థియేటర్ వద్ద జరిగిన పాత ఘటనలను గుర్తుచేస్తూ బన్నీని టార్గెట్ చేయడంతో, అల్లు ఆర్మీ కూడా దీటుగా కౌంటర్లు ఇస్తూ ఫ్యాన్ వార్‌ను తీవ్రతరం చేసింది.
తెలంగాణలో మనుగడ నుంచి ప్రత్యామ్నాయం దిశగా బీజేపీ..? 1000 రోజుల్లో రాష్ట్ర రాజకీయాల్లో కమలదళం ఎక్కడ?
బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో తెలంగాణలో బీజేపీ దూకుడుగా వ్యవహరించింది. అయితే అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆయన స్థానంలో కిషన్ రెడ్డికి అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 8 సీట్లు మాత్రమే గెలిచిన బీజేపీ.. 2024 లోక్ సభ ఎన్నికల్లో మెరుగైన ప్రదర్శన చేసింది. అయితే ఆ తర్వాత జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో 320 వార్డులే గెలవగలిగింది. కిషన్ రెడ్డి స్థానంలో రామచందర్ రావు రాష్ట్ర పార్టీ పగ్గాలు చేపట్టారు.
మీ ఇంట్లో జెర్రుల సమస్య ఉందని తెలియజేసే సంకేతాలు, అసలు ఎందుకు వస్తాయో తెలుసా?
జెర్రులు అదేనండీ కాళ్ళ జెర్రులు వల్ల ఇంటికి పెద్దగా నష్టం కలిగించకపోయినా, ఇంట్లో అవి అకస్మాత్తుగా కనిపిస్తే తీవ్రమైన అసహ్యం, భయం కలగడం సహజం. వాతావరణం మారినప్పుడు లేదా వేడి పెరిగినప్పుడు ఇవి ఆశ్రయం కోసం నివాసాల వైపు వస్తుంటాయి. చూడ్డానికి భయంకరంగా ఉన్నప్పటికీ, జీవావరణం పరంగా జెర్రులు ఒక రకమైన సహజ పెస్ట్ కంట్రోల్ ఏజెంట్లు. ఇవి మనుషులకు వ్యాధులను వ్యాపింపజేసే క్రిములు కావు.
పైగా ఇళ్లలో డెంగ్యూ, మలేరియా కలిగించే దోమలు, నల్లులు, చెదపురుగులు, బొద్దింకలను వేటాడి తిని వాటి సంఖ్యను నియంత్రిస్తాయి. జెర్రీ కుట్టినప్పుడు సాధారణంగా తీవ్రమైన నొప్పి, చర్మం ఎర్రబడటం, తేనెటీగ లేదా తేలు కుట్టినట్లుగా వాపు రావచ్చు. అయినప్పటికీ భద్రత దృష్ట్యా ఇంట్లోకి రాకుండా చూసుకోవడమే శ్రేయస్కరం. అసలు ఇవి ఇంట్లోకి ఎందుకు వస్తాయి, రాకుండా ఆపడానికి పాటించాల్సిన చిట్కాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
యువకుల్లో హార్ట్ ఎటాక్స్ ఎందుకు పెరుగుతున్నాయి, కొన్ని విషయాలని నెగ్లెక్ట్ చేస్తే గుండెకి అస్సలు మంచిది కాదు
గుండె సమస్యలు రావడానికి చాలానే కారణాలు ఉంటాయి. వయసుతో సంబంధం లేకుండా చిన్న వయసులోనే వచ్చే గుండె సమస్యలకి హై బీపి, కొలెస్ట్రాల్ పెరగడం, బ్లడ్ షుగర్ పెరగడం, అధిక బరువు, స్మోకింగ్ వంటి కారణాలు ఉంటాయి. ఇవన్నీ కూడా సంవత్సరాల తరబడి గుర్తించకుండా ఉండడంతో అవి రక్తనాళాలు, గుండె ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. కొన్ని పరిశోధనల్లో తేలిన విషయం ఏంటంటే 30 ఏళ్ళు దాటక ముందే ప్రతీ ఒక్కరూ గుండె విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. యువకులు ముందునుంచే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్ జగదీష్ మదిరెడ్డి(కన్సల్టెంట్, ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, యశోద హాస్పిటల్స్, హైదరాబాద్) చెబుతున్నారు.
పాల ప్యాకెట్ కొనేటప్పుడు డేట్ మాత్రమే కాదు మరికొన్ని వివరాలు కూడా చూడాలి, అవేమిటంటే?
పాల ప్యాకెట్‌పై ఉండే వివరాలు కేవలం వ్యాపార నియమాలు మాత్రమే కాదు. మన ఆరోగ్యానికి ఒక ముఖ్యమైన సమాచార వంతెన. మారిన నేటి ఆహారపు అలవాట్లలో మనం ఏ రకమైన పోషకాలను శరీరానికి అందిస్తున్నామో తెలుసుకోవడానికి ప్యాకెట్ లేబుల్స్ ఎంతో ఉపయోగపడతాయి. నకిలీ ఉత్పత్తులు, నాణ్యతా లోపాలు ఎక్కువవుతున్న ప్రస్తుత రోజుల్లో చైతన్యవంతమైన వినియోగదారుడిగా మారడం ప్రతి ఒక్కరి బాధ్యత. ప్యాకెట్‌ను క్షణ్ణంగా పరిశీలించడం ద్వారా కల్తీ పాలను గుర్తించి, కుటుంబానికి సురక్షితమైన ఆహారాన్ని అందించవచ్చు.

