Home Blog Page 105

బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఫేవరెట్ అలవాటు, ఖాళీ కడుపుతో రోజూ మూడు కప్పుల కాఫీ తాగితే ఏమవుతుంది?

0
బాలీవుడ్ కింగ్ షారుఖ్ ఖాన్ చాలా రోజుల తర్వాత ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా ఫ్యాన్స్‌తో నిర్వహించిన ‘#AskSRK’ సెషన్‌లో పలు ఆసక్తికర విషయాల్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా ఒక అభిమాని, “నిజాయితీగా చెప్పండి, మీ నిజ జీవితంలో మీరు చేసే అత్యంత ‘కింగ్ లాంటి పని’ ఏంటి?” అని అడగ్గా, షారుఖ్ బదులిస్తూ “ఉదయాన్నే మూడు కప్పుల కాఫీ తాగడమే” అని సరదాగా చెప్పారు.

మంచం దిగగానే, తనతో ఎవరైనా మాట్లాడటానికి ముందే కాఫీ కచ్చితంగా కావాలని, షూటింగ్‌కు ఆలస్యమవుతున్నా సరే ఈ 3 కప్పుల కాఫీ తాగడం మాత్రం ఆపనని ఆయన పేర్కొన్నారు. సాధారణంగా వర్క్‌హోలిక్స్ (ఎక్కువగా పనిచేసేవారు), కాఫీ ప్రియుల్లో ఈ అలవాటు తరచుగా కనిపిస్తుంది. అయితే, అందరికీ ఉదయాన్నే వరుసగా మూడు కప్పుల కాఫీ తాగడం సరిపడుతుందా? దీనివల్ల ఎలాంటి ప్రభావాలు ఉంటాయో వివరంగా చీఫ్ డైటీషియన్ డాక్టర్ సుజాత స్టీఫెన్ (యశోద హాస్పిటల్స్, హైదరాబాద్) వివరించారు. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

వైరల్ అయిన బనానా బోటాక్స్‌ని ట్రై చేసిన హీరోయిన్ అదాశర్మ, ముఖంపై ముడతలు పోగొట్టేందుకు నిజంగానే ఈ టిప్ పనిచేస్తుందా

0
ఒకప్పుడు స్కిన్ కేర్ అంటే ముఖాన్ని క్లీన్ చేయడం ఆ తర్వాత పసుపు వంటివి రాయడం. కానీ, ఇప్పుడలా కాదు. ఇప్పటి పొల్యూషన్‌కి చర్మాన్ని కాపాడుకోవడానికి రకరకాల పరిష్కారాలన్నీ మార్కెట్లోకి వస్తూనే ఉన్నాయి. పాపులర్ అవుతూనే ఉన్నాయి. ఓ వైపు మొటిమల దగ్గర్నుంచీ మచ్చలు, ముడతల్ని పోగొడతాయంటూ రోజుకో కొత్త ప్రోడక్ట్ మార్కెట్లోకి వస్తున్నా.. మరోవైపు ఇంటి చిట్కాలు కూడా అంతే పాపులర్ అవుతున్నాయి. అలాంటి వాటిలో బనానా బోటాక్స్ ఒకటి.
ముఖంపై వచ్చిన ముడతల్ని దూరం చేయడంలో ఇది ఈ మధ్యకాలంలో పాపులర్ అవుతున్న ట్రెండ్. ఎప్పట్నుంచో ఈ బనానా బోటాక్స్ ఉన్నప్పటికీ ఇప్పుడు సెలబ్రిటీలు కూడా వీటిని ఫాలో అవ్వడంతో మరింతగా పాపులర్ అయింది. రీసెంట్‌గా నటి అదాశర్మ బనానా బోటాక్స్‌ని ట్రై చేసింది. అసలు, దీనిని ఫాలో అయితే నిజంగానే ముడతలు తగ్గుతాయా తెలుసుకుందాం.

Bank Holidays Oct 2026: గాంధీ జయంతి, దసరా, దుర్గ పూజ.. అక్టోబర్‌లో బ్యాంకులకు భారీగా సెలవులు.. ఏయే రోజు మూతపడతాయంటే?

0
Bank Holidays Oct 2026: అక్టోబర్ నెలలో వివిధ రకాల పండగలు, జాతీయ సెలవులు ఉన్నాయి. గాంధీ జయంతి, దసరా, దుర్గ పూజ వంటి ప్రధాన రోజులతో పాటు ప్రాంతీయ సెలవుల కారణంగా బ్యాంకులకు భారీగా సెలవులు వస్తున్నాయి. వివిధ రాష్ట్రాల్లో కలిపి మొత్తంగా 16 రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. అయితే, ఇది ప్రాంతాలను బట్టి మారుతుంది. ఆదివారాలు, రెండో, నాలుగో శనివారాలు సాధారణ సెలవు ఉంటుంది. అక్టోబర్ 2026 సెలవుల జాబితా ఓసారి పరిశీలిద్దాం.

అదరగొట్టిన HDFC స్కీమ్.. రూ.10 వేల SIP పెట్టుబడితో రూ.23 కోట్లొచ్చాయ్.. రూ.1 లక్ష కోట్లు దాటిన AUM

0
HDFC Flexi Cap Fund Returns: ప్రముఖ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ హెచ్‌డీఎఫ్‌సీ మ్యూచువల్ ఫండ్ తీసుకొచ్చిన ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ అదరగొట్టింది. లాంగ్ టర్మ్‌లో ఇన్వెస్టర్లను కోటీశ్వరులను చేసింది. ఈ ఫండ్ లాంచ్ అయినప్పటి నుంచి నెలకు రూ.10 వేల చొప్పున సిప్ పెట్టుబడి పెట్టినట్లయితే ఏకంగా రూ.23 కోట్లు వస్తాయి. అంతే కాదు ఈ ఫండ్ ఆస్తుల విలువ రూ.1 లక్ష కోట్ల మార్క్ దాటడం గమనార్హం. మరి ఈ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ గురించిన వివరాలు తెలుసుకుందాం.

Cement Price Hike: సిమెంట్ ధరలకు రెక్కలు.. సెప్టెంబర్‌లో బస్తాకు రూ.7 పెంచారు.. అక్టోబర్‌లో మరో రూ.20 పెంచుతారట!

0
Cement Price Hike: కొత్త ఇల్లు కట్టుకునే వారు, పాత ఇంటిని పునరుద్ధరించుకునే వారికి చేదు వార్త. సిమెంట్ ధరలు భారీగా పెరగనున్నాయి. ఇప్పటికే సెప్టెంబర్ నెలలో బస్తాపై రూ.7 చొప్పున పెంచిన సిమెంట్ తయారీ కంపెనీలు, ఇప్పుడు అక్టోబర్ నెలలో రూ.5 నుంచి రూ.20 వరకు పెంచేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే నిర్మాణ వ్యయం మరింత పెరగనుంది. ఇది సామాన్యులకు భారంగా మారనుంది. సిమెంట్ ధరల పెరుగుదలకు గల కారణాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

చిన్న వ్యాపారులకు గుడ్‌న్యూస్.. PMSYM ఖాతాను పునరుద్ధరించుకునే ఛాన్స్.. నెలకు రూ.3000 పెన్షన్ ఇవ్వనున్న కేంద్రం!

0
PMSYM Revival: కిరాణా దుకాణాల వంటి చిన్న చిన్న వ్యాపారాలు నిర్వహిస్తున్నవారికి, స్వయం ఉపాధి పొందుతున్న వారికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భరోసా ఇచ్చే పీఎంఎస్‌వైఎంలో ఖాతా ఉండి ప్రస్తుతం ఇనాక్టివ్‌గా ఉన్నట్లయితే దానిని తిరిగి పునరుద్ధరించుకునేందుకు కేంద్రం అవకాశం కల్పిస్తోంది. కేవలం రూ.55 నుంచి రూ.200 చెల్లిస్తే నెలకు రూ.3 వేల వరకు పెన్షన్ లభిస్తుంది. మరి ఈ ఖాతాను ఎలా పునరుద్ధరించుకోవాలి? అనేది తెలుసుకుందాం.

Orient Cables IPO: ఈ ఐపీఓలో షేర్లు వస్తే పండగే.. 26 శాతం పెరిగిన జీఎంపీ.. 14 రెట్లకుపైగా సబ్‌స్క్రైబ్ అయిన ఓరియంట్ కేబుల్స్ ఇష్యూ!

0
Orient Cables IPO: స్మాల్ క్యాప్ కేటగిరీలోని కేబుల్స్ తయారీ కంపెనీ ఓరియంట్ కేబుల్స్ లిమిటెడ్ ఐపీఓకు విశేషమైన స్పందన లభించింది. 14 రెట్లకుపైగా సబ్‌స్క్రిప్షన్స్ వచ్చాయి. దీంతో ఈ ఐపీఓ జీఎంపీ 26 శాతం మేర పెరిగింది. ఇష్యూ ధరతో పోలిస్తే 26 శాతం ప్రీమియంతో లిస్ట్ అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ ఐపీఓ గూగుల్ ట్రెండ్స్‌లో ఉంది. ఈ క్రమంలో ఓరియంట్ కేబుల్స్ ఐపీఓ గురించిన వివరాలు తెలుసుకుందాం.

స్టీల్ పైపు, నీళ్ల బాటిల్.. ఎడారిలో మొక్కలను బతికించేలా చైనా బాలుడి ఆవిష్కరణ..!

మన దగ్గర 14 ఏళ్ల పిల్లాడు ఏం చేస్తాడు.. బడికెళ్లి పాఠాలు నేర్చుకుంటాడు. సాయంత్రం ఇంటికొచ్చి మళ్లీ ట్యూషన్‌కు వెళ్లి.. జేఈఈ లేదా నీట్ కోసం ఇప్పటి నుంచే సన్నద్ధం అవుతుంటాడు. కానీ చైనాకు చెందిన 14 ఏళ్ల పిల్లాడు మాత్రం ఎడారిలో మొక్కలను బతికించడానికి అద్భుతమైన ఆవిష్కరణ చేశాడు. గాలిలోని తేమ నుంచి నీటిని ఒడిసిపట్టి.. ఆ నీటిని మొక్కల వేర్లకు అందే ఏర్పాటు చేశాడు. అది కూడా ప్లాస్టిక్ బాటిళ్లు, స్టీల్ పైపుల సాయంతో. ఆ కథేంటో చూద్దాం పదండి..

న్యూయార్క్ టైమ్స్ టెక్ ఉద్యోగిని కాల్చి చంపిన అత్తామామలు.. ‘ట్రాన్స్‌జెండర్’ వివాదమే కారణమా?

అమెరికాలోని కాలిఫోర్నియాలో తీవ్ర దిగ్భ్రాంతికర సంఘటన చోటుచేసుకుంది. న్యూయార్క్ టైమ్స్ టెక్ విభాగం ఉద్యోగి జొనాథన్ మెకిన్సీని ఆయన అత్తామామలే తుపాకీతో కాల్చి చంపారు. ట్రాన్స్‌జెండర్ గుర్తింపు కారణంగా తలెత్తిన తీవ్ర కుటుంబ వివాదాలే ఈ హత్యకు కారణమని భావిస్తుండగా.. పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేసి విచారణ వేగవంతం చేశారు. ముఖ్యంగా మెకిన్సీని చంపడానికి ఉపయోగించిన తుపాకీని కూడా ఇప్పటికే స్వాధీనం చేసుకున్నారు. ఆ పూర్తి వివరాలు మీకోసం.

నెతన్యాహుకు అక్టోబర్ గండం.. ఇజ్రాయెల్ ప్రధాని రిక్వెస్ట్‌ను తిరస్కరించిన యూఏఈ.. వాట్ నెక్స్ట్..?

ఇజ్రాయెల్ ఎన్నికల ముంగిట ఆ దేశ ప్రధాని నెతన్యాహు.. అకస్మాత్తుగా యూఏఈ పర్యటనకు వెళ్లారు. 4 గంటల ఈ పర్యటనలో ఆయన యూఏఈ అధ్యక్షుడితో సమావేశం అయ్యారు. ఇజ్రాయెల్‌తో అధికారికంగా సంబంధాలను నిర్వహించని.. పశ్చిమ దేశాల అధికారులతో కూడా ఈ పర్యటనలో ఆయన భేటీ అయ్యారని తెలుస్తోంది. 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ దాడులు చేసింది. ఈ దాడుల గురించి యూఏఈ అధ్యక్షుడు పది రోజుల ముందే నెతన్యాహును హెచ్చరించారని ఇటీవల కథనాలు వచ్చాయి.